కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా ఇటీవల యూరోపియన్ మార్కెట్లో తన 11 వ తరం హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ లో అనేక అప్డేట్స్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ అందించింది. హోండా యొక్క పోర్ట్‌ఫోలియోలో హోండా సివిక్ అనేది చాలా బలమైన ఉత్పత్తి అవుతుంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

హోండా సివిక్ కారు గత 50 సంవత్సరాలుగా మార్కెట్లో విక్రయించబడుతోంది. కానీ యూరోపియన్ మార్కెట్ కోసం ప్రవేశపెట్టబడిన ఈ కారు మునుపటికంటే ఎక్కువ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, హోండా సివిక్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రానుంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

కంపెనీ నివేదికల ప్రకారం 2022 నాటికి యూరోపియన్ మార్కెట్లో ఎలక్ట్రిఫైడ్ పవర్‌ట్రెయిన్‌ కలిగిన వాహనాలను ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్‌లో లభించే పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, దీనిని ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

ఈ ఇంజిన్‌తో కంపెనీ ఈ:హెచ్‌ఇవి సిస్టం కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే ఈ ఇంజిన్ యొక్క పవర్ అవుట్ ఫుట్ గణాంకాలను హోండా కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ హైబ్రిడ్ సిస్టంను హోండా జాజ్ మరియు జాజ్ క్రాస్‌స్టార్‌తో మాత్రమే ఉపయోగిస్తోంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ విషయానికొస్తే, కొత్త తరం సివిక్ హ్యాచ్‌బ్యాక్ మునుపటికంటే కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, అంతే కాకుండా ఇది వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. హోండా కార్స్ తన సివిక్ సెడాన్‌ను భారత మార్కెట్లో కూడా విక్రయిస్తోంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

భారత మార్కెట్లో ఈ హోండా సివిక్ సెడాన్ అమ్మకాలు తక్కువగా ఉన్నందున, కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసింది. అంతే కాకుండా కంపెనీ హోండా సివిక్‌ను సమీకరించే గ్రేటర్ నోయిడాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని కూడా మూసివేసింది. కావున భారతీయ మార్కెట్లో హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

హోండా సివిక్ హ్యాచ్‌బ్యాక్ వెల్లడించడానికి ముందు, హోండా తన కొత్త తరం హోండా సివిక్ సెడాన్‌ను ఏప్రిల్ నెలలో వెల్లడించింది. కంపెనీ ఈ సెడాన్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. కొత్త తరం హోండా సివిక్ సెడాన్ ఈ ఏడాది చివర్లో యుఎస్‌ఎలో విడుదల కానున్నట్లు సమాచారం.

కొత్త సివిక్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించిన హోండా.. భారత్‌లో విడుదలవుతుందా?

కంపెనీ ఈ కొత్త హోండా సివిక్ సెడాన్ ని జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో విడుదల చేసిన తరువాత, కంపెనీ కొత్త తరం హోండా సివిక్ సెడాన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేస్తుంది. కొత్త 2022 హోండా సివిక్ సెడాన్ సివిక్ ప్రోటోటైప్‌తో సమానంగా కనిపిస్తుంది. దాని నమూనా 2020 నవంబర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New Gen Honda Civic Hatchback Revealed For European Market. Read in Telugu.
Story first published: Saturday, June 26, 2021, 12:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X