Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన జీప్ : పూర్తి వివరాలు
అమెరికన్ కార్ బ్రాండ్ జీప్, తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 2020 గ్వాంగ్‌జౌ ఆటో షోలో ఆవిష్కరించబడిన ఎస్‌యూవీ మాదిరిగానే ఉంటుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. జనవరి 2021 చివరి నాటికి ఈ కారు యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభించబడుతుంది.

జీప్ కంపాస్ 2017 లో భారత మార్కెట్లోకి ప్రవేసింది. 2017 నుంచి ఇప్పటికి మూడు సంవత్సరాల తరువాత అనేక అప్డేట్ ఫీచర్స్ తో ఆవిష్కరించబడింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ ఫీచర్స్, అప్డేటెడ్ ఇంటీరియర్స్ మరియు రిఫ్రెష్ స్టైలింగ్ కలిగి ఉంది.

కొత్త జీప్ కంపాస్ యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో సవరించిన హెడ్‌లైట్లు, హానీ కూంబ్ ఇన్సర్ట్‌లతో అప్డేట్ చేసిన 7 స్లాట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌తో కొత్త ఫ్రంట్ బంపర్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీకి కొత్త అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ ఎస్‌యూవీ యొక్క వెనుక వైపు పెద్దగా మార్పు జరగలేదు.
MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి

కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క లోపలి భాగం ఎక్కువగా అప్డేట్ చేయబడింది, ఇందులో కొత్త ఫ్లోటింగ్ 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజింగ్‌తో ఉంటుంది, వీటి క్రింద స్లిమ్ ఎసి వెంట్స్ మరియు హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ యొక్క డాష్‌బోర్డ్‌లో డబుల్-స్టిచ్చింగ్ బ్రౌన్ లెదర్ ఇన్సర్ట్‌లను మరియు బ్రష్ చేసిన అల్యూమినియం లాంటి ట్రిమ్‌ను కూడా పొందుతుంది.

ఇవి మాత్రమే కాకుండా ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు పెద్ద, పుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, టాప్-స్పెక్ కంపాస్ 'సీట్లు డ్యూయల్-టోన్ లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది, అయితే లోయర్ వేరియంట్లలో ఆల్-బ్లాక్ అప్హోల్స్టరీ మాత్రామే లభిస్తుంది.
MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

కంపాస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్‌లో 10.1-టచ్‌స్క్రీన్ ఉంది, ఇది ఎఫ్‌సిఎ యొక్క యుకనెక్ట్ 5 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌ను పొందుతుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఓవర్-ది-ఎయిర్ (OTA) నవీకరణలను కూడా పొందవచ్చు.

కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, లెదర్ అప్హోల్స్టరీ, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
MOST READ:ఎట్టకేలకు భారతమార్కెట్లో అడుగుపెట్టిన టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ & లెజెండర్ ; వివరాలు

కంపాస్ లిమిటెడ్ ప్లస్ మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇఎస్‌సి, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్ ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న 2.0 డీజిల్ ఇంజిన్ తో 173 హెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.4 టర్బో పెట్రోల్ ఇంజిన్163 హెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్‌తో స్టాండర్డ్ గా వస్తాయి. అయితే కంపాస్ పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అప్సన్ ని మరియు డీజిల్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటో ఆప్షన్‌ను పొందుతుంది. కంపాస్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో సర్ఫేస్ స్పెసిఫిక్ డ్రైవ్ మోడ్‌లతో లభిస్తుంది.

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ చోడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనదాయూనికి చాలా అనుకూలంగా ఉంటుంది. భారత మార్కెట్లో జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్, హ్యుందాయ్ టక్సన్ మరియు స్కోడా కరోక్, టాటా హారియర్ మరియు ఎంజి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వంటివారికి ప్రత్యర్థిగా ఉంటుంది.