Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 19 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 22 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Sports
RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- News
కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్లోనే
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎట్టకేలకు భారతమార్కెట్లో అడుగుపెట్టిన టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ & లెజెండర్ ; వివరాలు
భారతమార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 29.98 లక్షల నుంచి రూ. 37.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంటుంది. ఈ టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు మునుపటికంటే ఎక్కువ అప్డేట్స్ తో తీసుకురావడం జరిగింది. టయోటా ఫార్చ్యూనర్ బుక్ చేసుకోవాలనే వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ 7 వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో దాని టాప్ వేరియంట్ ధర రూ. 33.43 లక్షలు కాగా, లెజెండర్ వేరియంట్ ధర రూ. 37.58 లక్షలు. ఈ టయోటా కార్లు ఇప్పుడు కొత్త డిజైన్, అదనపు ఫీచర్లను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, ఇంకా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంది. దీని డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది.

సాధారణంగా టయోటా ఫార్చ్యూనర్ 2009 లో ప్రవేశపెట్టబడింది. ప్రవేశపెట్టబడిన నాటి నుంచి అనేక కొత్త మోడల్స్ మరియు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్ ప్రవేశపెట్టబడ్డాయి. భారత మార్కెట్లో ఇప్పటివరకు దాదాపు 1.70 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని. కావున ఇది దేశంలో ఆఫ్-రోడ్ ప్రీమియం ఎస్‌యూవీగా మారిందని కంపెనీ ప్రకటించింది.
MOST READ:మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ లో ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, కొత్త ఫ్రంట్ బంపర్, చిన్న ఫాగ్ లాంప్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌కు కొత్త డిజైన్ వంటివాటిని పొందుతుంది. ఇందులో కొత్త ఎల్‌ఈడీ టైల్లైట్స్, కొత్త మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

ఇక టయోటా యొక్క లెజెండర్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది ముందు నుండి చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది, ఇది సన్నగా ఉండే ఫ్రంట్ గ్రిల్, హై ఫ్రంట్ బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త మరియు మల్టిపుల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇవన్నీ వీటికి మంచి ప్రీమియం రూపాన్ని ఇస్తాయి.
MOST READ:రూ. 24 లక్షలతో బైక్ కొన్న మలయాళీ స్టార్.. ఎవరో చూసారా..!

కొత్త టయోటా ఫార్చ్యూనర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఎల్‌ఇడి యాంబియంట్ లైటింగ్, అప్‌డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్ట్ కార్ టెక్నాలజీ ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ మోడ్స్. ఇది కాకుండా వేరియంట్లో సీట్ వెంటిలేషన్ సిస్టమ్ కోసం కిక్ సెన్సార్, లెజెండర్ వేరియంట్లో పవర్ బ్యాక్ డోర్ ఉన్నాయి. ఇంకా 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రాడార్ గైడెడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటిని కూడా కలిగి ఉంది.
MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఇందులో అదే 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 166 బిహెచ్‌పి మరియు 245 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటాయి.

ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడినప్పుడు 177 బిహెచ్‌పి మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా అప్సనల్ 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జత చేసినప్పుడు ఇది 201 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

టయోటా ఫార్చ్యూనర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ జి 4 మరియు కొత్త మోడల్ ఎంజి గ్లోస్టర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.