Just In
- 13 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 17 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 18 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Sports
IPL 2021: రేర్ రికార్డ్: ఏడు మ్యాచుల్లో ఆరుమంది మనోళ్లే: విదేశీ క్రికెటర్ ఒక్కడే: లిస్ట్ ఇదే
- Lifestyle
Happy Ram Navami 2021:అందరికంటే ముందుగా బంధుమిత్రులకు శ్రీరామ నవమి విషెస్ చెప్పండిలా...
- News
జగన్‌తో గ్యాప్.. 'సాక్షి'పై షర్మిల వ్యాఖ్యల కలకలం.. బాహాటంగానే అసంతృప్తి... ఎందుకీ పరిస్థితి..?
- Finance
8 ఏళ్ల గరిష్టానికి హోల్‌సేల్ ద్రవ్యోల్భణం, మార్చిలో 7.39 శాతం
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా టెస్టులు: బయటకు వచ్చిన ఫొటోలు.. రిపోర్టు ఎలా వచ్చిందంటే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !
నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకారం వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. 2021 జనవరి 01 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పని సరి అని హైవే అథారిటీ అఫ్ ఇండియా ప్రకటించింది. కానీ ఇప్పడు ఆ గడువును పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ 2021 ఫిబ్రవరి 15 నుంచి తప్పని సరిగా ఉండాలి.

రోజు రోజుకి ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుకు ఎక్కువవుతున్నారు. ఈ కారణంగా టోల్ వసూలు కూడా ఎక్కువవుతోంది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో మొత్తం రూ. 2,303.79 కోట్ల టోల్‌గేట్ వసూలు చేసినట్లు తెలిసింది. ఇది కేవలం ఫాస్ట్‌ట్యాగ్ నుంచి వసూలు చేసిన డబ్బు.

ఫాస్ట్‌ట్యాగ్ వసూలు 2020 నవంబర్ తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 201 కోట్లు. ఈ గణాంకాలను జనవరి 5 న నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఫాస్ట్‌ట్యాగ్ వల్ల వసూలవుతున్న డబ్బు రోజురోజుకి పెరుగుతోంది.
MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

ఇప్పుడు చాలామంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ టోల్ వసూలు అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ గడువు ఇప్పుడు ఫిబ్రవరి 15 కి పొడిగించడం వల్ల, అప్పటి వరకు ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలు టోల్‌గేట్ల వద్ద టోల్ ఫీజు నగదు రూపంలో చెల్లించవచ్చు.

ఈ గడువును మళ్ళీ పొడిగించే అవకాశం ఉండదు, కాబట్టి ఫిబ్రవరి 15 లోపు వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ను పొందటం మంచిది. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వచ్చే ఆదాయంపై జాతీయ రహదారి అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతి నెల పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేస్తుంది.
MOST READ:మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

2020 నవంబర్ తో పోల్చితే డిసెంబరులో ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలైన మొత్తం రూ. 120 కోట్లు ఎక్కువ అని ఇటీవల విడుదలైన ప్రకటన వల్ల తెలుస్తోంది. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు పెంచడం కూడా జాతీయ రహదారి అథారిటీని ప్రోత్సహించింది. ఈ సంఖ్య భారతదేశంలో పెరుగుతున్న ఫాస్ట్‌ట్యాగ్ వినియోగాన్ని చూపిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల టోల్ గేట్లలో చాలావరకు రద్దీని తగ్గించవచ్చు. సాధారణంగా అయితే నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు టోల్ గేట్ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడం వల్ల వేచి ఉండాల్సిన సమయం దాదాపు తగ్గుతుంది.
MOST READ:ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ప్రధానంగా టోల్ గేట్ లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఈ ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించడం వల్ల వాహనాలు తొందరగా వెళ్ళటమే కాకుండా, కొంతవరకు ఇంధనాన్ని కూడా అదా చేయవచ్చు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ వల్ల టోల్‌గేట్ల వద్ద సిబ్బందిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇది కరోనావైరస్ సంక్రమణను కూడా దూరం చేస్తుంది.