Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్), గడచిన సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో తమ కొత్త '2021 కియా కార్నివాల్' (Kia Carnival) ఎమ్‌పివిని విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ కొత్త 6-సీటర్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

భారతదేశంలోకి కియా కార్ బ్రాండ్ ప్రవేశించి కొంత కాలమే అయినప్పటికీ, ఈ కొరియన్ కార్ బ్రాండ్ అతి తక్కువ సమయంలోనే దేశీయ మార్కెట్లో అత్యంత విజయవంతమైన కార్ల తయారీదారులలో ఒకటిగా నిలిచింది. కియా ఇండియా (Kia India) తమ తొలి కారును భారత మార్కెట్లో విడుదల చేసిన రెండేళ్లలోనే కంపెనీ లాభాల బాట పట్టింది. ప్రస్తుతం కియా భారత మార్కెట్లో సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ అనే మూడు కార్లను మాత్రమే విక్రయిస్తోంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కియా భారత మార్కెట్లో ఇప్పటికే తమ కియా సెల్టోస్ (Kia Seltos) మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు కియా సోనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్‌యూవీల కారణంగా మొత్తం కార్ల ఉత్పత్తి 3 లక్షల మార్కును చేరుకుంది. కంపెనీ అందిస్తున్న కియా కార్నివాల్ ఎమ్‌పివి అమ్మకాల పరంగా సెల్టోస్ మరియు సోనెట్‌ కార్లకు దగ్గరగా రానప్పటికీ, కార్నివాల్ దాని సెగ్మెంట్లో మంచి పనితీరునే కనబరుస్తోంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కియా ఇండియా, దేశీయ మార్కెట్లో ప్రతినెలా సగటున 400 యూనిట్ల నుండి 500 యూనిట్ల వరకూ కార్నివాల్ ఎమ్‌పివిలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త రిఫ్రెష్డ్ 2021 మోడల్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు, తాజాగా ఇందులో కొత్త 6-సీటర్ వేరియంట్‌ ను విడుదల చేయాలని చూస్తోంది. కస్టమర్ల అవసరాన్ని బట్టి, కంపెనీ ఈ ఎమ్‌పివిలో 7, 8 మరియు 9 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ లతో విక్రయిస్తోంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కార్నివాల్ 6 సీటర్ చేరికతో, కియా ఈ ఎమ్‌పివి లైనప్ నుండి 9 సీట్ల చికాకును తొలగించింది. తాజాగా, ఈ కొత్త 6 సీటర్ కియా కార్నివాల్ ఎమ్‌పివి ధరకు సంబంధించిన సమాచారం తెరపైకి వచ్చింది. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ 6 సీటర్ కియా కార్నివాల్ ఎమ్‌పివిని రూ. 28.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించవచ్చని అంచనా.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

ప్రస్తుతం కియా ఇండియా తమ కార్నివాల్ ఎమ్‌పివిని పూర్తిగా దిగుమతి చేసుకున్న సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) గా విక్రయిస్తుంది. అంటే, కంపెనీ ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోనికి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. మనదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై అధిక సుంకాలు (టాక్స్) ఉంటాయి. అందుకే, ఈ కారు ధర కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ, కంపెనీ ఈ కారును భారతదేశంలో తయారు చేయగలిగినట్లయితే, దీని ధర చాలా వరకూ దిగొచ్చే అవకాశం ఉంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

భారత మార్కెట్లో కియా కార్నివాల్ ఎమ్‌పివి ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే నాలుగు ట్రిమ్‌లలో విక్రయించబడుతోంది. అయితే, కొత్తగా రాబోయే కియా కార్నివాల్ 6 సీటర్ వెర్షన్ ను మిడ్-స్పెక్ ప్రెస్టీజ్ ట్రిమ్‌ లో మాత్రమే అందించబడుతుందని సమాచారం. కార్నివాల్ లైనప్‌ కు కంపెనీ ఈ కొత్త వెర్షన్‌ ని జోడించిడంతో పాటుగా, దాని దాని లైనప్ ను కూడా సవరించనుంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కార్నివాల్ ఇప్పుడు దాని బేస్ ప్రీమియం ట్రిమ్ లో 7 మరియు 8 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, దాని ప్రెస్టీజ్ ట్రిమ్ 6 మరియు 7 సీట్ల వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఇది కాకుండా, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ ట్రిమ్‌ లు 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ వేరియంట్‌ ల ధరలను కూడా అప్‌డేట్ చేయనుంది. మరిన్ని వివరాలు రాబోయే 6 సీటర్ వేరియంట్ లాంచ్ సమయంలో ప్రకటించబడే అవకాశం ఉంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కొత్తగా వచ్చిన రిఫ్రెష్డ్ 2021 కియా కార్నివాల్ అప్‌డేటెడ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ దాని అల్లాయ్ వీల్స్ కూడా అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఈ కారులో పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఇవి అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందించబడుతాయి. కంపెనీ ఈ కారుపై తమ కొత్త లోగోను కూడా ఉపయోగించింది. ఈ లోగో మార్పు ఇప్పటికే సెల్టోస్ మరియు సోనెట్ కార్లపై చేయబడింది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

కార్నివాల్ లోని ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే మూడు వేరియంట్లలోనూ ఇ్పపుడు ప్రీమియం లెదర్ సీట్లు లభిస్తాయి. కస్టమర్లు ఇందులో వీఐపి సీటింగ్‌ను కూడా ఎంచుకోవచ్చు. కొత్త కార్నివాల్ ఈ మార్పులే కాకుండా, ఇందులో కొత్త 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్‌లో UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కంపెనీ ఆఫర్ చేస్తుంది.

Kia Carnival ఎమ్‌పివిలో 6 సీటర్ వేరియంట్; త్వరలో విడుదల

ఇంకా ఇందులో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సింగిల్ రియర్-సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త లిమోసిన్ ప్లస్ వేరియంట్‌లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెదర్ తో చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్, వుడ్ గార్నిష్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మరియు డ్యూయెల్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో ఈ ఎమ్‌పివి ధరలు రూ. 24.95 లక్షల నుండి రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
New kia carnival 6 seater variant launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X