2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

భారతీయ మార్కెట్లో 2021 నవంబర్ నెలలో అనేక కొత్త కార్లు విడుదలయ్యాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కార్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ కొత్త కార్లు మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను నమోదు చేసాయి అనే విషయాలను మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో గత నెల Mahindra XUV700, MG Aster, Volkswagen Tiguan, Skoda Kushaq మరియు Maruti Celerio అమ్మకాల విషయానికి వస్తే..

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) 2021 నవంబర్ నెలలో 3,207 యూనిట్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ కారుని విడుదల చేసినప్పటి నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బుకింగ్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే కంపెనీకి 70,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. కానీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సెమీకండక్టర్ కొరత కారణంగా డెలివరీలు ఆలస్యం అయ్యాయి.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ విడుదల చేసిన ఈ వాహనం కోసం వినియోగదారులు దాదాపు సంవత్సరం కంటే కూడా ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కావున చాలామంది ఎక్కువ అసంతృప్తి చూపిస్తున్నారు. కంపెనీ ఇటీవల మహీంద్రా XUV700 యొక్క డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించింది. ఇందులో కంపెనీ SMS లేదా ఇ-మెయిల్ ద్వారా బుక్ చేసుకున్న వినియోగదారులకు సమాచారం అందించింది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

మహీంద్రా XUV700 SUV ని 2021 అక్టోబర్‌ నెలలో బుక్ చేసుకున్న వారికి 2022 మే నెలలో డెలివరీ చేయబడుతుంది. కాబట్టి కొత్త కస్టమర్‌లు ఇప్పుడు కనీసం 6 నుంచి 7 నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. అయితే ఇది కస్టమర్ ఎంచుకున్న ఇంజిన్, వేరియంట్ మరియు కలర్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఎంజి ఆస్టర్ (MG Astor):

ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎంజి ఆస్టర్, 2021 నవంబర్ నెలలో 1018 యూనిట్లను విక్రయించింది. ఈ SUV అమ్మకాలలో ఇది మొదటి నెల మాత్రమే, అయితే కంపెనీ ఈ సంవత్సరానికి కేవలం 5,000 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ మొత్తం ఇప్పటికే మొత్తం అమ్ముడయ్యాయి.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ గత నెల అమ్మకాలను పరిశీలిస్తే, Astor యొక్క అమ్మకాలు 2021 డిసెంబర్ నెలలో కూడా దాదాపు 2,000 నుంచి 3,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో కొనసాగుతున్న సెమీకండక్టర్ చిప్ కొరత MG Astor డెలివరీలను కూడా ప్రభావితం చేస్తోంది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

మారుతి సెలెరియో (Maruti Celerio):

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవల సెలెరియో అనే కొత్త మోడల్ ను విడుదల చేసింది. ఇది గత నెలలో 5,968 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం 6533 యూనిట్లతో పోలిస్తే 9 శాతం క్షీణతను నమోదు చేసింది. అదే సమయంలో, అక్టోబర్ నెలలో 1999 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలలో 199 శాతం వృద్ధి ఉంది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ కొత్త మోడళ్లను తీసుకురావడం వల్ల మంచి అమ్మకాలను పొందగలిగింది. ఈ కొత్త కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యం అందిస్తుంది, కావున ఎక్కువ మంది కొత్త కార్లను కొనుగోలు చేసేవారు ఈ కారును ఎంచుకుంటున్నారు.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

టాటా పంచ్ (Tata Punch):

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ విడుదల చేసిన టాటా పంచ్ (Tata Punch) అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా కీర్తి గడించింది. కంపెనీ ఈ కొత్త మైక్రో SUV ని గత నెలలో 6,110 యూనిట్లను విక్రయించింది. అయితే 2021 అక్టోబర్ నెలలో అత్యధికంగా 8,453 యూనిట్లను విక్రయించింది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

టాటా పంచ్ అమ్మకాలలో అక్టోబర్ నెల అమ్మకాలకంటే కూడా నవంబర్ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికి మంచి బుకింగ్స్ పొందింది. కానీ అన్ని కంపెనీలు ప్రస్తుతం సెమీ కండక్టర్ చిప్ కొరతతో ఉన్నాయి. టాటా మోటార్స్ కూడా చిప్ కొరతను ఎదుర్కొంటోంది. కావున పంచ్ ఉత్పత్తి అంత వేగంగా సాగటం లేదు. అయితే ఈ నెల అమ్మకాలు ఎలా ఉంటాయో, త్వరలో తెలుస్తాయి.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Tiguan):

ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త టైగన్ SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది 2021 నవంబర్ నెలలో మొత్తం 2,849 యూనిట్లను విక్రయించింది. అయితే 2021 అక్టోబర్ నెలలో అమ్మకాలు 2,551 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమమకాలు నవంబర్ లో 12 శాతం వరకు వృద్ధిని నమోదు చేసాయి.

ఇప్పటికి కూడా కంపెనీ యొక్క ఈ కారు కస్టమర్ల నుండి గొప్ప స్పందన వస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ అమ్మకాలను పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కావున డిసెంబర్ 2021 లో ఈ SUV యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాము.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

స్కోడా కుషాక్ (Skoda Kushaq):

స్కోడా కంపెనీ విడుదల చేసిన ఈ కుషాక్ SUV గత నెలలో 1,876 యూనిట్లను విక్రయించింది. అదే 2021 అక్టోబర్ నెలలో కంపెనీ మొత్తం 2,413 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంటే కంపెనీ యొక్క అమ్మకాలు నవంబర్ నెల కంటే కూడా అక్టోబర్ నెల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, కావున నవంబర్ నెలలో కంపెనీ 22 శాతం క్షీణతను నమోదు చేసింది.

2021 నవంబర్ నెలలో కొత్త కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

స్కోడా కంపెనీ విడుదల చేసిన ఈ SUV కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలను నమోదు చేసిన SUV గా మారింది. కావున ఇప్పటికి కూడా ఇది మంచి బుకింగ్స్ పొందగలిగింది. ఇకపైన కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ కార్లు 2021 చివరి నెల అయిన డిసెంబర్ లో కూడా మంచి అమ్మకాలను పొందుతాయి, అని ఆశిస్తున్నాము. అయితే ఈ నెల అమ్మకాలు ఎలా ఉంటాయో అనే విషయం 2022 జనవరి ప్రారంభంలో తెలుస్తాయి.

Most Read Articles

English summary
New launched car sales november 2021 mahindra xuv700 punch astor kushaq tiguan details
Story first published: Thursday, December 9, 2021, 11:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X