స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

Mahindra And Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) కంపెనీ యొక్క వాహనాలు మన్నికకు మరియు నాణ్యతకు పెట్టింది పేరు. కావున దేశీయ మార్కెట్లో తమ ఉనికిని ఈ రోజుకి గొప్పగా చాటుకుంటున్నాయి. ఎక్కువమంది వాహన వినియోగదారులు కూడా మహీంద్రా యొక్క వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త Mahindra Getaway మోడల్ ప్రవేశపెట్టడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా తన Mahindra Getaway మోడల్ ని ఇటీవల లడఖ్‌లో టెస్ట్ గుర్తించబడింది. టెస్టింగ్ సమయంలో కనిపిచ్చిన ఈ కొత్త Mahindra Getaway యొక్క యొక్క డిజైన్ మరియు ఎక్స్టీరియర్ వంటి వాటిని గమనించవచ్చు. ఈ పవర్ పుల్ మోడల్ ఇప్పుడు అన్ని రకాల భూభాగాలలో టెస్ట్ చేయబడుతోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

Mahindra Getaway త్వరలో మార్కెట్లో కొత్త అవతార్ మరియు అప్‌డేట్ చేయబడిన ఇంజిన్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. టెస్టింగ్ లో కనిపించిన ఈ కొత్త మోడల్ సిగ్నేచర్ గ్రిల్ Mahindra Getaway ముందు భాగంలో గమనించవచ్చు. దీని మధ్య భాగంలో లోగో చూడవచ్చు.

ఈ కొత్త Mahindra Getaway యొక్క రెండు వైపులా టెయిల్‌లైట్లు ఉన్నాయి, దానికి కింది భాగంలో రౌండ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. Mahindra Getaway యొక్క స్కిడ్ ప్లేట్ బంపర్ కింద ఉంచబడింది. సైడ్ పార్ట్‌లోని రెండు డోర్స్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. కానీ సైడ్ టర్న్ ఇండికేటర్ దాని ORVM కి జోడించబడ్డాయి. దాని సైడ్ స్టెప్స్ మరియు అల్లాయ్ వీల్స్ కూడా అలాగే ఉంచబడ్డాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

ఇక Mahindra Getaway యొక్క రియర్ ప్రొఫైల్ గమనించినట్లతే, ఇది దాదాపు మంచి డిజైన్ కలిగి ఉంది. ట్రాలీ భాగంలో కొత్త అప్డేట్స్ కనిపిస్తాయి. మొత్తానికి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా ఉంది.

Mahindra Getaway అనేది కారుగా మాత్రమే కాకుండా వెనుక ట్రక్కు మాదిరిగా ఉంది. ఇది లగేజ్ వంటివి తరకించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. Mahindra Getaway మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉండటం వల్ల ఎటువంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

Mahindra Getaway ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. మొత్తానికి ఇది వాహనవినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటీరియర్ చాలా వరకు ప్రీమియం గా ఉంటుంది. అయితే ప్రస్తుత తరానికి అనుకూలంగా ఉండే విధంగా తయారై ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త Mahindra Getaway గతంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఈ 5 సీటర్ మోడల్ ని 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

Mahindra Getaway (మహీంద్రా గెటవే) అనేది 5 సీటర్ వాహనం, దీనిని ఎక్కువమంది వాహన ప్రియులు ఇష్టపడతారు. మునుపటిలాగే Mahindra Getaway నాలుగు వేరియంట్లు మరియు మూడు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుందని మేము ఆశిస్తున్నాము.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

Mahindra Getaway 4x4 వెహికల్ గతంలో కూడా మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఈసారి దీనిని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో తీసుకురావచ్చు. అయితే, కంపెనీ కొత్త గేర్‌బాక్స్‌తో విడుదల చేసినట్లయితే వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా కంపెనీ ఇంతకు ముందు బిఎస్ 3 మోడల్ Mahindra Getaway ను రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల ధరతో తీసుకువచ్చారు. అయితే ఈ సారి కేవలం 4x4 మోడల్స్ మాత్రమే కనిపించాయి, కాబట్టి అప్‌డేట్ చేయబడిన ఇంజిన్ మరియు అదనపు ఫీచర్‌ల కారణంగా, దాని ప్రారంభ ధరను దాదాపు రూ .15 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన Mahindra Getaway; వివరాలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి 4x4 వాహనాల ఆదరణ చాలా పెరుగుతోంది. కావున ఈ సమయంలో మహీంద్రా కంపెనీ కొత్త Mahindra Getaway ని మార్కెట్లో ప్రవేశపెడితే మంచి ప్రజాదరణ పొందటమే కాకూండా, మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని భావిస్తున్నాము.

మహీంద్రా వాహనాలు దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త మహీంద్రా వెహికల్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మంచి ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ మార్కెయిలో మహీంద్రా థార్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. దేశీయ మార్కెయిలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా మహీంద్రా బ్రాండ్ లో ఎక్కువ మంది ఇష్టపడే వాహనాలలో మహీంద్రా స్కార్పియో మరియు మహీంద్రా బొలెరో వంటివి కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
New mahindra getaway spied testing design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X