మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ [వీడియో]

మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ అయిన ఎ-క్లాస్ లిమోసిన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త లగ్జరీ సెడాన్ మార్చి 25 న భారతదేశంలో విడుదల కానుంది.

ఎ-క్లాస్ లిమోసిన్ లగ్జరీ సెడాన్ భారతదేశంలో విడుదల కాకముందే, ఇటీవల మేము గోవాలో 2021 మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్‌ను డ్రైవ్ చేసాము. ఇది క్వాలిటీ ఇంటీరియర్స్, లగ్జరీ ఫీచర్స్ తో పాటు మంచి పనితీరుని కూడా అందిస్తుంది. మేము ఈ సెడాన్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లను రెండింటినీ డ్రైవ్ చేసాము. నిజంగా ఇవి చాలా అద్భుతంగా ఉంది.

మేము డ్రైవ్ చేసిన ఏ 200 మరియు ఏ 200డి వేరియంట్లతో పాటు, మెర్సిడెస్ బెంజ్ తన కొత్త A 35 AMG వెర్షన్‌ను కూడా పరిచయం చేస్తుంది. ఇది భారత మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనుంది. ఇది కంపెనీ యొక్క రెండవ ఎఎమ్‌జి మోడల్‌గా నిలిచింది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ యొక్క అమ్మకాలు ఈ నెల చివరిలో ప్రారంభం కానున్నాయి. అయితే దాని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది భారత మార్కెట్లో విడుదలైన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభమవుతాయి.

కొత్త ఎ-క్లాస్ లిమోసిన్ ధరలు రూ .45 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కొత్త మెర్సిడెస్ ఎ-క్లాస్ లిమోసిన్ భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపేకు ప్రత్యర్థిగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఫస్ట్ డ్రైవ్ [వీడియో]
Most Read Articles

English summary
2021 Mercedes-Benz A-Class Limousine Review Video. Read in Telugu.
Story first published: Monday, March 1, 2021, 13:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X