Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) అతి తక్కువ కాలంలోనే భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థగా పేరు గడించింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆధునిక కార్లను మార్కెట్లో విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఈ క్రమంలో భాగంగానే కంపెనీ మరో కొత్త కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

నివేదికల ప్రకారక కంపెనీ త్వరలో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. ఈ SUV ని కంపెనీ యొక్క పాలెన్సియా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. దీనిని కంపెనీ రెనాల్ట్ ఆస్ట్రల్ (Renault Austral) పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కొత్త SUV కి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

కంపెనీ యొక్క Arcana మరియు కొత్త Megane E-Tech ఎలక్ట్రిక్ మోడల్ తర్వాత C-సెగ్మెంట్‌లో దాని స్థానాన్ని తిరిగి బలోపేతం చేయాలనే రెనాల్ట్ లక్ష్యానికి ఈ కొత్త మోడల్ మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. రెనాల్ట్ ఆస్ట్రల్ SUV ప్రధానంగా యూరోపియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని తయారుకు సన్నద్ధమవుతోంది. కావున మొదట భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా.. అనేది ఇప్పటికి ఒక ప్రశ్నగానే ఉంది.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

ప్రస్తుతానికి కంపెనీ ఈ SUV సంబంధించి మొత్తం సమాచారం అందుబాటులో లేదు, కానీ దీనికి సంబంధించిన సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది. రెనాల్ట్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోని కాంపాక్ట్ SUV విభాగంలో ఎటువంటి మోడల్‌ను కలిగి లేదు. కావున ఈ కొత్త మోడల్ కూడా వస్తుందా.. లేదా అనేది కొంత అనుమానం.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

రెనాల్ట్ బ్రాండ్ యొక్క గ్లోబల్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ డిజైన్ స్ట్రాటజీ హెడ్ సిల్వియా డాస్ శాంటోస్ మాట్లాడుతూ, రెనాల్ట్ ఆస్ట్రల్ మార్కెట్లో మంచి ఆదరణను పొందుతుంది, అదేసమయంలో కస్టమర్లతో మంచి చైతన్యం కూడా కలిగిస్తుంది అని ఆశిస్తున్నాము అన్నారు.

అయితే ఈ కొత్త SUV కి రెనాల్ట్ ఆస్ట్రల్ అనేది సరైన మరియు ఖచ్చితమైన పేరు. ఎందుకంటే ఈ పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సులభంగా ఉచ్చరించగల పదం మరియు పొందికైన ధ్వనిని కలిగి ఉంటుంది, ఇది కారుకు నిజమైన ప్రపంచ అనుభూతిని ఇస్తుంది. Austral అనే పేరు లాటిన్ పదం. అంతే కాకుండా ఇది 'Australis' నుండి ఉద్భవింది.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

కొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త కాంపాక్ట్ SUV కుటుంబంలో భాగం, ఇది వినూత్నమైన కనెక్టెడ్ టెక్నాలజీని మరియు ఎకో-డ్రైవింగ్ ఆనందాన్ని అందిస్తోంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి ఉంది, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

నివేదికల ప్రకారం ఈ SUV యొక్క పొడవు 4.51 మీటర్ల వరకు ఉంటుంది. కావున ఇందులో సులభంగా 5 మంది వ్యక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రానున్న ఈ SUV యొక్క ధర మరియు ఇంజిన్ వంటి సమాచారం అందుబాటులో లేదు, అయితే ఈ సమాచారాన్ని కంపెనీ త్వరలో అందిస్తుంది, అని ఆశిస్తున్నాము.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

కొత్త SUV CMF ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ లో నిస్సాన్ బ్రాండ్ కారు కూడా ఉండటం గమనార్హం. ఇందులో డైమ్లర్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్ అందజేస్తుందని. అంతే కాకుండా ఇందులో ఒక ఆప్షన్ హైబ్రిడ్ వేరియంట్‌తో కూడా అందించబడుతుందని భావిస్తున్నారు.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

కంపెనీ ఈ కొత్త ఆధునిక SUV యొక్క లాంచ్ వంటి సమాచారం కూడా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే రెనాల్ట్ ఆస్ట్రల్ దాని గ్లోబల్ అరంగేట్రం చేసిన తరువాత, మరియు యూరోపియన్ మార్కెట్లో ఐదుదలైన తరువాత భారతీయ తీరాలను తాకే అవకాశం ఉంటుంది, అని ఆశిస్తున్నాము.

Austral పేరుతో కొత్త SUV లాంచ్ చేయనున్న Renault.. దీనికి సాటి ఇంకొకటి ఉంటుందా..!!

ఏది ఏమైనా రానున్న రెనాల్ట్ యొక్క కొత్త SUV తప్పకుండా కంపెనీ యొక్క పరిధిని మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో అందుబటులో ఉంటుంది, కావున మంచి అమ్మకాలతో ముందు వెళ్తుంది అని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
New renault austral company suv teaser released expected launch next year details
Story first published: Tuesday, December 7, 2021, 14:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X