టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ కొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కొత్త టాటా సఫారీ కోసం ఫిబ్రవరి 4వ తేదీ నుండి బుకింగ్‌లు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

కొత్త టాటా సఫారీ ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ఏ, ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ఏ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ అనే 9 వేరియంట్లలో లభిస్తుంది. తాజాగా, ఈ వేరియంట్లకు సంబంధించిన ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

అన్ని వేరియంట్లు కూడా ఒకేరకమైన డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి. ప్రస్తుతానికి ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఈ కారులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

కొత్త 2021 టాటా సఫారీని కంపెనీ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీని హారియర్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ సీట్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. ఇందులో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

2021 టాటా సఫారీ ఎక్స్‌ఈ వేరియంట్‌లో లభించే ఫీచర్లు:

 • టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్
 • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్
 • టర్న్ ఇండికేటర్‌తో కూడిన డ్యూయెల్ ఫంక్షన్ డిఆర్ఎల్
 • డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు (డ్రైవర్ మరియు కో-డ్రైవర్)
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
 • హిల్ హోల్డ్ కంట్రోల్
 • ట్రాక్షన్ కంట్రోల్
 • రోల్ఓవర్ మిటిగేషన్
 • కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
 • బ్రేక్ డిస్క్ వైపింగ్
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • రియర్ పార్కింగ్ సెన్సార్
 • సెంట్రల్ లాకింగ్
 • పారామెట్రిక్ అలారం సిస్టమ్
 • పవర్ విండోస్
 • 4 చక్రాలలో డిస్క్ బ్రేక్స్
 • రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ సీట్
 • రెండవ వరుసలో రిక్లెయినింగ్ సీట్స్
 • మూడవ వరుసలో ఏసి మరియు ఏసి వెంట్స్
 • మూడవ వరుసలో 50:50 స్ప్లిట్ సీట్స్
 • రెండవ మరియు మూడవ వరుసలో స్మార్ట్ ఛార్జర్స్
 • బాస్ మోడ్
 • రూఫ్ ట్రాక్స్

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

2021 టాటా సఫారీ ఎక్స్ఎమ్ / ఎక్స్ఎమ్ఏ వేరియంట్లలో పైన పేర్కొన్న ఎక్స్ఈ వేరియంట్లలో లభించే ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు అదనంగా లభిస్తాయి. అవి:

 • మల్టీ డ్రైవ్ మోడ్ 2.0 - ఎకో, సిటీ మరియు స్పోర్ట్
 • ఫ్లోటింగ్ ఐలాండ్ 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
 • 6 స్పీకర్లు (4 స్పీకర్లు + 2 ట్వీటర్లు)
 • స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్ బటన్స్
 • ఫాలో మి హెడ్‌ల్యాంప్
 • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
 • డిస్ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్
 • రియర్ వైపర్, వాషర్
 • రిమోట్ సెంట్రల్ లాకింగ్
 • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్
 • పవర్ అడ్జస్టబల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

2021 టాటా సఫారీ ఎక్స్‌టి వేరియంట్‌లో పైన పేర్కొన్న ఎక్స్ఎమ్ వేరియంట్‌లో లభించే ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు అదనంగా లభిస్తాయి. అవి:

 • యాంటీ రిఫ్లెక్టివ్ 'నాప్పా' టాప్ గ్రెయిన్ లెథర్ అప్‌హోలెస్ట్రీ‌తో కూడిన సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్
 • 8 స్పీకర్లు (4 స్పీకర్లు + 4 ట్వీటర్లు)
 • హీటర్, ఏసితో కూడిన పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
 • టర్న్ ఇండికేటర్స్‌తో కూడిన డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఈడి డిఆర్ఎల్
 • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
 • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్
 • పవర్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్
 • కప్ హోల్డర్‌తో రియర్ ఆర్మ్‌రెస్ట్
 • లంబార్ సపోర్ట్‌తో కూడిన ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్
 • పుష్ బటన్ స్టార్డ్
 • మూడ్ లైటింగ్
 • ఆర్18 అల్లాయ్ వీల్
 • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
 • ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
 • ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
 • రివర్స్ పార్కింగ్ కెమెరా
 • క్రూయిజ్ కంట్రోల్
 • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
 • ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌లో మెజెస్టిక్ స్కైడోమ్

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

2021 టాటా సఫారి ఎక్స్‌జెడ్ / ఎక్స్‌జెడ్ఏ వేరియంట్లలో పైన పేర్కొన్న ఎక్స్‌టి వేరియంట్లలో లభించే ఫీచర్లకు అదనంగా క్రింద పేర్కొన్న ఫీచర్లు లభిస్తాయి. అవి:

 • జెనాన్ హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
 • కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
 • సిగ్నేచర్ ఓయ్స్టర్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్
 • లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ మరియు డోర్ ప్యాడ్ ఇన్సర్ట్స్
 • లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ షిఫ్ట్ నాబ్
 • టెర్రైన్ రెప్సాన్స్ మోడ్ - నార్మల్, రఫ్ మరియు వెట్
 • 8.8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • 9 జెబిఎల్ స్పీకర్లు (4 స్పీకర్లు + 4 ట్వీటర్లు మరియు సబ్ వూఫర్), యాంప్లిఫైయర్‌తో
 • షార్క్ ఫిన్ యాంటెన్నా
 • 7 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
 • 6 ఎయిర్‌బ్యాగులు
 • హిల్ డిసెంట్ కంట్రోల్
 • ఐసోఫిక్స్
 • 6-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
 • ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
 • ఆర్18 మెషిన్ అల్లాయ్ వీల్స్
టాటా సఫారీలో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు ఇవే..

కాగా, కొత్త 2021 టాటా సఫారీ ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ఏ ప్లస్ వేరియంట్లలో పైన పేర్కొన్న ఫీచర్లకు అదనంగా మెజెస్టిక్ స్కైడోమ్ మరియు కెప్టెన్ సీట్ ఆప్షన్ లభిస్తాయి.

MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

Most Read Articles

English summary
New 2021 Tata Safari Variant Wise Features Explained. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X