Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ కారణంగానే మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే ఎక్కువమంది కొనుగోలుదారులు ఎక్కువ పరిధిని అందించే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు కూడా వీలైనంతవరకు ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

ఇందులో భాగంగానే ఇటీవల చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నియో (Nio) ఒక కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ వెల్లడించింది. ఇది అత్యధిక పరిధిని కూడా అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నియో తన ET5 ఎలక్ట్రిక్ సెడాన్‌ను వెల్లడించింది. ఈ కొత్త సెడాన్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా మోడల్ 3 సెడాన్‌ను ఆధారంగా రూపొందించబడింది. కానీ ఇది టెస్లా మోడల్ 3 కంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

నియో కంపెనీ యొక్క ET5 ఎలక్ట్రిక్ సెడాన్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 1,000 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని నివేదికల ద్వారా తెలిసింది. కానీ టెస్లా మోడల్ 3 మాత్రం ఒక్క చార్జితో 560 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కావున ఇది టెస్లా మోడల్ కంటే కూడా ఉత్తమమైన పరిధిని అందిస్తుంది.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

నియో కంపెనీ తన ET5 ఎలక్ట్రిక్ సెడాన్‌ ను చైనాలోని సుజౌలో జరిగిన కంపెనీ వార్షిక నియో డే ఈవెంట్‌లో వెల్లడించింది. అయితే అమ్మకాలు వచ్చే సమత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త Nio ET5 ఎలక్ట్రిక్ సెడాన్ ప్రారంభ ధర చైనా మార్కెట్లో 3,28,000 యువాన్లు. అయితే టెస్లా కంపెనీ యొక్క మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర హైనా మార్కెట్లో 2,55,652 యువాన్లు.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

Nio ET5 ఎలక్ట్రిక్ సెడాన్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కానీ అద్భుతమైన ఫీచర్ ఈ సెడాన్ యొక్క పరిధి. ఇది ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. Nio ET5 ఎలక్ట్రిక్ కార్ మూడు విభిన్న బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అవి 75kWh (స్టాండర్డ్ రేంజ్), 100kWh (లాంగ్ రేంజ్) మరియు 150kWh (అల్ట్రాలాంగ్ రేంజ్).

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

Nio ET5 ఎలక్ట్రిక్ సెడాన్ లోని 75kWh వేరియంట్ చైనా లైట్-డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ (CLTC) ఉద్గార నిబంధనల ప్రకారం 550 కి.మీలకు పైగా పరిధిని అందిస్తుంది. అదేవిధంగా 100kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన లాంగ్ రేంజ్ ET5 వేరియంట్ 750 కిమీలకు పైగా రేంజ్‌ను కలిగి ఉంది. అయితే చివరి మోడల్ 150kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన అల్ట్రాలాంగ్ శ్రేణి ఒక్క ఛార్జింగ్‌పై ఏకంగా 1,000 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

Nio ET5 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ డ్యూయల్-మోటార్ సెటప్‌తో వస్తుంది. అంతే కాకుండా Nio ET5 యొక్క ముందు మరియు వెనుక భాగంలో వేర్వేరు మోటార్లు వ్యవస్థాపించబడ్డాయి. రెండు మోటార్లు కలిపి పవర్ అవుట్‌పుట్ 483 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. కావున ఈ ఎలక్ట్రిక్ కార్లు మంచి పరిధిని అందిస్తాయి.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

కొత్త నియో ET5 ఎలక్ట్రిక్ కారు కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం అరకు వేగవంతం అవుతాయి. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క టాప్ స్పీడ్ వంటి వాటిని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ఫోర్-పిస్టన్ కాలిపర్‌లతో అంతర్గతంగా అభివృద్ధి చేసిన డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

కంపెనీ యొక్క కొత్త ET5 సెడాన్ 5 స్టార్ C-NCAP మరియు యూరో NCAP ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిందని అధికారికంగా పేర్కొంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఉక్కు కంటే మెరుగైన బలాన్ని కలిగి ఉన్న అల్ట్రా-హై-స్ట్రెంగ్త్ స్టీల్-అల్యూమినియం హైబ్రిడ్ నుంచి నిర్మించబడింది అని తెలుస్తుంది. కావున ఇది చాలా దృఢంగా ఉంటుంది.

Tesla ను తలదన్నే ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్: 1,000 కిమీ రేంజ్

చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నియో ఈ సంవత్సరం ప్రారంభంలో నార్వేలోకి ప్రవేశించిన తర్వాత అంతర్జాతీయంగా తన ఉనికిని విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే షాంఘైకి చెందిన ఈ కంపెనీ వచ్చే ఏడాది జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ మరియు స్వీడన్‌లలోకి ప్రవేశిస్తుంది, అంతే కాకుండా ఇది 2025 నాటికి US మార్కెట్‌తో 25 దేశాలకు చేరుకుంటుంది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం.

Most Read Articles

English summary
Nio et5 unveiled with 1000 km of range features details
Story first published: Wednesday, December 22, 2021, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X