కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

నిస్సాన్ ఇండియా కొత్త కిక్స్ మరియు మాగ్నైట్ కార్ల ద్వారా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. భారతీయ మార్కెట్లో మాగ్నైట్ ఎస్‌యువికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా కస్టమర్ల డిమాండ్ మేరకు వివిధ నగరాల్లో కొత్త సేల్స్ అవుట్‌లెట్‌లను విస్తరించడంతో పాటు తన కంపెనీ సర్వీస్ సెంటర్లను కూడా విస్తరిస్తోంది.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

నిస్సాన్ ఇండియా ఇప్పుడు భారతదేశంలోని 18 కొత్త నగరాలకు తన సర్వీస్ సెంటర్లను విస్తరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క అమ్మకాలను మరింత పెంచడానికి మరియు అమ్మకాల తర్వాత సర్వీస్ ని మెరుగుపరచడానికి కంపెనీ ఈ 18 కొత్త సర్వీస్ సెంటర్లను ప్రారంభించింది.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

ఇవి మాత్రమే కాకుండా కంపెనీ యొక్క నిస్సాన్ కనెక్ట్ యాప్‌లో రోడ్-సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ ని మెరుగుపరచడానికి మైటీవీఎస్(myTVS) తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటుంది. కొత్త టెక్నాలజీతో, రోడ్-సైడ్ అసిస్టెన్స్ మరియు టో ట్రక్ లొకేషన్‌పై రియల్ టైమ్ అప్‌డేట్‌లతో కస్టమర్‌లు పూర్తిగా డిజిటల్ సపోర్ట్‌ను అనుభవించవచ్చు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపు పోర్టల్ ద్వారా చెల్లింపులు జరిపి ఈ సర్వీస్ కి సభ్యత్వం పొందవచ్చు.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

కంపెనీ యొక్క వెహికల్స్ బ్రేక్డౌన్ అయినట్లయితే, కస్టమర్ నిస్సాన్‌కనెక్ట్ యాప్‌లోని రోడ్-సైడ్ అసిస్టెన్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి, ఇది మైటీవీఎస్(myTVS) సిస్టమ్‌లో టికెట్‌ను సృష్టిస్తుంది. సిస్టమ్ కేసును సమీపంలోని మైటీవీఎస్(myTVS) టెక్నీషియన్ లేదా టో ట్రక్కుకు ప్రసారం చేస్తుంది. కస్టమర్ యాప్‌లోని టెక్నీషియన్/టో ట్రక్కును ట్రాక్ చేయవచ్చు.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

భారతదేశంలోని కస్టమర్ల కోసం వర్షాకాల తనిఖీ క్యాంప్ కూడా కంపెనీ ప్రకటించింది. ఈ శిబిరం తడి మరియు చల్లని వాతావరణ పరిస్థితులలో వాహనాల సరైన పనిని నిర్ధారిస్తుంది. ఇందులో బాగా అనుభవం పొందిన వారు ఈ శిబిరాన్ని నిర్వహిస్తారు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

కంపెనీ నిర్వహించే ఈ శిబిరంలో ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అండర్ బాడీ, రోడ్-టెస్ట్ మరియు ఫ్రీ టాప్ వాష్‌తో సహా 30-పాయింట్ల చెక్-అప్‌ను అందిస్తుంది. క్యాంప్ సమయంలో సర్వీస్ కోసం కస్టమర్‌లు లేబర్ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

ఫ్రీ మాన్ సూన్ చెకప్ కోసం 2021 ఆగస్టు 31 వరకు కస్టమర్‌లు భారతదేశంలోని నిస్సాన్ మరియు డాట్సన్ అధీకృత డీలర్‌షిప్‌లలో దేనినైనా సందర్శించవచ్చు. కంపెనీ తన వినియోగదారులకు 'పిక్-అప్ & డ్రాప్-ఆఫ్' సేవలతో పాటు డోర్‌స్టెప్ సేవను కూడా అందిస్తోంది. ఇది కస్టమర్‌ల భద్రతను నిర్ధారిస్తుంది.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

ఇవి మాత్రమే కాకుండా కస్టమర్‌లు కేవలం 90 నిమిషాల్లో పూర్తయ్యే ‘నిస్సాన్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్' అనే సూపర్ క్విక్ సర్వీస్ అందించే డీలర్‌షిప్‌లను కూడా సందర్శించవచ్చు. వెహికల్ సర్వీస్ ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు మరియు నిస్సాన్ సర్వీస్ హబ్ లేదా నిస్సాన్ కనెక్ట్ ద్వారా నిస్సాన్ సర్వీస్ కాస్ట్ కాలిక్యులేటర్ ద్వారా ఖర్చులను కూడా తనిఖీ చేయవచ్చు.

కస్టమర్లలకు చేరువగా 18 కొత్త నగరాల్లో 18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు; నిస్సాన్

కారును లీజుకు తీసుకోవాలనుకునే కొనుగోలుదారుల కోసం, ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్ మరియు చెన్నైలలో ‘వైట్ ప్లేట్' మరియు ‘బై బ్యాక్ ఆప్షన్' సొంతం చేసుకోవడానికి కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ప్లాన్ జీరో డౌన్ పేమెంట్, జీరో ఇన్సూరెన్స్ కాస్ట్, జీరో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఏది ఏమైనా కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Nissan india opens 18 service centres in 18 new cities details
Story first published: Saturday, August 7, 2021, 13:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X