Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ గురూ..!!

జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలంపిక్ గేమ్స్ లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని తీసుకువచ్చిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా గురించి నేడు ప్రపంచం మొత్తానికి తెలుసు. అంతే కాకుండా దేశ కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేసిన మన నీరజ్ చోప్రా ఘనతకు మెచ్చిన దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన Mahindra & Mahindra చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంపెనీ యొక్క కొత్త XUV700 ని గిఫ్ట్ గా ప్రకటించాడు.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

అయితే ఇప్పుడు ఎట్టకేలకు నీరజ్ చోప్రా Mahindra & Mahindra యొక్క XUV700 గోల్డ్ ఎడిషన్ డెలివరీ పొందాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా అధికారికంగా తెలిపాడు. అతను అక్టోబర్ 30న తన కొత్త మహీంద్రా XUV700తో తీసుకున్న ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇది మాత్రమే కాకుండా కంపెనీ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన సుమిత్ ఆంటిల్ కి కూడా గోల్డ్ ఎడిషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700ని అందజేశారు. దీనికి సంబంధించి సమాచారం కూడా మనం ఇదివరకే తెలుసుకున్నాము. సుమిత్ ఆంటిల్ డెలివరీ పొందిన ఈ గోల్డ్ ఎడిషన్ లో 68.55 అని ఉంటుంది. ఇది అతడు ఒలంపిక్ లో జావెలిన్ త్రోలో సాధించిన రికార్డ్.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

అయితే ఇప్పుడు నీరజ్ చోప్రా షేర్ చేసిన ఈ పోస్ట్ లో మహీంద్రా అండ్ మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నీరజ్ చోప్రా భారత అత్యున్నత క్రీడా అవార్డ్ అయిన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' అవార్డుకు కూడా ఎంపికవ్వడం గమనార్హం.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, అంతే కాకుండా ఇది చాలా ప్రత్యేకమైనది, ఇందులో సుమిత్ ఆంటిల్ రికార్డ్, కస్టమ్ డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, గోల్డ్‌ కలర్ కొత్త మహీంద్రా లోగో మరియు సీట్ మరియు IP ప్యానెల్స్‌పై గోల్డ్ యాక్సెంట్‌లు ఉన్నాయి.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

ఇది చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాదు, చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది. దీనిని Mahindra కంపెనీ యొక్క చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ రూపొందించారు, దీనిని మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లో ఉంచారు. దీనితో పాటు ఈ SUV కి చాలా చోట్ల గోల్డ్ కలర్ యాక్సెంట్స్ అందించారు. ఈ గోల్డ్ యాక్సెంట్స్ కారణంగా ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

ఈ కారు లోపల కూడా నీరజ్ చోప్రా ఒలంపిక్ గేమ్స్ లో సాధించిన రికార్డును టెయిల్‌గేట్‌లో బ్యాడ్జ్ రూపంలో అలాగే ముందు డ్యాష్‌బోర్డ్ మరియు ఆరు హెడ్‌రెస్ట్‌లపై అందించారు. అంతే కాకుండా దాని వర్టికల్ స్లేట్ గ్రిల్‌పై గోల్డ్ పూత కూడా ఇవ్వబడింది. దీని కారణంగా ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

దీనితో పాటు ఈ SUV యొక్క లోగో శాటిన్ గోల్డ్ ప్లేటింగ్‌లో ఉంచబడింది, కావున ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులోని అన్ని సీట్లు మరియు IP ప్యానెల్‌లు గోల్డ్ కలర్ దారంతో యాసగా కుట్టారు. మొత్తానికి ఇది సాధారణ XUV700 కంటే కూడా చాలా ప్రత్యేకంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం ప్రతిరోజు దాదాపు 187 యూనిట్ల XUV700 డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో విడిభాగాల గ్లోబల్ కొరత డెలివరీలలో జాప్యానికి దారితీయవచ్చు కాబట్టి, ఇది తమ లక్ష్యం అని కూడా మహీంద్రా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీదారులు చిప్‌ల కొరతను ఎదుర్కొంటున్నారు.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

కొత్త మహీంద్రా XUV700 SUV డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ అందుకున్న నీరజ్ చోప్రా: ఇది చాలా స్పెషల్ మోడల్ గురూ..!!

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Olympic gold winner neeraj chopra gets mahindra xuv700 gold edition details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X