డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటీవలి ఎన్నికల్లో భారీ పతనాన్ని చవిచూసి, ఓటమిని జీర్ణించుకోలేక ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఒక దేశ అధ్యక్షుడిగా ఉండి, హింసాత్మక నిరసనలను ప్రోత్సహించడం పట్ల ఆయన పట్ల యావత్ ప్రపంచం నుండి విమర్శలు తలెత్తుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

ఆ విషయం అటుంచితే, ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఒకటి ఇప్పుడు వేలానికి వచ్చింది. బ్లాక్ కలర్ 2010 మోడల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును అమెరికాలోని ఓ ప్రముఖ వెబ్‌సైట్ వేలానికి ఉంచింది.

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

అమెరికాలోని మెకమ్ ఆక్షన్స్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును అమ్మకానికి పెట్టబడింది. ఈ కారును వేలంలో 3,00,000 నుండి 4,00,000 డాలర్ల మధ్యలో (సుమారు రూ.2.2 కోట్ల నుండి రూ.2.9 కోట్ల మధ్యలో) విక్రయించాలని సదరు ఆక్షన్ కంపెనీ యోచిస్తోంది.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

వేలానికి వచ్చిన ఈ కారును ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించారు, ప్రస్తుతం దీని యజమాని ఎవరనే విషయాన్ని ఆక్షన్ కంపెనీ గోప్యంగా ఉంచింది. ఈ 2010 మోడల్ రోల్స్ ఫాంటమ్ కారుకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇదొక లిమిటెడ్ ఎడిషన్ మోడల్, అప్పట్లో ఇలాంటివి కేవలం 537 కార్లు మాత్రమే తయారయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

కాగా, ఇప్పుడు ఈ రోల్స్ రాయిస్ కారును వేలంలో కంపెనీ పేర్కొన్న ధరకు విక్రయిస్తే, ఇది ఆ కాలానికి చెందిన అత్యంత ఖరీదైనది రోల్స్ రాయిస్‌గా నిలిచే అవకాశం ఉంది. వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఈ కారు ఓడోమీటర్‌పై 56,700 మైళ్ళ (91,249 కిమీ) రీడింగ్ ఉంది.

MOST READ:గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

కార్‌స్కూప్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి 45వ అధ్యక్షునిగా ఎన్నిక కాక మనుపు ఉపయోగించిన కార్లలో ఇదొకటిగా చెబుతున్నారు. కొన్ని కారణాల వలన ట్రంప్ ఈ కారును విక్రయించేసినట్లు సమాచారం.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కారుకి సంబంధించిన ఓనర్స్ మ్యాన్యువల్‌పై డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. దానిపై "నేను ఈ కారును ప్రేమిస్తున్నాను, ఇది చాలా గొప్పది! శుభాకాంక్షలు" అనే సందేశం కూడా ఉంటుంది.

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన ఈ 2010 రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారులో థియేటర్ అనుభూతిని అందించేందుకు ఇందులో ఓ థియేటర్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా, స్టార్‌లైట్ హెడ్‌లైనర్ మరియు ఎలక్ట్రానిక్ కర్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

ఈ కారులో శక్తివంతమైన 6.75-లీటర్ వి-12 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 453 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో పవర్ స్టీరింగ్ మరియు పవర్ డిస్క్ బ్రేక్‌లు కూడా ఉంటాయి.

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

ఇంకా ఇందులో 7-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, వీటిని స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ మస్కట్ లోగోతో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, హెడ్‌రెస్ట్‌లపై ఆర్‌ఆర్ లోగోను కూడా చేతితో కుట్టబడి ఉంటుంది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

ఈ 2010 రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారులోని అన్ని స్టాండర్ట్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో రైడర్ మరియు కో-ప్యాసింజర్ కోసం ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. వారితో పాటుగా ఇతర ప్రయాణీకుల కోసం సైడ్ ఎయిర్‌బ్యాగులు మరియు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగులు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Once Donald Trump Owned Rolls Royce Phantom Car Is Up For Auction In US. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X