హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్' సర్వీస్; వివరాలు

ఆక్సిజన్ ఆన్ వీల్స్ సర్వీస్ ఎట్టకేలకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో ప్రారంభమైంది. దీనితో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏడు హాస్పిటల్స్ మరియు మెడికల్ సెంటర్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయబడుతున్నట్లు తెలిసింది. ఇటీవల, కొత్త నగరంలో ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రవేశపెట్టిన సమాచారం ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

రాబోయే రోజుల్లో కొత్త నగరాల్లో కూడా ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. దీనితో పాటు ఆనంద్ మహీంద్రా ప్రతిరోజూ 1,000 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఖాళీ సిలిండర్లను తిరిగి తీసుకురావడానికి కూడా పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

ఆక్సిజన్ ఆన్ వీల్స్ సర్వీస్ లో తమకు సహకరించి ప్రజల ప్రాణాలను కాపాడిన డ్రైవర్లకు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, మరియు స్థానిక అధికారులందరూ దీనికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సర్వీస్ మొదట మనదేశంలో మహారాష్ట్రలో ప్రారంభించబడింది.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

మహారాష్ట్రలో ప్రారంభించిన తర్వాత ఇతర నగరాల్లో వ్యాప్తి చెందుతోందని మరియు ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కువ ప్రదేశాలలో సరఫరా చేయబడుతున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో మొత్తం 70 బొలెరో ట్రక్కుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిణీ చేయడం జరుగుతోంది.

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

మహారాష్ట్రలో ముంబై, థానే, నాసిక్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ సజావుగా నడపడానికి మహీంద్రా కంట్రోల్ రూమ్‌ను కూడా రూపొందించింది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

అంతే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లను ఉంచడానికి గొడౌన్స్ వంటివి కూడా కంపెనీ సిద్ధం చేసింది. సమీప ఆక్సిజన్ ప్లాంట్ లో ఖాళీ సిలిండర్లు మళ్ళీ వినియోగించడానికి రీఫిల్ చేయబడతాయి. ఈ విధంగా చేసిన తరువాత మళ్ళీ ఈ సిలిండర్లు ఉపయోగించబడతాయి.

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా, ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది, ఇటువంటి పరిస్థితిలో, ఆటో కంపెనీలు కూడా ఆక్సిజన్ సరఫరా మరియు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ముందుకు వచ్చాయి. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చాలా కంపెనీలు వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి కూడా మీరు ఇదివరకటి కథనాలతో తెలుసుకోవడం జరిగింది.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరా చేసే ట్యాంకర్లకు హైవేలో టోల్ టాక్స్ కూడా తీసుకోబడదు. జాతీయ రహదారులపై ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్‌లకు టోల్ వసూలు చేయకూడదయి ఇటీవల ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

హైదరాబాద్‌లో ప్రారంభమైన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్'; వివరాలు

దేశంలో ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ డిమాండ్ దృష్ట్యా, ఇతర అత్యవసర వాహనాలైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మోసే కంటైనర్లు మరియు అంబులెన్సులు టోల్ వసూలుచేయబడదు. ఈ వాహనాలకు రాబోయే రెండు నెలలు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు టోల్ వసూలు చేయబడదు.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

Most Read Articles

English summary
Oxygen On Wheels Service Started In Hyderabad. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X