ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్ తయారు చేసిన ఓ స్పోర్ట్స్ కారు, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే రోడ్-లీగల్ కారుగా రికార్డు సృష్టింది. పోర్ష్ 911 జిటి2 ఆర్‌ఎస్ మోడల్ ఈ రికార్డును సాధించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూర్‌బర్గ్రింగ్ నార్డ్స్‌క్లీఫ్ సర్క్యూట్‌లో ఈ పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్ రోడ్-లీగల్ ప్రొడక్షన్ కారు సరికొత్త ల్యాప్ రికార్డ్ సృష్టించగలిగింది. ఈ కారు మాంథే పెర్ఫార్మెన్స్ కిట్‌తో జత చేయబడింది. దీనిని పోర్ష్ ఇంజనీర్లు వీసాచ్ మరియు మాంథే-రేసింగ్ ట్రాక్ స్పెషలిస్టుల సహకారంతో అభివృద్ధి చేశారు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్ కారు 20.8 కిలోమీటర్ల పొడవైన న్యూర్‌బర్గ్రింగ్ నార్డ్స్‌క్లీఫ్ సర్క్యూట్‌ను కేవలం 6:43.300 నిమిషాల్లోనే చుట్టి, అత్యంత వేగవంతమైన ల్యాప్ రికార్డును సాధించింది. జూన్ 14న ఈ రికార్డు సృష్టించబడింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

రోడ్-లీగల్ మిచెలిన్ పైలట్ స్పోర్ట్ కప్2 ఆర్ టైర్లతో నెలకొల్పిన మునుపటి 6:48.047 రోడ్-కార్ రికార్డును పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్ 4.747 సెకన్ల తేడాతో సాధించింది. ఈ సమయంలో పోర్ష్ కారు సగటున గంటకు 185.87 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

న్యూర్‌బర్గ్రింగ్ నార్డ్స్‌క్లీఫ్ సర్క్యూట్‌ మొత్తం 20.8 కిలోమీటర్ల చుట్టుకొలతతో, రహదారిపై నడపడానికి లైసెన్స్ పొందిన కార్ల ల్యాప్ రికార్డులను సృష్టించడం ఎల్లప్పుడూ ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ ట్రాక్‌పై మునుపటి రికార్డును మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ కారు కలిగి ఉంది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

పోర్ష్ డెవలప్‌మెంట్ డ్రైవర్ లార్స్ కెర్న్ 700 పిఎస్ (515 కిలోవాట్) చాస్సిస్ వెనుక కూర్చుని 911 జిటి2 ఆర్ఎస్‌తో ఈ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఈ కారులో పోర్ష్ టెక్విప్‌మెంట్ నుండి వచ్చిన 'మాంథే పెర్ఫార్మెన్స్ కిట్'లో భాగంగా చాస్సిస్, ఏరోడైనమిక్ మరియు బ్రేక్ భాగాలు, వీసాచ్ ప్యాకేజీ యొక్క లైట్ మెగ్నీషియం అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోడ్-లీగల్ కార్ 'పోర్ష్ 911 జిటి2 ఆర్ఎస్'

జిటి కస్టమర్లు తమ కార్లను ట్రాక్ రోజులలో తరచూ సర్క్యూట్లో నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారని 911 మరియు 718 మోడళ్ల వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్-స్టెఫెన్ వాలిజర్ అన్నారు. మాంథే మరియు పోర్ష్‌లోని ఇంజనీర్లు కలిసి 911ను అనుమతించే సంపూర్ణ ట్యూన్డ్ ప్యాకేజీని అభివృద్ధి చేశారని, ఇందులో ఎక్కువ పనితీరును అందించడానికి జిటి2 ఆర్ఎస్ మోడల్‌ను రూపొందించామని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
Porsche 911 GT2 RS Breaks The Nurburgring Production Car Lap Record, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X