సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ Renault తమ రెండవ తరం Duster ఎస్‌యూవీని 2019 సంవత్సరంలో దక్షిణ అమెరికా మార్కెట్ల కోసం ప్రవేశపెట్టింది. భారతదేశంలో కూడా Renault Duster (రెనో డస్టర్) బాగా ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ, ఇది చాలా మంది వినియోగదారులకు ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

దక్షిణ అమెరికా మార్కెట్లలో విక్రయించబడుతున్న Duster ఎస్‌యూవీని బ్రెజిల్ లోని సావో జోస్ డోస్ పిన్‌హైస్ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బ్రెజిలియన్ వెర్షన్ Renault Duster కోసం ఇటీవల నిర్వహించిన లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) క్రాష్ టెస్ట్ లో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఈ సెకండ్ జనరేషన్ Renault Duster ఎస్‌యూవీ సున్నా సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ క్రాష్ పరీక్షలో ఎస్‌యూవీ పూర్తిగా విఫలమైంది. లాటిన్ అమెరికా మరియు కరేబియన్ మార్కెట్ల కోసం కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఈ కారు విఫలమైంది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

Renault Duster SUV ని ముందు వైపు నుండి క్రాష్ చేసినప్పుడు, అందులో ఇంధనం లీక్ అవడం ప్రారంభించింది. ఫలితంగా, ఇది లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో సున్నా-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అంతేకాకుండా, సైడ్ ఇంపాక్ట్ క్రాష్ టెస్టులో కూడా ఈ ఎస్‌యూవీ బాగా దెబ్బతింది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

ఈ ఎస్‌యూవీని సైడ్ నుండి క్రాష్ చేసినప్పుడు బి పిల్లర్ వద్ద ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి, డోర్లు తెరచుకున్నాయి. Renault Duster ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా లభిస్తాయి.

లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఈ ఎస్‌యూవీ వయోజన భద్రత కోసం 29.47 శాతం, పిల్లల రక్షణ కోసం 22.93 శాతం, పాదచారుల భద్రత కోసం 50.79 శాతం మరియు ప్రమాదకర రోడ్డు వినియోగదారుల రక్షణ కోసం మరియు సేఫ్టీ అసిస్ట్ బాక్స్‌ లో భద్రత కోసం 34.88 శాతం స్కోర్ సాధించింది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

లాటిన్ అమెరికా లో విక్రయించబడుతున్న కొత్త Renault Duster సైడ్ బాడీ మరియు సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండవు. యూరోప్ లో డాసియా బ్రాండ్ కింద విక్రయించే మోడల్ మాదిరిగా కాకుండా, లాటిన్ అమెరికాలో విక్రయించే Renault Duster మనదేశంలో విక్రయించబడే మోడల్ తో సమానంగా ఉంటుంది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

ఇదిలా ఉంటే, భారతదేశంలో Renault Duster ఎస్‌యూవీని కంపెనీ డిస్‌కంటిన్యూ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. Renault Duster వ్యయాలను తగ్గించడం మరియు లాభాలను పెంచే లక్ష్యంతో కంపెనీ ఈ మోడల్ ని నిలిపివేనున్నట్లు ఇటీవలి ఓ నివేదికలో వెల్లడైంది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

Renault India అక్టోబర్ 2021 లో తమ అసెంబ్లీ లైన్ నుండి Renault Duster యొక్క చివరి బ్యాచ్‌ను విడుదల చేయస్తుందని కూడా ఈ నివేదికలో చెప్పబడింది. అయితే, ఈ కంపెనీ విక్రయిస్తున్న ప్రస్తుత తరం Duster స్థానంలో ఓ కొత్త తరం ఎస్‌యూవీని తీసుకురావచ్చని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ కొత్త తరం Duster ను భారత మార్కెట్లో ఆవిష్కరించే అవకాశం ఉంది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

భారత మార్కెట్లో Renault India గత ఏడాది అక్టోబర్‌ నెలలో తమ Duster ఎస్‌యూవీలో ఓ కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 156 బిహెచ్‌పి శక్తిని మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

దీనితో పాటుగా Duster ఎస్‌యూవీ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో Duster ఎస్‌యూవీ ధరలు రూ.9.86 లక్షల నుండి రూ.14.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

Renault ఇటీవలే, అంతర్జాతీయ మార్కెట్లలో తమ కొత్త 2022 మోడల్ Duster ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌నే కంపెనీ వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్‌లో కూడా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త 2022 Duster ఎస్‌యూవీలో Y-ఆకారపు హెడ్‌లైట్స్, సరికొత్త క్రోమ్ గ్రిల్, ఎల్‌ఈడి ఫ్రంట్ ఇండికేటర్స్, ఏరో-ఆప్టిమైజ్ 15 ఇంచ్ మరియు 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్ మరియు రియర్ స్పాయిలర్ వంటి డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందిన సెకండ్ జనరేషన్ Renault Duster

అలాగే, కొత్త 2022 Duster ఇంటీరియర్స్‌లో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో కొత్తగా అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో ఇది సరికొత్త క్యాబిన్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ కారులో రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, కొత్త మెటీరియల్‌లు మరియు 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault duster scores zero safety rating in latin ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X