రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్ తరువాత, ఇప్పుడు ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో తమ వినియోగదారుల కోసం వారంటీని సర్వీస్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాక్షిక మరియు సంపూర్ణ లాక్‌డౌన్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో, అనేక ప్రాంతాల్లో కార్ షోరూమ్‌లు సర్వీస్ సెంటర్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, వాహన వినియోగదారులు గడువు సమయం లోపుగా తమ వాహనాలను సర్వీస్ చేయించుకోలేక పోతున్నారు.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న రెనో ఇండియా, ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో సమయంలో గడువు ముగిసే సర్వీస్ మరియు వారంటీలను జులై 31, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమయంలో రెనో ఇండియా 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తోంది.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య కాలంలో వారంటీ గడువు ముగిసిన కార్లకు ఇప్పుడు జూలై 31 వరకు వారంటీ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెనాల్ట్ అందిస్తున్న రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ 24X7 అందుబాటులో ఉంటుందని, తమ వాహనాలకు సంబంధించిన అత్యవసర సేవలతో వినియోగదారులకు సహాయం చేస్తుందని కంపెనీ పేర్కొంది.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

ఈ క్లిష్ట సమయంలో, రెనో తమ వినియోగదారులకు ఇంటి వద్దే ఉండి కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని సలహా ఇస్తుంది. లాక్‌డౌన్ సమయంలో వెబ్‌సైట్ మరియు మై రెనాల్ట్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకోవచ్చని రెనాల్ట్ పేర్కొంది. ఇందుకోసం కంపెనీ ఓ వర్చువల్ స్టూడియోని కూడా సృష్టించింది. దాని సాయంతో మీరు ఏదైనా రెనో కారుకి సంబంధించిన ఉచిత డెమోను పొందవచ్చు.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

దేశంలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించని కొన్ని రాష్ట్రాల్లో రెనో డీలర్‌షిప్‌లు తెరిచి ఉన్నాయి. ఈ డీలర్‌షిప్‌ల ద్వారా కూడా కస్టమర్లు తమకు నచ్చిన రెనో కార్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కంపెనీ తమ కొత్త కార్లను హోమ్ డెలివరీ కూడా చేస్తోంది.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

రెనో ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో కైగర్, డస్టర్, క్విడ్ మరియు ట్రైబర్ అనే నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలోనే ఈ సంస్థ భారత్‌లో ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, స్కాలా సెడాన్ డిస్‌కంటిన్యూ చేసిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ఓ కొత్త సెడాన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

రెనో కార్లపై జులై 31, 2021 వరకూ సర్వీస్ మరియు వారంటీ పొడగింపు

మరోవైపు రెనో విక్రయిస్తున్న బడ్జెట్ ఎమ్‌పివి ట్రైబర్‌లో కంపెనీ టర్బో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెనో ట్రైబర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault India Extends Service And Warranty Till 31st July. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X