Just In
- 39 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 49 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 57 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Finance
మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 2021లో ఏయే రెనో కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయంటే..
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారత మార్కెట్లో గడచిన జనవరి 2021లో నెలలో విక్రయించిన మోడల్ వారీ అమ్మకాల వివరాలను ప్రకటించింది. గత నెలలో కంపెనీ మొత్తం 8,209 యూనిట్ల అమ్మకాలతో, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

జనవరి 2020లో అమ్మిన రెనో కార్ల సంఖ్యతో పోల్చుకుంటే ఇది గత నెలలో అమ్మకాలు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది జనవరిలో కంపెనీ మొత్తం 7,805 కార్లను విక్రయించింది. అయితే, డిసెంబర్ 2020 నెల అమ్మకాలతో పోలిస్తే, మాత్రం రెనో అమ్మకాలు 16 శాతం తగ్గాయి. డిసెంబర్ 2020లో కంపెనీ 9,800 కార్లను విక్రయించింది.

రెనో ఇండియా తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మూడూ ఉత్పత్తులను (క్విడ్, డస్టర్ మరియు ట్రైబర్) మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, అమ్మకాల పరంగా ఫోర్డ్, నిస్సాన్, ఎమ్‌జి, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా మరియు జీప్ వంటి ఇతర సంస్థల కంటే ముందంజలో ఉంది. గత నెలలో రెనో ట్రైబర్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

గత జనవరి 2021లో కంపెనీ 4,082 ట్రైబర్ ఎమ్‌పివిలను విక్రయించింది. అయితే, జనవరి 2020తో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గాయి. ఆ సమయంలో కంపెనీ 4,119 ట్రైబర్ కార్లను విక్రయించింది.

రెనో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ గత నెలలో 3,791 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉంది. జనవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 3,281 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో క్విడ్ అమ్మకాలు 16 శాతం పెరిగాయి.

రెనో ఇండియాకు దేశీయ మార్కెట్లో క్విడ్ మరియు ట్రైబర్ కార్లు బెస్ట్ సెల్లింగ్ మోడళ్లుగా ఉన్నాయి. ఇవి రెండూ ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సరసమైన ధర, విశిష్టమైన ఫీచర్ల కారణంగా వీటికి డిమాండ్ బాగా ఉంది. ఈ రెండు మోడళ్లతో పాటుగా రెనో డస్టర్ ఎస్‌యూవీని కూడా విక్రయిస్తోంది.

జనవరి 2021లో, రెనో ఇండియా మొత్తం 336 డస్టర్ కార్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 405 యూనిట్లుగా ఉంది. ఈ సమయంలో రెనో డస్టర్ ఎస్‌యూవీ అమ్మకాలు 5 శాతం తగ్గాయి.

రెనో మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో తమ సరికొత్త కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రెనో కైగర్ రాకతో కంపెనీ మొత్తం అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ధీమాగా ఉంది.

రెనో కైగర్ విషయానికి వస్తే, కంపెనీ ఇప్పటికే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని చెన్నై ప్లాంట్‌లో ప్రారంభించింది. ఈ మోడల్‌కి సంబంధించిన డెమో కార్లు కూడా తాజాగా డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి.

సబ్-4 మీటర్ విభాగంలో విడుదల కానున్న రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో-నిస్సాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇదే ప్లాంట్‌లో నిస్సాన్ మాగ్నైట్ కూడా తయారవుతోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, రెనో కైగర్ ఈ ఏడాది మార్చ్ నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.