Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

భారతదేశంలో రెనో కైగర్ విజయం తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్ కోసం మరొక కొత్త ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో భారతదేశం కోసం ఓ కొత్త ఎస్‌యూవీని ప్లాన్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ Arkana ఎస్‌యూవీకి చెందినట్లు స్పష్టమవుతోంది. రెనో అర్కానా (Renault Arkana) ఎస్‌యూవీ టీజర్ తో పాటుగా కంపెనీ "మేము సిద్ధంగా ఉన్నాము" (we're ready) అంటూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో ఇండియా ఈ పోస్ట్ లో మూవెంబర్ (#Movember) హ్యాష్‌ట్యాగ్ ని ఉపయోగించింది. దీన్ని బట్టి చూస్తుంటే, రెనో ఇండియా టీజర్ పురుషుల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ, ఈ టీజర్ లో కంపెనీ తమ అర్కానా కారు యొక్క వెనుక భాగాన్ని చూపించే చిత్రాన్ని ఉపయోగించడం ఇప్పుడు పలు కొత్త ప్రశ్నలకు తావిస్తోంది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో అర్కానా అనేది ఎస్‌యూవీ-ప్రేరేపిత డిజైన్‌ తో రూపొందించబడిన ఓ 5 సీటర్ క్రాస్ఓవర్ మోడల్ కారు. రెనో ఇప్పటికే ఈ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఒకవేళ, ఈ క్రాసోవర్ భారతదేశంలో విడుదల చేయబడితే, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో అర్కానా క్రాసోవర్ ను మొదటిసారిగా 2019 సంవత్సరంలో రష్యాలో ప్రారంభించబడింది. ఈ క్రాసోవర్ భారతదేశంలో ప్రారంభించినప్పుడు, ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ లోని ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. వీటిలో టాటా హారియర్ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో అర్కానా కొలతలను గమనిస్తే, (అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే మోడల్ ప్రకారం) ఇది 4,545 మిమీ పొడవు, 1,820 మిమీ వెడల్పు, 1,565 మిమీ ఎత్తు మరియు 2,721 మిమీ వీల్‌బేస్‌ ను కలిగి ఉంటుంది. అలాగే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 208 మిమీ గా ఉంటుంది. ఈ కొలతల పరంగా చూస్తే, భారత మార్కెట్లో రెనో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని డస్టర్ ఎస్‌యూవీ కంటే అర్కానా పెద్దదిగా ఉంటుంది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో అర్కానా ఎస్‌యూవీ / క్రాసోవర్ లోపలి భాగం చూడటానికి రెనో డస్టర్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. ఇందులో Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో పాటు, 9.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంటుంది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

ఇంకా ఇందులో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, బోస్ ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ కలర్ లైటింగ్‌ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో రెనో అర్కానా ఎస్‌యూవీని 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తో విక్రయిస్తోంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు సివిటి టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

గ్లోబల్ వెర్షన్ రెనో అర్కానా కారు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో Renault Arkana ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీని భర్తీ చేయగలదు మరియు ఇది అదే విభాగంలోని ఇతర కార్లతో పోటీపడుతుంది. రష్యన్ మార్కెట్లో రెనో అర్కానా ఎస్‌యూవీ ధర ప్రకారం చూస్తే, భారతదేశంలో దీని ధర సుమారు రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

మూవెంబర్ అంటే ఏమిటి?

మూవెంబర్ (#Movember) అనే కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నవంబర్ నెలలో నిర్వహిస్తారు. సాధారణంగా, ఈ నెలలో పురుషులు తమ గడ్డం మరియు మీసాలను షేవ్ చేయకుండా నెల పొడవునా పెంచుతారు. నవంబర్ నెల మొత్తం పురుషుల ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, వృషణ క్యాన్సర్ మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవగాహన పెంచడానికి మరియు సంభాషణను ప్రేరేపించడానికి పురుషులు తమ గడ్డం, మీసాలు పెంచుకోవాలని ప్రోత్సహిస్తారు.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

Renault Megane E-Tech ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రెనో కూడా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, జర్మనీలో జరిగిన ఐఏఏ మ్యూనిచ్ 2021 ఆటో షోలో కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు రెనో మెగాన్ ఇ-టెక్ (Renault Megane E-Tech) ను ఆవిష్కరించింది.

Renault Arkana ఎస్‌యూవీ టీజర్ ఆవిష్కరణ; త్వరలోనే భారత్‌లో విడుదల

రెనో యొక్క CMF-EV మాడ్యులర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ పై Megane E-Tech ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ను రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ ను అభివృద్ధి చేసింది. బేస్ వేరియంట్లో ఈ మోటార్ గరిష్టంగా 130 హార్స్ పవర్ ల శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్ లోని ఈ ఇంజన్ 218 హార్స్ పవర్ ల శక్తిని మరియు 300 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault india teases new arkana suv launch timeline revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X