రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

భారత మార్కెట్లో లభిస్తున్న ఉత్తమమైన ఎస్‌యూవీలలో ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో విక్రయిస్తున్న 'డస్టర్' కూడా ఒకటి. రెనో డస్టర్ భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా విడుదలైనప్పుడు, ఇది ఈ విభాగంలోనే సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. అలాంటిది, ఇప్పుడు ఈ కారు మార్కెట్ నుండి కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

తాజా సమాచారం ప్రకారం, రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో నిలిపివేయనున్నట్లు సమాచారం. ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, కంపెనీ ఈ కారు అమ్మకాలను త్వరలోనే నిలిపివేయనుంది. ఖర్చులను తగ్గించి, లాభాలను పెంచే లక్ష్యంతో రెనాల్ట్ డస్టర్‌ను నిలిపివేస్తున్నట్లు సదరు నివేదిక పేర్కొంది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

అక్టోబర్ 2021లో రెనో ఇండియా తమ అసెంబ్లీ లైన్ నుండి చివరి డస్టర్ బ్యాచ్‌ను విడుదల చేయనున్నట్లు ఆ నివేదిక తెలిపారు. అయితే, కంపెనీ ఈ ఎస్‌యూవీని పూర్తిగా మార్కెట్ నుండి తొలగించి వేస్తుందా లేక దాని స్థానంలో కొత్త తరం మోడల్‌ను విడుదల చేస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

గత ఏడాది అక్టోబర్‌ నెలలో రెనో ఇండియా డస్టర్ ఎస్‌యూవీలో కొత్త టర్బో ఇంజన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 156 బిహెచ్‌పి శక్తిని మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

ఇది కాకుండా, రెనో డస్టర్ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ.9.86 లక్షల నుండి రూ.14.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

భారత మార్కెట్లో రెనో ఇండియా తమ మొదటి తరం డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ మోడల్‌లో పెద్దగా కొత్త అప్‌గ్రేడ్స్ ఏవీ తీసుకురాలేదు. చిన్నపాటి మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లు మినహా ఇందులో పూర్తిగా కొత్త తరం మోడల్‌ను కంపెనీ ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం, భారత ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

ఈ నేపథ్యంలో, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ మరియు డిజైన్ ఫీచర్లతో కంపెనీ తమ కొత్త తరం డస్టర్‌ను భారత్‌లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెనో ఇటీవలే, అంతర్జాతీయ మార్కెట్లలో 2022 మోడల్ డస్టర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

ఈ కొత్త మోడల్‌నే రెనో వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్‌కు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కొత్త 2022 డస్టర్ ఎస్‌యూవీలో Y-ఆకారపు హెడ్‌లైట్స్, సరికొత్త క్రోమ్ గ్రిల్, ఎల్‌ఈడి ఫ్రంట్ ఇండికేటర్స్, ఏరో-ఆప్టిమైజ్ 15 ఇంచ్ మరియు 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్ మరియు రియర్ స్పాయిలర్ వంటి డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

రెనో డస్టర్ ఎస్‌యూవీ డిస్‌కంటిన్యూ కానుందా? కారణం ఏంటి?

కొత్త 2022 రెనో డస్టర్ ఇంటీరియర్స్‌లో కూడా అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో కొత్తగా అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో ఇది సరికొత్త క్యాబిన్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ కారులో రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, కొత్త మెటీరియల్‌లు మరియు 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault India To Discontinue The Duster SUV In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X