తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ దేశవ్యాప్తంగా తన అమ్మకాలను పెంచడానికి మరియు వినియోగదారులకు సత్వర సర్వీస్ అందించడానికి కొత్త షోరూమ్ లను ఓపెన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఏకంగా 5 షోరూమ్ లను ఓపెన్ చేసింది.

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

తెలంగాణాలో రెనాల్ట్ ఎల్ బి నగర్, కొంపల్లి, మలక్‌పేట్, వరంగల్ మరియు నిజామాబాద్‌లో పిపిఎస్ మోటార్స్ అనే పేరుతో షోరూమ్ లను ఓపెన్ చేసింది. తెలుగు రాష్ట్రంలో షోరూమ్ లు ఉండటం వల్ల వాహన సర్వీసులు చాలా తొందరగా పొందవచ్చు. అంతే కాకుండా వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ షోరూమ్ సందర్శించడం వల్ల పూర్తిగా తెలుసుకోవచ్చు.

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

రెనాల్ట్ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం త్వరలో మరో 7 షోరూమ్ లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. వర్క్‌షాప్-ఆన్-వీల్స్ (వావ్) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టడంతో పిపివి మోటార్స్ 'సర్వీస్ ఎట్ డోర్స్ స్టెప్' సర్వీస్ కూడా ప్రారంభించింది. దీని ప్రకారం కేవలం 90 నిమిషాల్లో రెనాల్ట్ కార్లకు సర్వీస్ అందించడానికి కట్టుబడి ఉంటుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

ఈ సందర్భంగా పిపిఎస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ సంఘ్వీ మాట్లాడుతూ, రెనాల్ట్ ఇండియాతో మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు తెలంగాణలో మా అడుగుజాడలను మరింత విస్తరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

రెనాల్ట్ కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో తన రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కొత్త కిగర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 5.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెనాల్ట్ కైగర్ యొక్క బుకింగ్ మరియు టెస్ట్ డ్రైవ్ కూడా ప్రారంభించబడింది. దీనిని 11,000 రూపాయల ధరతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మార్చి 2021 నుండి ప్రారంభం కానున్నాయి.

MOST READ:వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

రెనాల్ట్ కిగర్ నాలుగు వేరియంట్లు, ఆరు ఎక్స్టీరియర్స్ షేడ్‌లలో మరియు రెండు పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది. రెనాల్ట్ కైగర్ మొత్తం 6 కలర్ అప్సన్స్ లో లభిస్తుంది. ఇవి ఐస్ కూల్ వైట్, ప్లానెట్ గ్రే, మూన్‌లైట్ గ్రే, మహోగని బ్రౌన్, కాస్పియన్ బ్లూ మరియు రెడీ రెడ్‌తో మిస్టరీ బ్లాక్ రూఫ్‌లో అందుబాటులో ఉంటాయి.

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

ఇక ఈ కొత్త కైగర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో గ్రే ప్లాస్టిక్ డాష్‌బోర్డ్‌లు, సెంటర్ కన్సోల్ మరియు బ్లాక్ విండోతో పవర్ విండో స్విచ్‌లు అందించబడతాయి. ఎసి వెంట్స్‌కు కొద్దిగా లైట్ గ్రే కలర్ ఫినిషింగ్ ఇవ్వబడుతుంది. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది.

MOST READ:చివరి రోజు పాండాతో కలిసి పని చేసిన డెలివరీ బాయ్.. ఎందుకంటే

తెలంగాణాలో ప్రారంభమైన 5 రెనాల్ట్ షోరూమ్స్.. ఇవే

రెనాల్ట్ కైగర్ 1.0-లీటర్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్లలో 5 స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి మరియు టర్బో పెట్రోల్‌లో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎమ్‌టి గేర్‌బాక్స్‌లు అందించబడతాయి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Opens Five New Showrooms In Telangana. Read in Telugu.
Story first published: Saturday, February 20, 2021, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X