Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 17 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- News
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ .. వదలని మహమ్మారి
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టర్కీలో రెనో టాలియంట్ సెడాన్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చేనా?
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్ కోసం ఓ కొత్త సెడాన్‌ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ కంపెనీ టర్కీ మార్కెట్లో "రెనో టాలియంట్" పేరుతో ఓ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్‌ను విడుదల చేసింది. ఆసియా మార్కెట్ల కోసం కంపెనీ ఈ సెడాన్‌ను ప్రత్యేకంగా తయారు చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ విక్రయించిన డాసియా లోగాన్ కారు రీబ్యాడ్జ్ వెర్షన్ వెర్షన్‌గా ఈ కొత్త రెనో టాలియంట్ కారును ప్రవేశపెట్టారు. ఈ మిడ్-సైజ్ సెడాన్‌ను కంపెనీ యొక్క రెండవ తరం రెనో క్లియో సెడాన్ ఆధారంగా తయారు చేశారు. రెనో క్లియో కారు 1999 నుండి మార్కెట్లో ఉంది.

ఈ రెండు కార్లతో పోలిస్తే, రెనో కారును హైలైట్ చేసేందుకు కంపెనీ టాలియంట్ సెడాన్‌లో హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లాంప్స్‌లతో సహా మరికొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. అదే సమయంలో, కారు ముందు భాగం సరికొత్త రెనో మోడళ్లకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది.
MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్

వెనుక భాగంలో, సి ఆకారంలో ఉన్న ఎల్ఈడి టెయిల్ లాంప్స్, పెద్ద రెనో బ్యాడ్జ్, రీడిజైన్ చేయబడిన డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి. రెనో టాలియంట్, డాసియా లోగాన్ కంటే అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ప్రస్తుతానికి రెనో టాలియంట్ సెడాన్‌కి సంబంధించిన ఇంటీరియర్ చిత్రాలు అందుబాటులో లేవు. అయితే, ఇవి అచ్చం డాసియా లోగాన్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది. రెనో ఈ ఏడాది మధ్య భాగం నాటికి టాలియంట్ మిడ్-సైజ్ సెడాన్‌ను టర్కీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది.
MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

రెనో అనుబంధ బ్రాండ్ అయిన డాసియా ఇప్పుడు తమ లోగాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొవు ఓ కొత్త వ్యాగన్ టైప్ వాహనాన్ని తయారు చేయాలని చూస్తోంది. రెనో ఈ వ్యాగన్‌ను పూర్తిగా పునర్నిర్మిస్తుందా లేక మరేదైనా కారును రీబ్యాడ్జ్ చేస్తుందా అనేది వేచి చూడాలి.

రెనో టాలియంట్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.5-లీటర్ డిసిఐ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ బై-ఫ్యూయెల్ టెక్నాలజీ (పెట్రోల్ మరియు ఎల్‌పిజి)ని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా త్రీ సిలిండర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లలో కూడా ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది.
MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

గేర్బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రెనో ప్రస్తుతానికి భారత మార్కెట్ కోసం ఓ కొత్త సెడాన్‌ను విడుదల చేయాలనే ప్రణాళికను విరమించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో స్కాలా అనే సెడాన్‌ను కంపెనీ విక్రయించిన విషయం తెలిసినదే.