ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

వాహనదారులు వాహనాన్ని కొనేముందు దాని మైలేజ్, ఫీచర్స్ మరియు వారంటీ వంటివి మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ వంటివి కూడా దృష్టిలో ఉంచుకుని వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కావున కంపెనీలు కూడా ఆధునిక కాలానికి అనుకూలంగానే మంచి సేఫ్టీ ఫీచర్స్ తో వాహనాలను విడుదల చేస్తున్నాయి.

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో వున్నా అన్ని కార్లను గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్ట్ చేసి సురక్షితం అవునా, కాదా అనేదాన్ని నిర్దారిస్తుంది. గ్లోబల్ ఎన్‌సిఎపి కార్ల తయారీదారులను సురక్షితమైన కార్లను అభివృద్ధి చేయమని ప్రోత్సహిస్తుంది. గ్లోబల్ ఎన్‌సిఎపి ఇప్పటివరకు భారతదేశంలో చాలా కార్లకు క్రాష్ టెస్ట్ లు నిర్వహించింది.

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ కార్ల జాబితాలో టాటా ఆల్ట్రోజ్, టాటా టియాగో, టాటా నెక్సాన్, వోక్స్వ్యాగన్ పోలో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మరెన్నో కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నింటికీ క్రాష్ టెస్టులు నిర్వహించి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ అందించింది.

MOST READ:ఆవిష్కరణకు సిద్ధమైన న్యూ జనరేషన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్; వివరాలు

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

ఇటీవల కాలంలో తాజాగా ఈ క్రాష్ టెస్ట్ జాబితాలో రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి చేరింది. దీనికి గ్లోబల్ ఎన్‌సిఎపి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. రెనాల్ట్ ట్రైబర్ 7-సీట్ల ఎమ్‌పివి గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయిందనే విషయం అందరికి తెలుసు. ఇప్పుడు జరిపిన క్రాష్ టెస్ట్ లో ఇది 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం గ్లోబల్ ఎన్‌సిఎపి యొక్క #SaferCarsForIndia క్రాష్ టెస్ట్ లో ఈ కారు అడల్ట్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ మరియు పిల్లల భద్రతలో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. మొత్తానికి ఇది సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది.

MOST READ:ఇల్లు వదిలి కరోనా బాధితులకు సర్వీస్ చేస్తున్న ఐటీ ఉద్యోగి

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి స్టాండర్డ్ గా ఉంటాయి. క్రాష్ పరీక్షించిన మునుపటి రెనాల్ట్ ఉత్పత్తులతో పోలిస్తే రెనాల్ట్ ట్రైబర్ యొక్క భద్రతా రేటింగ్ గణనీయమైన పెరుగుదలను చూపింది. కావున ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

గ్లోబల్ ఎన్‌సిఎపి ఇంతకుముందు క్విడ్ మరియు డస్టర్‌ వంటి వాటిని కూడా క్రాష్ టెస్ట్ చేసింది. వీటికి వరుసగా 1-స్టార్ మరియు 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లు లభించాయి. గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రటరీ జనరల్ అలెజాండ్రో ఫ్యూరెస్ మాట్లాడుతూ, క్విడ్‌పై మేము 2016 పరీక్షలతో పోలిస్తే ఫ్రంటల్ క్రాష్‌లలో వయోజన నివాసితుల రక్షణ పనితీరుపరంగా రెనాల్ట్ గణనీయంగా వృద్ధిని సాధించిందన్నారు.

MOST READ:భారతదేశంలో అత్యంత వేగవంతమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ 650 నిర్మించిన మంత్ర రేసింగ్; పూర్తి వివరాలు

ఈ రేటింగ్ తయారీదార్లకు ఒక నమ్మకాన్ని కలిగించింది. దీనితో త్వరలో తమ ఉత్పత్తులు తప్పకుండా 5 స్టార్ రేటింగ్ సాధించే అవకాశం ఉంది. కావున రెనాల్ట్ ఈ పురోగతిని సాధ్యమైనంత వరకు ఇలాగే ముందుకు సాగించడానికి ప్రయత్నించాలి అని ఆయన అన్నారు.

ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన రెనాల్ట్ ట్రైబర్.. పూర్తి వివరాలు

రెనాల్ట్ కంపెనీ తన కొత్త 2021 ట్రైబర్‌ ని ఎక్స్‌షోరూమ్ వద్ద రూ. 5.30 లక్షలకు విక్రయిస్తోంది. ప్రస్తుత బిఎస్ 6 స్టాండర్డ్ బేస్డ్ 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కొత్త రెనాల్ట్ ట్రైబర్‌లో ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్ మరియు 96 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కొత్త రెనాల్ట్ ట్రైబర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber MPV Gets 4-Star Safety Rating In Global NCAP Crash Test Details. Read in Telugu.
Story first published: Wednesday, June 2, 2021, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X