Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెనో ట్రైబర్ టర్బో పెట్రోల్ వేరియంట్ విడుదల వాయిదా!
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, దేశీయ విపణిలో ట్రైబర్ అనే కాంపాక్ట్ ఎమ్‌పివిని విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, ఇందులో టర్బో పెట్రోల్ వేరియంట్‌ను కంపెనీ ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేస్తుందని అందరూ భావించారు. కానీ, రెనో ఇండియా ఇప్పుడు ఆ ప్లాన్స్‌ను వాయిదా వేసుకుంది.

రెనో ఇండియా గడచిన 2019లో తమ ట్రైబర్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసింది. పొడవులో ఇది నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కారులో ఐదుగురు పెద్దలు మరియు ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఇది ధరకు తగిన విలువను అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో రెనో ట్రైబర్ కాంపాక్ట్ ఎమ్‌పివి 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని, 96 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?

రెనో ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

వాస్తవానికి ఈ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీల కన్నా ముందుగా రెనో ట్రైబర్ కాంపాక్ట్ ఎమ్‌పివిలోనే ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన ఇది ఆలస్యమైంది. వచ్చే ఏడాది వరకూ ట్రైబర్ ఎమ్‌పివిలో టర్బో పెట్రోల్ వేరియంట్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

ఈ విషయాన్ని రెనో ఇండియా సిఈఓ వెంకట్రామ్ మామిల్లపల్లె ధృవీకరించారు. రెనో ట్రైబర్‌లో మరింత శక్తివంతమైన వేరియంట్ అభివృద్ధి దశలో ఉందని, కానీ అది ఈ ఏడాది మాత్రం మార్కెట్లో విడుదల కాదని ఆయన అన్నారు.

రెనో ట్రైబర్ ఎమ్‌పివిలో ఉపయోగించబోయే శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనో ట్రైబర్ 7 సీటర్ వెర్షన్ కాంపాక్ట్ ఎమ్‌పివి మోడల్ కాబట్టి, దాని పేలోడ్‌కు అనుగుణంగా ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్‌ను జోడించడం చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది.
MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

అలాగే, ఈ టర్బో వేరియంట్‌ను మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా అందిస్తే బాగుంటుందని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. ఒకవేళ కంపెనీ ఇందులో సివిటి గేర్‌బాక్స్‌ని కూడా ఆఫర్ చేసినట్లయితే, రూ.10 లక్షల ధర లోపే అందుబాటులో ఉన్న 7-సీటర్ ఎమ్‌పివిగా ట్రైబర్ మరింత ఎక్కువ సక్సెస్‌ను సాధించే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది నాటికి రెనో ట్రైబర్ మార్కెట్లోకి ప్రవేశించి రెండు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బహుశా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పాటుగానే, కంపెనీ ఇందులో టర్బో పెట్రోల్ వేరియంట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!
Source: Rushlane