Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 19 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 22 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్స
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Sports
RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి
కొత్త సంవత్సరంలో చాలామంది వాహన తయారీదారు తమ బ్రాండ్ యొక్క అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి అనేక ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రెనాల్ట్ కంపనీ కూడా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. దేశీయ మార్కెట్లో రెనాల్ట్ యొక్క అమ్మకాలు గత నెలలో బాగా తగ్గుముఖం పట్టాయి. కావున ఇప్పుడు మంచి ఆఫర్లను తీసుకువచ్చింది.

రెనాల్ట్ కంపెనీ, డస్టర్, క్విడ్, ట్రైబర్ వంటి మోడళ్లపై రెనాల్ట్ దాదాపు రూ. 65,000 వరకు తగ్గింపును అందిస్తుంది. రెనాల్ట్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ రెనాల్ట్ క్విడ్. ఇది కంపెనీ అమ్మకాలను మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది.

ఇప్పుడు రెనాల్ట్ క్విడ్ మోడల్ పై ఈ జనవరిలో రూ. 50 వేల డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో దాని ఎఎమ్‌టిపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ అఫర్, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 10,000 లాయల్టీ బెనీఫీట్స్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10,000 వంటి ఆఫర్స్ ఉన్నాయి.
MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

ఇదే సమయంలో మాన్యువల్ వేరియంట్‌పై రూ. 15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ అఫర్, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 10,000 లాయల్టీ బెనిఫిట్, రూ .10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనితో పాటు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 5000 వరకు రిబేటు ఇస్తున్నారు.

రెనాల్ట్ యొక్క ట్రైబర్ కి జనవరిలో రూ. 60,000 తగ్గింపు అందించనున్నారు. దాని ఎఎమ్‌టిపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ .30,000 ఎక్స్ఛేంజ్ బెనీఫీట్, ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ .10,000 ఇస్తున్నారు.
MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

దీని మాన్యువల్ వేరియంట్లపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, ఎంచుకున్న వేరియంట్లపై రూ. 10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు 10,000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. దీనితో పాటు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 5000 వరకు రిబేటు కూడా ఇస్తున్నారు.

రెనాల్ట్ యొక్క డస్టర్ 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్‌పై రూ. 45,000 రిబేటు ఇవ్వబడుతోంది, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ. 30,000 మరియు లాయల్టీ బెనిఫిట్ రూ. 15 వేల వరకు అందిస్తున్నారు. అందులో రూ. 30,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. వీటితో పాటు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
MOST READ:నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు

రెనాల్ట్ యొక్క డస్టర్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్‌పై రూ .65,000 తగ్గింపు ఇవ్వబడుతుంది, రూ. 30,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ మరియు రూ. 15 వేల వరకు లాయల్టీ బెనిఫిట్ మరియు ఎంచుకున్న వేరియంట్లపై రూ. 20,000 క్యాష్ బెనిఫిట్ ఉంటుంది. అందులో రూ. 30,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.

వీటితో పాటు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో 3 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల ఈజీ కేర్ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు. రెనాల్ట్ కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్స్ ఈ కొత్త సంవత్సరంలో మరియు రానున్న సంక్రాంతి సందర్భంగా మంచి అమ్మకాలను చేపట్టే అవకాశం ఉంది.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి