సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

భారతదేశంలో చాలామంది ప్రజలు సొంతంగా కారు కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే దేశీయ మార్కెట్లో కొత్త కార్ల ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా సామాన్య ప్రజలు వీటికి కొనుగోలు చేయలేకపోతారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు కొంతమేరకు తక్కువ ధర ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఇలాంటి వారి కోసం చాలా కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లను నడుపుతూ చాలా వేగంగా ముందుకు వెళుతున్నాయి. ఇందులో ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా (Mahindra) కూడా ఇందులో ఒకటిగా ఉంది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

మహీంద్రా (Mahindra) కంపెనీ ఫస్ట్ ఛాయిస్ వీల్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తోంది. అయితే ఈ పండుగ సీజన్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు దాదాపు 40 శాతం వరకు పెరగనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ గత కేవలం 20 రోజుల్లో 3,000 కార్లను డెలివరీ చేసింది. అయితే ఈ దీపావళి సందర్భంగా మరో 1,000 కార్లను డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

ఇందులో భాగంగానే Mahindra కంపెనీ సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ ని దేశంలో వేగంగా వృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అంతే కాకుండా సెకండ్ హ్యాండ్ కార్లకు చిన్న నగరాల నుంచి మూడింట రెండొంతులు డిమాండ్‌ ఉంది. మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న నగరాలలోనే వీటికి మంచి డిమాండ్ ఉందని కంపెనీ సీఈవో అశుతోష్‌ పాండే తెలిపారు.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

దేశీయ ఆటో మొబైల్ పరిశ్రమలు చిప్‌ల కొరత కారణంగా ఈ పండుగ సీజన్‌లో కొత్త కార్లను, అనుకున్న సంఖ్యలో విక్రయించలేకపోతోంది. ఈ కారణంగానే కంపెనీల యొక్క అమ్మకాలు పండుగ సీజన్లో కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికి కూడా దేశీయ మార్కెట్లో ఉన్న చిప్‌ల కొరత కారణంగా కొత్త కార్ల కోసం వినియోగదారులు ఇంకా చాలా రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అందులోనూ వీటికి మంచి డిమాండ్ ఉన్న కారణంగా ఇవి సజావుగా మరియు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

వినియోగదారులు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలులో కూడా మెరుగైన స్థితిలో ఉన్న కార్లను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ఇప్పుడు మంచి సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న కారణంగా, మహీంద్రా తన ఫస్ట్ ఛాయిస్ వీల్స్ స్టార్లను ఈ ఏడాది 1200 నుండి 1500 కి పెంచబోతోంది. అంటే ఇక 300 స్టోర్లు పెరగనున్నాయి. దీని కోసమే కంపెనీ నెలకు 50 నుంచి 60 స్టోర్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

వీటితో పాటు కంపెనీ సూపర్ స్టోర్ల సంఖ్యను 2 నుంచి 20 కి పెంచనుంది. అయితే ఈ లక్ష్యాన్ని కంపెనీ ఎంతవరకు నెరవేరుస్తుందో త్వరలో తెలుస్తుంది. ఇటీవల కాలంలోనే ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా కూడా ఈ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ రంగంలోకి ప్రవేశించింది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

ఓలా కంపెనీ ఈ పండుగ సమయంలో దాదాపు 1,000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించింది. ఈ సమాచారం కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. మొత్తానికి మార్కెట్లో కొత్త కార్లకు మాత్రమే కాకూండా సెకండ్ కార్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని మనకు అవగతం అవుతుంది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

దేశీయ మార్కెట్లో 2022 ఆర్థిక సంవత్సరంలో, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కొత్త కార్ మార్కెట్ వృద్ధి రేటును అధిగమించి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ 12 నుంచి 14 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనాల ద్వారా తెలిసింది.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు మరియు విక్రయాలు 2026 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు 30.80 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు, పాత కార్లతో పోలిస్తే కొత్త కార్లు 10 శాతం వృద్ధి రేటును మాత్రమే సాధించగలవు.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

భారతదేశంలోని సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)లకు డిమాండ్ కూడా పెరుగుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో ఇప్పటికి విక్రయించిన సెకండ్ హ్యాండ్ కార్లలో నాలుగింట ఒక వంతు SUV లు ఉన్నాయి. భారతీయ కార్ మార్కెట్‌లో నిరంతరం పెరుగుతున్న SUV కార్ల యొక్క కొత్త మోడల్స్ దీనికి కారణం. సరసమైన ధరలో ఫీచర్-ప్యాక్డ్ SUV కార్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్ల వాటా 20 శాతం వరకు ఉంది. అయితే ప్రస్తుతం మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ అద్భుతమైన స్పందనను అందుకుంటున్నాయి. కావున మరిన్ని స్టోర్లు దేశీయ మార్కెట్లో పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ కంపెనీ ఎంత వరకు తమ సత్తా చాటుతాయో వేచి చూడాలి.

సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లోనూ పెరిగిన Mahindra సేల్స్: కారణం ఏమంటే?

భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన కారణంగా, చాలా మంది ప్రజలు సొంత వాహనాలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రజా రవాణా అయిన బస్సులు వంటి వాటిలో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే సొంత వాహనాలను కలిగి ఉండాలని సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువా సంఖ్యలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో బాగా అభివృద్ధి చేసందుతోంది.

Most Read Articles

English summary
Second hand cars sales increases upto 40 percent mahindra first choice wheels details
Story first published: Friday, November 5, 2021, 12:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X