భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, గతేడాది జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 పెర్ఫార్మెన్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఇప్పటికీ భారత మార్కెట్లో అమ్మకానికి ఉందని కంపెనీ ధృవీకరించింది.

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

స్టాండర్డ్ స్కొడా ఆక్టేవియా కారును ఆధారంగా చేసుకొని ఇందులో అధిక పనితీరు (హై-పెర్ఫార్మెన్స్) సెడాన్‌గా ఈ ఆక్టేవియా ఆర్ఎస్ 245 కారును రూపొందించారు. దేశంలో ఈ వేరియంట్ అమ్మకాలను కేవలం 200 యూనిట్లకే పరిమితం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

ప్రారంభంలో స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 కారుకి మంచి స్పందన లభించింది. ఒకానొక సమయంలో ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో ప్రారంభించిన కొన్ని నెలల్లోనే పూర్తిగా అమ్ముడైపోయినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే, కంపెనీ మాత్రం పుకార్లను కొట్టిపారేసింది. ఆక్టేవియా ఆర్ఎస్ 245 దేశంలో ఇప్పటికీ అమ్మకానికి ఉందని వివరించింది.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి ఏడాది కాలం పూర్తయిన తర్వాత కూడా ఈ స్పెషల్ మోడల్ ఇంకా అమ్మకానికి ఉందని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిన్స్ ఇటీవల తన ట్వీట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ దశలో కొత్త స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారును రూ.36 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది లగ్జరీ సెడాన్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి ప్రీమియం బ్రాండ్స్ ఆఫర్ చేసే ఎంట్రీ లెవల్ కార్లకు పోటీగా ఉంటుంది.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

స్టాండర్డ్ స్కొడా ఆక్టేవియాతో పోల్చుకుంటే, ఈ కొత్త స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 మంచి పరికరాలను, ఫీచర్లను మరియు అసాధారణమైన పనితీరును కనబరచే ఇంజన్‌ను కలిగి ఉంటుంది. స్కొడా ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఆక్టేవియా ఆర్ 245 కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

కొత్త భారతీయ దిగుమతి నిబంధనల ప్రకారం హోమోలోగేషన్ అవసరం లేనందున డీలర్లు ఇప్పటికీ ఈ స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 కారును విక్రయించవచ్చు. అంతేకాకుండా, ఈ కారు యూరో 6 (మన భారతదేశంలో బిఎస్ 6 కన్నా కఠినమైన ఉద్గార ప్రమాణాలను) కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

భారతదేశపు కొత్త దిగుమతి నియమాల ప్రకారం, కంపెనీలు సికెడి మరియు సిబియు చానెళ్ల ద్వారా సంవత్సరానికి 2,500 వాహనాలను హోమోలోగేషన్ అవసరం లేకుండా మనదేశంలోకి దిగుమతి చేసుకొని విక్రయించవచ్చు. అయితే, ఇలా దేశంలోకి దిగుమతి చేసుకునే అన్ని వాహనాలు కూడా అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 విషయానికి వస్తే, ఇందులో శక్తివంతమైన 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 242 బిహెచ్‌పి పవర్‌ను మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్ షిఫ్టింగ్ కోసం పాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి.

MOST READ:క్రిమినల్స్ నుండి సీజ్ చేసిన కార్లతో మంచి పనులు చేస్తున్న పోలీసులు!

భారతదేశంలో స్కొడా ఆక్టేవియా ఆర్‌ఎస్ 245 కారు ఇప్పటికీ అమ్మకానికి ఉంది!

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి స్కొడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 కేవలం 6.6 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto India Confirms Octavia RS 245 Still On Sale, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X