కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, తమ సరికొత్త 2021 స్కొడా కొడియాక్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించింది. ఏప్రిల్ 13, 2021వ తేదీన కంపెనీ తమ కొత్త స్కొడా కొడియాక్ పరదాలను తొలగించి, ప్రపంచానికి పరిచయం చేసింది.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

కొత్త 2021 స్కొడా కొడియాక్ సరికొత్త డిజైన్ మరియు అదనపు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. కొత్త 2021 స్కొడా కొడియాక్ ఎస్‌యూవీ భారతదేశంలోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

ఈ కొత్త మోడల్‌లో మరింత నిటారుగా ఉండే, హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కి ఇరువైపులా సన్నటి డిజైన్‌తో మరియు ఇంటిగ్రేటెడి ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో సి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి టెయిల్ లైట్స్‌ను కూడా ఇందులో గమనించవచ్చు. ఈ కారులోని ఓవరాల్ ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ మునుపటి కన్నా మరింత షార్ప్‌గా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్కొడా ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది. మునుపటి స్కొడా కొడియాక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వస్తున్న ఈ 2021 మోడల్‌లో కంపెనీ అనేక అంశాలను రీడిజైన్ చేసింది.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

ఇందులో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బోనెట్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బెటర్ విజిబిలిటీ కోసం ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్ యూనిట్, ఫ్రంట్ బంపర్‍‌లో హనీకోంబ్ గ్రిల్ మరియు ఎల్-ఆకారపు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ వంటి అంశాలు ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

ఇక, ఈ కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇందులోని బెల్ట్‌లైన్ దాని కొత్త క్లామ్‌షెల్ బోనెట్‌తో మిళితం చేయబడినట్లుగా ఉంటుంది. అలాగే, రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా కనిపించే స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను ఇందులో చూడొచ్చు.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

అంతేకాకుండా, రూఫ్ పైభాగంలో కొత్త బ్లాక్ కలర్ రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక వైపు బూట్ డోరుపై పెద్ద అక్షరాలతో కూడిన స్కొడా బ్యాడ్జింగ్, స్ప్లిట్ స్టైల్ ఎల్ఈడి టెయిల్ లైట్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, కొత్త 18 ఇంచ్ మరియు 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

కొత్త 2021 స్కొడా కొడియాక్‌లో కంపెనీ ఇప్పుడు ఆప్షనల్ ఎర్గోనామిక్ వెంటిలేటెడ్ సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇవి హీటెడ్ ఫంక్షన్‌తో పాటుగా మసాజ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇంకా ఇందులో ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది, ఇది 10 రకాల కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్లలో అప్‌గ్రేడెడ్ స్కొడా కొడియాక్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభ్యం కానుంది. ఇందులోని 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0 లీటర్ టిఎస్‌ఐ ఇంజన్ 190 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. ఇకపోతే, ఇందులోని 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌ను రెండు ఇంజన్ ట్యూన్‌లలో 150 బిహెచ్‌పి, 200 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్

కొత్త 2021 కొడియాక్ ఎస్‌యూవీని సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్ రూపంలో ఇండియాకు విడిభాగాలుగా దిగుమతి చేసుకొని స్థానికంగా అసెంబుల్ చేస్తామని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హాలిస్ ఇదివరకే ధృవీకరించారు. ఈ కొత్త స్కొడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మునుపటి కన్నా మరింత స్పోర్టీయర్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Kodiaq SUV Officially Unveiled; India Launch Expected Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X