మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యత ప్రజాదరణ పొందిన స్కోడా (Skoda) భారతదేశంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ తన ఉనికిని మరింత విస్తరించడంలో భాగంగానే ఇటీవల మైసూర్‌లో తన కొత్త షోరూమ్‌ని ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో తన పరిధిని విస్తరించడంతో కంపెనీ ఇప్పుడు నిమగ్నమై ఉంది. కావున స్కోడా మార్కెట్లో మరిన్ని కొత్త షోరూమ్‌లను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ ఈ మధ్య కాలంలోనే చెన్నై మరియు హైదరాబాద్‌లో కూడా తన కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. అయితే ఇప్పుడు మైసూర్‌లో కూడా కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించింది. ఈ కొత్త డీలర్‌షిప్‌లు కస్టమర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. కావున అమ్మకాలు కూడా మరింత పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త షోరూమ్‌ని శ్రీ బాలాజీ ఆటో ఏజెన్సీ మైసూర్, ప్లాట్ నెం. 46, కూర్గల్లి ఇండస్ట్రియల్ ఏరియా, బెల్వాడి, మైసూర్‌లో ప్రారంభించింది. స్కోడా దేశీయ మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేయడమే కాకుండా తన పరిధిని కూడా ఎప్పటికప్పుడు విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఈ కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం జరుగుతోంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో స్కోడా యొక్క కార్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఇటీవల కాలంలోనే కొత్త స్కోడా స్లావియాను ఆవిష్కరించింది. ఇది 2022 ఏప్రిల్ నెలలో మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సెడాన్ యొక్క బుకింగ్స్ కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన మోడల్ కానుంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా ఆటో తన కొత్త డీలర్‌షిప్‌లను సాంగ్లీ, భిల్వారా, ఫరీదాబాద్, పంచకుల, నవ్‌సారి, వాపి మరియు హర్దోయ్‌లతో సహా అనేక ఇతర నగరాల్లో ప్రారంభించబోతోంది. ప్రస్తుతం, కంపెనీకి టైర్ II మరియు టైర్ III నగరాల్లో 90 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

స్కోడా ఆటో ఇండియా ఈ ఏడాది భారతదేశంలో 30,000 కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో స్కోడా కుషాక్ ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ 2022 చివరి నాటికి 60,000 కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కావలసిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ యొక్క SUV లు మరియు సెడాన్లు భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీ 2021 లో దేశీయ విఫణిలో రెండు కొత్త కార్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి కొత్త స్కోడా ఆక్టావియా కాగా, మరొకటి స్కోడా కుషాక్ SUV ఉన్నాయి. ఇఇ రెండు కూడా కంపెనీకి మంచి అమ్మకాలను తీసుకురావడంలో బాగా సహాయపడ్డాయి.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ గ్రూప్ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2019 సంవత్సరంలో స్కోడా ఆటో ఇండియా, వోక్స్‌వ్యాగన్ ఇండియా మరియు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా కలయికతో ఏర్పడింది. ఇది తమ కార్యకలాపాలను సులభం చేసుకోటానికి మాత్రమే కాకుండా, తమ ఉనికిని మరింత బలోపేతం చేసికోవడానికి అనుకూలంగా ఉంటుంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ ఇప్పటికి అందించిన సమాచారం ప్రకారం, నాన్-మెట్రో ప్రదేశాలలో కాంపాక్ట్ వర్క్‌షాప్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాంపాక్ట్ వర్క్‌షాప్‌లు ఈ స్థానాల్లోని సేల్స్ మరియు డీలర్ బ్రాంచ్‌లతో విలీనం చేయబడతాయి. ఇందులో అమ్మకాలు మరియు అమ్మకాల తరువాత సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది. మొత్తానికి కంపనీ ఈ సంవత్సరం చివరి నాటికి 30 వర్క్‌షాప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో తన కొత్త స్కొడా కుషాక్ SUV ని ప్రారంభించడం వల్ల గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ SUV విడుదలైనప్పటినుంచి కూడా ఇప్పటివరకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కుషాక్‌ను ప్రారంభించినప్పటి నుండి తమ నెట్‌వర్క్ 25% వృద్ధి చెందిందని కూడా స్కోడా తెలిపింది. దీన్ని బట్టి చూస్తే స్కోడా యొక్క పురోగతికి కుషాక్ ఎంతగానో సహకరించింది.

మైసూర్‌లో కొత్త షోరూమ్‌ ప్రారంభించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ నుంచి స్కోడా కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్ రానుంది. ఈ కొత్త కారుకి సంబంధించిన కొంత సమాచారం వెల్లడైంది. దీని ప్రకారం, స్కోడా కుషాక్ మోంటే కార్లో ప్రస్తుత వేరియంట్‌లో అందుబాటులో లేని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, రూఫ్ లైనర్ మొదలైన వాటిని పొందవచ్చని తెలుస్తోంది. ఈ SUV యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda opens new dealership in mysore details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X