భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగానే చాలా వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉతప్పటి చేసి మార్కెట్లో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన స్కోడా (Skoda) కూడా ఈ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అరంగేట్రం చేయడానికి సన్నద్దమౌతోంది. కావున స్కోడా ఎలక్ట్రిక్ కార్లు కూడా భారతీయ మార్కెట్లోకి రావడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

నివేదికల ప్రకారం, స్కోడా (Skoda) కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ముందుగా ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించనుంది. ఆ తరువాత దేశంలో ఏర్పడే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. స్కోడా కంపెనీ ఇప్పటికే యూరప్‌ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఘనవిజయం సాధించిన ఎన్యాక్‌ (Enyaq) ఎలక్ట్రిక్ కారుని భారత మార్కెట్ కోసం తీసుకువచ్చే కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు అయ్యే అవకాశం ఉంటుంది.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

Skoda కంపెనీ వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన టెస్టింగ్ వంటివి నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో గత ఏడాది నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఏర్పడింది. అంతే కాకూండా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీ, హోమ్ ఛార్జర్‌పై రాయితీ వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

ఎలక్ట్రిక్ వాహన విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, స్కోడా ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగం రేసులో భారతీయ మార్కెట్‌లో వెనుకబడి ఉండకూడదనుకుంటుంది. కావున కంపెనీ ప్రస్తుతానికి ఎటువంటి తొందరపాటు చూపకుండా చాలా జాగరూకగా వ్యవహరిస్తోంది.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

అయితే ప్రస్తుతం లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో విజయం సాధించిన తర్వాత స్కోడా కూడా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేస్తోంది. కావున త్వరలో స్కోడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

ఈ సందర్భంగా స్కోడా కంపెనీ గ్లోబల్ ఛైర్మన్, థామస్ స్కేఫర్ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న భారతదేశంలో కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి చాలా ఆసక్తి చూపుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది కంపెనీకి కీలకమైన విభాగం. ఈ ప్రణాళిక ప్రకారం, స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ పోర్ట్‌ఫోలియోలోని 30 శాతం కార్లు ఈ దశాబ్దం చివరి నాటికి ఎలక్ట్రిక్‌గా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

కంపెనీ యొక్క గ్లోబల్ టార్గెట్ 70 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని సైతం చాటుకోడానికి దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆశిస్తోంది. కావున స్కోడా కార్లు రాబోయే సమత్సరాల్లో తప్పకుండా తన ఉత్పత్తిని స్థానికంగా జరపడానికి కూడా సన్నాహాలు చేస్తుంది.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుంది. కావున స్కోడా కంపెనీ కూడా ఈ విధమైన విజయం కోసం పాటుపడనుంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు గత సంవత్సరం మొదటి అర్ధభాగంతో పోలిస్తే 234 శాతం వృద్ధిని నమోదు చేశాయి, 2021 ఏప్రిల్ మరియు 2021 సెప్టెంబర్ మధ్య 6261 యూనిట్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ విధమైన డిమాండ్ ఉందో అర్థమవుతుంది.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

స్కోడా కంపెనీ చైర్మన్ స్థానికీకరణపై దృష్టి సారించారు, కావున ప్రభుత్వం దిగుమతి పన్నును తగ్గించాలని ఆయన తెలిపారు. కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను పరీక్షించాలని మీరు కోరుకుంటే, స్థానికీకరణకు ముందు పన్ను తగ్గించాలని, లేకపోతే అవి అభివృద్ధిని ఆపివేస్తాయని ఆయన అన్నారు.

భారత్‌కు రానున్న Skoda ఎలక్ట్రిక్ కార్లు.. మొదట రానున్న కార్ అదే

ఇంతకుముందు, టెస్లా కూడా పన్నులను తగ్గించమని కోరింది, అలాగే స్కోడా యొక్క భాగస్వామి ఆడి కూడా అధిక పన్ను కారణంగా భారతదేశంలో లగ్జరీ సెగ్మెంట్ వృద్ధి చెందడం లేదని కావున పన్నులు తగ్గించాలని ప్రభుత్వాలను కోరింది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, కంపెనీలు స్థానికీకరణను పెంచాలని, దిగుమతి పన్నును తగ్గించమని కంపెనీలు ప్రభుత్వాల నుంచి ఆశిస్తున్నాయి. ఏది ఏమైనా స్కోడా నుంచి ఎలక్ట్రిక్ కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెడితే ఎలాంటి ఆదరణ పొందుతాయి అనేది.. ఇప్పుడు ప్రశ్నర్ధంకం. అయితే మంచి అమ్మకాలను పొందుతాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda plans to introduce electric car in india details
Story first published: Saturday, November 13, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X