Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) భారతీయ మార్కెట్ కోసం కొత్త స్లావియా (Slavia) అనే కొత్త సెడాన్ ని సిద్ధం చేస్తోంది. ఈ సెడాన్ దేశీయ మార్కెట్లో 2021 నవంబర్ 18 న ఆవిష్కరించబడుతుంది. అయితే అంతకంటే ముందే కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క డిజైన్ వెల్లడించింది. మనం ఇదివరకు కూడా ఈ Skoda Slavia గురించి చాలా సమాచారం తెలుసుకున్నాం. కానీ అప్పుడు ఈ సెడాన్ పూర్తిగా కప్పబడి ఉంది. అయితే ఇప్పుడు మొదటి సారి బహిర్గతం అయ్యింది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

కొత్త Skoda Slavia చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు వెల్లడైన ఈ డిజైన్ ప్రకారం ఈ కొత్త మోడల్ ముందు మరియు వెనుక భాగం చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది, కావున చాలా దూకుడుగా అనిపిస్తుంది. ఇది కంపెనీ యొక్క MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అంతే కాకుండా Skoda రాపిడ్ కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంటుంది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

స్కోడా రాపిడ్ నిలిపివేయబడిన కారణంగా ఆ స్థానంలో ఈ స్లావియా భర్తీ చేయబడింది. ఈ ప్రీమియం సెడాన్ కంపెనీ యొక్క ఇండియా 2.0 ప్రాజెక్ట్ క్రింద విడుదల కానున్న రెండవ కారు. కావున ఇది అనేక ఆధునిక ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

Skoda Slavia మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ యొక్క సిగ్నేచర్ గ్రిల్ దాని ముందు భాగంలో ఇవ్వబడింది. దానికి దిగువన ఎయిర్ డ్యామ్‌లు ఇవ్వబడ్డాయి, వీటిని పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. హెడ్‌లైట్ యూనిట్‌లు రెండు వైపులా ఉంచబడ్డాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హెడ్‌లైట్‌ల క్రింద రౌండ్ ఫాగ్ లైట్లు ఉంచబడతాయి.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

ఇక Skoda Slavia సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు, ఇవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దాని పైన ORVM ఇన్‌స్టాల్ చేయబడ్డాయి, అంతే కాకుండా ఇందులో టర్న్ ఇండికేటర్ ఇన్‌స్టాల్ చేయబడింది. డోర్ హ్యాండిల్ గుండా వెళుతున్న లైన్ వెనుక నుండి కారు ముందు వరకు కనిపిస్తుంది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

స్కోడా కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త స్లావియా పరిమాణంలో స్కోడా ర్యాపిడ్ సెడాన్ కంటే ఎక్కువగా ఉటుంది. పొడవు మరియు కాకుండా ఈ సెడాన్ యొక్క వీల్‌బేస్ కూడా పెరిగింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం స్కోడా స్లావియా పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

మొత్తంమీద, ఈ మిడ్ సైజ్ సెడాన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు ఇది స్కోడా ర్యాపిడో కంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

Skoda Auto India (స్కోడా ఆటో ఇండియా) తన కొత్త Slavia (స్లావియా) ను రెండు ఇంజన్ ఎంపికలతో అందించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క ధర మరియు ఇతర ఇంటీరియర్ వంటి వివరాలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఈ సెడాన్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత ధర మొదలైన సమాచారం అందుబాటులోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఇది ప్రారంభించిన తర్వాత బుకింగ్‌లు మరియు ఉత్పత్తిని ప్రారంభించే ముందు, జనవరిలో భారతీయ రోడ్లపై చూడవచ్చని భావిస్తున్నాము.

Skoda Slavia డిజైన్ చూస్తే తప్పకుండా కొనాలనుకుంటారు.. కావాలంటే ఓ లుక్కేసుకోండి

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Skoda Slavia కంపెనీకి మరో ముఖ్యమైన మోడల్ కానుంది. కంపెనీ యొక్క కుషాక్ భారతీయ మార్కెట్లో ఆశించిన విజయాన్ని పొందింది. కావున కంపెనీ ఈ కొత్త మోడల్‌తో మరింత మంచి అమ్మకాలను పొందటానికి ఉపయోగిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడవుతుంది. అయితే ఈ కొత్త సెడాన్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆధరణ పొందుతుందో తెలుసుకోవడానికి, కొంత సమయం వేచి చూడాలి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda slavia design exterior sketch revealed details
Story first published: Tuesday, November 2, 2021, 16:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X