అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) మరియు అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) ల మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా మోటార్స్ సంస్థ 1991లో టాటా సియారా (Tata Sierra) అనే కారుతో దేశంలో తొలిసారిగా కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఆ తర్వాత 1998 లో తమ రెండవ కారు టాటా ఇండికా (Tata India)ను ప్రవేశపెట్టింది. అయితే, టాటా ఇండికా కారు మార్కెట్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత టాటా మోటార్స్ నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో కంపెనీ తమ కార్ల వ్యాపారాన్ని అమెరికన్ ఆటోమేజర్ ఫోర్డ్ (Ford) కంపెనీకి విక్రయించాలని నిర్ణయించింది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఈ డీల్ కోసం రతన్ టాటా బృందాన్ని ఫోర్డ్ కంపెనీ అమెరికాకు ఆహ్వానించింది. ఇందుకోసం రతన్ టాటా ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ఫోర్డ్ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు. అయితే, ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ టాటా-ఫోర్డ్ డీల్ ఆదిలోనే అంతమైంది. ఫోర్డ్ అధికారుల దురుసు ప్రవర్తన వలనే ఈ డీల్ క్యాన్సిల్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

కట్ చేస్తే.. తిరిగి 2008లో ఫోర్డ్ అధీనంలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) టాటా మోటార్స్ స్వాధీనం చేసుకుంది. టాటా మోటార్స్ స్వాధీనం చేసుకునే నాటికి జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ దాదాపుగా దివాళతీసే స్థితిలో ఉంది. ఈ బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ను నిర్వహించడంలో ఫోర్డ్ పూర్తిగా విఫలమైంది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఆ పరిస్థితుల్లో టాటా మోటార్స్ ముందుకొచ్చి, నష్టాల్లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను ఫోర్డ్ నుండి కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఫోర్డ్ అధికారులు రతన్ టాటాను చాలా ప్రశించారు. ఈ సంస్థను కొనుగోలు చేసి, తమను నష్టాల బారి నుండి తప్పించారని, తమ సాయాన్ని మర్చిపోలేమని అన్నారు.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

రతన్ టాటా అధీనంలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ మార్కెట్లలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫేట్ పూర్తిగా మారిపోయింది. ఈ డీల్ జరిగిన 5 ఏళ్ల తర్వాత (2013 నాటికి) జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్ బ్రాండ్ లలో ఒకటిగా నిలిచింది. అదేవిధంగా మనదేశంలో టాటా మోటార్స్ పనితీరు కూడా మెరుగుపడింది. టాటా నుండి కొత్త డిజైన్ మరియు టెక్నాలజీతో కూడిన కార్లు మార్కెట్లోకి వచ్చాయి.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

కాగా.. ఇప్పుడు తిరిగి మరోసారి ఫోర్డ్ కంపెనీని ఆదుకునేందుకు టాటా మోటార్స్ ముందుకొచ్చింది. భారతదేశంలో గత కొన్నేళ్లు వస్తున్న భారీ నష్టాల కారణంగా ఫోర్డ్ ఇండియా దేశాన్ని విడిచి వెళ్లనున్నట్లు ప్రకటించిన సంగతిత తెలిసినదే. ప్రస్తుతం, ఫోర్డ్ దేశంలోని తమ వ్యాపారాలన్నింటినీ మూసివేసి, ఆస్తులను విక్రయించాలని చూస్తోంది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఈ నేపథ్యంలో, టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఫోర్డ్ యాజమాన్యంలో ఉన్న చెన్నై ప్లాంట్‌ను కొనుగోలు చేయడానికి టాటా మోటార్స్ సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావేశంలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చలు విజయవంతమైతే, ఫోర్డ్ ఫ్యాక్టరీలను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఈ వార్తల నేపథ్యంలో, గురువారం (అక్టోబర్ 7, 2021 న) ఉదయం టాటా మోటార్స్ షేరు ధర ట్రేడ్ అయిన మొదటి గంటలోనే 9 శాతం కంటే ఎక్కువ పెరిగింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి, టాటా మోటార్స్ షేర్ ధర దాదాపు రూ. 335 ఉండే, ప్రస్తుతం అది రూ. 365 కి చేరుకుంది. అయితే, టాటా మోటార్స్ ఇంకా ఈ వార్తను అధికారికంగా ధృవీకరించలేదు.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితమే ఫోర్డ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా, టాటా మోటార్స్ యొక్క వాణిజ్య వాహన విభాగంలో చేరినట్లు ప్రకటించారు. ఫోర్డ్ ఇండియా కంపెనీ భారతదేశం నుండి నిష్క్రమణ గురించి ప్రకటించిన 15 రోజుల తర్వాత, సెప్టెంబర్ 24, 2021 న అనురాగ్ ఫోర్డ్‌ కంపెనీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం, అనురాగ్ ఇప్పుడు టాటా సివి ఇంటర్నేషనల్ బిజినెస్ మరియు స్ట్రాటజీకి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

భారతదేశంలో 2 బిలియన్ డాలర్ల నష్టం: ఫోర్డ్

ఫోర్డ్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో గడచిన 10 ఏళ్ల కాలంలో కంపెనీ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్లు తెలిపింది. అందుకే, ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పేర్కొంది. ఫోర్డ్ ఇండియా ఇప్పటికే తమ ఫ్యాక్టరీల షట్‌డౌన్ టైమ్‌లైన్ ని కూడా ప్రకటించింది. సమాచారం ప్రకారం, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్‌ను మరియు 2022 రెండవ త్రైమాసికం నాటికి చెన్నై ప్లాంట్ ను మూసివేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

ఫ్యాక్టరీల షట్‌డౌన్ వలన రోడ్డున పడనున్న వేలాది కార్మికులు

ఫోర్డ్ ఇండియా భారతదేశాన్ని విడిచిపెట్టాలని తీసుకున్న నిర్ణయం వలన దాదాపు 5,300 మంది ఉద్యోగులు మరియు కార్మికుల భవిష్యత్తును అనిశ్చితంగా మారింది. ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంట్‌లో దాదాపు 2700 మంది శాశ్వత ఉద్యోగులు మరియు 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అదే సమయంలో, గుజరాత్ లోని సనంద్‌ ప్లాంట్ లో కార్మికుల సంఖ్య సుమారు 2000 మందిగా ఉంది.

అప్పుడు కుదరదన్నారు.. కానీ ఇప్పుడు వారే దిక్కయ్యారు.. మరోసారి Ford ని ఆదుకోనున్న Tata!

అలాగే, సనంద్ ఇంజన్ ఎక్స్‌పోర్ట్ ప్లాంట్‌లో మరో 500 మంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా, మరో 100 మందికి పైగా ఉద్యోగులు కస్టమర్ కేర్ మరియు పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేస్తున్నారు. ఫోర్డ్ ఇండియా నిష్క్రమణ తర్వాత కూడా వీరు భారతదేశంలో కంపెనీ వ్యాపారానికి మద్దతునిస్తూనే ఉంటారు. ఫోర్డ్ ఇండియా నిర్ణయం వలన సుమారు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని అంచనా.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Tata motors plans to take over the ford plant in chennai report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X