మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

అమెరికాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. ఈ కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ యొక్క కార్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. అయితే టెస్లా కంపెనీ ఇటీవల తన కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన సాఫ్ట్‌వేర్ తీసుకువచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కంపెనీ 'హాలిడే సాఫ్ట్‌వేర్' అనే కొత్త సాఫ్ట్‌వేర్ విడుదల చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లోని ఒక ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన ఫీచర్ ఏమిటంటే, టెస్లా కారులోని ఎలక్ట్రిక్ లైట్స్, మ్యూజిక్ కి అనుకూలంగాఉంటాయి. టెస్లా యొక్క కొత్త హాలిడే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారు యొక్క ఎలక్ట్రిక్ లైట్లను ఆన్ మరియు ఆఫ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా అద్భుతమైన మరియు ఆధునిక ఫీచర్.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కంపెనీ తీసుకువచ్చిన ఈ కొత్త సాఫ్ట్‌వేర్ కస్టమర్లకు చాలా నచుతుంది. అంతే కాకూండా, ఈ ఫీచర్ మినీ పార్టీ కవర్‌ను అందించడానికి రూపొందించబడింది. ఈ అప్డేట్ దాదాపు కంపెనీ యొక్క అన్ని మోడల్స్ కి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కంపెనీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మోడల్ 3, మోడల్ S, మోడల్ Y మరియు మోడల్ X అనే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అయితే ఈ కార్లు భారతీయ మార్కెట్లో విక్రయించబడలేదు. అయితే వీటిని దిగుమతి చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే చాలామంది పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నారు.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఇప్పుడు తన కార్ వినియోగదారులను మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అన్ని మోడళ్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. టెస్లా యొక్క లైట్ షో అనుకూలీకరణ నచ్చకపోతే కస్టమర్‌లు వారి స్వంత రీడిజైన్‌ను పొందవచ్చు.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కస్టమర్ అంచనాలను అందుకోవడానికి దీన్ని సులభతరం చేసింది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. వినియోగదారులు ప్రాసెసర్ ద్వారా లైట్ షోను సవరించవచ్చు. దీనికి కంప్యూటర్ మాత్రమే అవసరం. ఈ ఫీచర్ వెర్షన్ 11.0 ద్వారా అందించబడింది.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా లైట్ షోతో పాటు, ఈ అప్‌డేట్‌పై కంపెనీ కొన్ని అప్‌డేట్‌లను కూడా అందించింది. వీటిలో నావిగేషన్, గేమ్, ఎంటర్టైన్మెంట్, ఆడియో, బ్లైండ్ స్పాట్ మరియు ఆటోపైలట్ సమయంలో సస్పెన్షన్ వంటివి ఉన్నాయి. ఈ అప్డేట్స్ ఖచ్చితంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇప్పటికే చాలా మంది టెస్లా కస్టమర్‌లు ఈ అప్‌డేట్ గురించిన వీడియోలను తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా తొలి ఎలక్ట్రిక్ కారు త్వరలో భారతదేశంలో విడుదలకు సిద్ధమవుతోంది. టెస్లా యొక్క ఫ్లాగ్‌షిప్ కార్లలో ఒకటైన మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్ మొదట భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో విడుదల చేసిన తర్వాత ఈ కారు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, ఆడి ఈ-ట్రాన్ మరియు జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా కంపెనీ అమెరికాతో పాటు, ప్రపంచంలోని అనేక దేశాలలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. టెస్లా కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న విధంగా ప్రపంచంలో ఏ కంపెనీ కూడా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించలేదు. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ ఇటీవల తన ఆస్తి విలువలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువైన ఆస్తులను కలిగి ఉంది. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ రెంటల్ కార్ కంపెనీ హెర్ట్జ్ టెస్లా నుండి 1 లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసింది. టెస్లా ఆస్తులు 1 ట్రిలియన్ డాలర్లను అధిగమించాయి.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను వ్యక్తిగత వినియోగదారులు మరియు హెర్ట్జ్ వంటి అద్దె కార్ల కంపెనీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. టెస్లా చాలా కాలం పాటు చురుకుగా ఉంది. ఈ కారణంగానే హెర్ట్జ్ వంటి కొత్త కంపెనీలతో వ్యాపారం చేస్తోంది.

ఇందులో భాగంగానే టెస్లా మరియు హెర్ట్జ్ మధ్య జరిగిన ఒప్పందం విలువ $4 బిలియన్లు. టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు విలువ అమెరికాలో 40,000 డాలర్లు. దీని ఫలితంగా టెస్లా మరియు హెర్ట్జ్ మధ్య $4 బిలియన్ల ఒప్పందం కుదిరింది, టెస్లా ఆస్తులు $1 ట్రిలియన్ కంటే ఎక్కువ. టెస్లా షేర్లను కొనుగోలు చేసిన వారికి ఈ వార్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో టెస్లా షేర్ ధర $1,024.86కి పెరిగింది. అంటే మొదటిదానికంటే 13% పెరిగింది.

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ లైట్స్.. టెస్లాలో అప్డేట్ సాఫ్ట్‌వేర్ [వీడియో]

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ 255.8 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఆస్తి విలువ మునుపటికంటే కూడా 11.4% పెరిగింది. ఈ ఏడాది జనవరిలో టెస్లా బెంగళూరులో తన కార్యాలయాన్ని నమోదు చేసుకుంది. భారత్‌లో విడుదల కానున్న టెస్లా కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్లా యొక్క మోడల్ 3 అనేక సార్లు భారతీయ రోడ్లపై పరీక్షించబడింది. కావున ఇది త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెడుతుంది.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla launches holiday software update in its electric cars details
Story first published: Monday, December 27, 2021, 13:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X