1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) తన మార్కెట్ ఆస్తుల విలువపై తాజా వివరాలను విడుదల చేసింది. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ మరియు ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న టెస్లా మార్కెట్ విలువ ఇప్పుడు 1 ట్రిలియన్ యూస్ డాలర్లకు పైగా చేరుకుంది.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

టెస్లా అమెరికన్ కార్ బ్రాండ్ అయినప్పటికీ, అనేక ఆసియా మరియు యూరప్ దేశాలలో కూడా కూడా టెస్లా ఎలక్ట్రిక్ విజయపథంలో దూసుకుపోతున్నాయి. నిజం చెప్పాలంటే, ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచంలోని ఏ ఇతర కంపెనీ కూడా ఇంత మేర వృద్ధిని సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా, టెస్లా ఆస్తుల విలువ 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ఇందుకు ప్రధాన కారణం టెస్లా కార్లపై కస్టమర్లు చూపిస్తున్న అశేష ఆదరణ. నాణ్యత, అధిక రేంజ్ మరియు అటానమస్ డ్రైవింగ్ వంటి అనేక లక్షణాల వలన టెస్లా కార్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించిపోతున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్ళుతున్నారు.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ఇలా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న వారికి ప్రధానంగా కనిపించే కార్ బ్రాండ్ టెస్లా గా మారింది. టెస్లా ఎలక్ట్రిక్ పూర్తిగా అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఈ కార్లలో స్టీరింగ్ వీల్‌పై మినహా ఎక్కడా భౌతిక బటన్లు కనిపించవు. కారులోని అన్ని ఫీచర్లను డ్యాష్‌బోర్డు మధ్యలో అమర్చిన డిస్‌ప్లే యూనిట్ ద్వారా మరియు యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

టెస్లా కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లకు తాజాగా ఓ భారీ ఆర్డర్ వచ్చింది. ప్రముఖ అమెరికన్ రెంటల్ కార్ కంపెనీ హెర్ట్జ్ (Hertz) నుండి టెస్లా కి 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఆర్డర్ వచ్చింది. టెస్లా నుండి హెర్ట్జ్ ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసి, కస్టమర్లకు అద్దెకు ఇవ్వనుంది. ఈ డీల్ కారణంగా టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కసారిగా 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, టెస్లా సంస్థ అధినేత ఎలోన్ మస్క్ ఆస్తులు విలువ కూడా 11 శాతానికి పైగా పెరిగింది.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ఇప్పటి వరకూ నేరుగా వ్యక్తిగత కస్టమర్లు మాత్రమే టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తుంటే, ఇప్పుడు హెర్ట్జ్ వంటి ప్రముఖ కార్ రెంటల్ కంపెనీలు కూడా అద్దె ప్రయోజనాల కోసం ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే, దీని అర్థం అమెరికాలో టెస్లా కారును నేరుగా కొనుగోలు చేయగలిగే ఆర్థిక సామర్థ్యం లేని కస్టమర్లు ఇప్పుడు వాటిని కొంత కాలం పాటు అద్దెకు తీసుకోవచ్చు.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

అలా కాకుండా, టెస్లా సంస్థే నేరుగా కస్టమర్లకు లీజింగ్ ప్రాతిపధికన కూడా తమ కార్లను విక్రయిస్తోంది. నిర్ధిష్ట కాల పరిమితి కోసం కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కారును లీజ్ తీసుకోవచ్చు. టెస్లా మరియు హెర్ట్జ్ కంపెనీల మధ్య జరిగిన ఈ ఒప్పందం విలువ సుమాలు 4 మిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ఇదిలా ఉంటే, టెస్లా ఇటీవలే అమ్మకాల పరంగా ఓ అరుదైన రికార్డును కూడా సృష్టించింది. ఈ సంస్థ గడచిన మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, ఓ కొత్త రికార్డును సృష్టించింది. దీంతో టెస్లా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

టెస్లా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో అత్యధికంగా అమ్ముడైన కార్లు మోడల్ 3 మరియు మోడల్ Y. వీటిలో మోడల్ 3 అనేది ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు. మొత్తం అమ్మకాలలో 15 లక్షలకు పైగా యూనిట్లు మోడల్ 3 మరియు మోడల్ Y ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వాటి తర్వాత మోడల్ S మరియు మోడల్ X ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. టెస్లా రోడ్‌స్టర్ మోడల్ కూడా గణనీయమైన అమ్మకాల పరిమాణాన్ని కలిగి ఉంది.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు

ఇదిలా ఉంటే, ఈ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ, భారతదేశంలో కూడా తమ వ్యాపారాన్ని సాగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానం పట్ల టెస్లా సంస్థ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంపోర్టెడ్ కార్లపై పన్ను తగ్గింపు విషయమైన టెస్లా అధికారులు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

టెస్లా ఇండియా ఇప్పటికే, బెంగుళూరులో తమ కంపెనీ పేరును కూడా రిజిస్టర్ చేసుకుంది. ఈ సంస్థ నుండి ముందుగా భారతదేశంలో మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు విడుదల కావచ్చని భావిస్తున్నారు. కానీ, టెస్లా ప్రస్తుతానికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో తయారు చేసే ఆలోచనలో లేదు.

1 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న Tesla మార్కెట్ వ్యాల్యూ, పెరిగిన ఎలోన్ మస్క్ ఆస్తి!

ప్రారంభంలో, పూర్తిగా విదేశాల్లో తయారైన ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా భావిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం టెస్లా ఇక్కడే స్థానికంగా ఎలక్ట్రిక్ తయారు చేయాలని పట్టు పట్టి కూర్చుంది. మరి ఈ చర్చలు ఎప్పుడు సఫలం అవుతాయో, ఎప్పుడు ఈ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్లు మన రోడ్లపై తిరుగుతాయో చూడాలి.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Tesla market value reaches 1 trillion us dollars mark details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X