2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

భారతదేశంలో కొత్త కాలుష్య ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడం, పెట్రోల్ ధరలు అమాతం పెరిగిపోవడం మరియు డీజిల్ కార్ల లభ్యత తగ్గిపోవడంతో కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపుకు మళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలో, కార్ల తయారీదారులు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా, 2021లో భారతదేశంలోకి అనేక ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశించాయి.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అంతర్జాల దిగ్గజం గూగుల్ (Google) ని ఆశ్రయించాయి. ఈ సంవత్సరంలో ఇంటర్నెట్లో అత్యధికంగా శోధించిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాను గూగుల్ విడుదల చేసింది. మరి, గూగుల్ సెర్చ్ ఇంజన్ లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన ఆ టాప్ 10 ఎలక్ట్రిక్ కార్లు ఏవో మనం కూడా చూద్దాం రండి.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

1. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును భారతీయులు గూగుల్‌లో 1.35 లక్షల సార్లు సెర్చ్ చేశారు. ఫలితంగా, Google యొక్క 2021లో అత్యధికంగా శోధించబడిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు అగ్రస్థానంలో నిలిచింది.ప్రస్తుతం, భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు ధరలు రూ. 14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఇందులో IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

2. టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV)

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న కారు కూడా టాటా మోటార్స్‌కి చెందినదే. టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ ఈవీని గూగుల్‌లో భారతీయులు 74,000 సార్లు సెర్చ్ చేశారు. ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు కూడా టాటా టిగోర్ ఈవీనే. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 12 లక్షల నుండి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 26 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 306 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

3. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ఈవీ. ఈ ఎలక్ట్రిక్ కారును మొత్తం 60,500 మంది భారతీయులు Googleలో శోధించారు. మార్కెట్లో ఈ కారు ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా రూ.20.88 లక్షలు మరియు రూ. 23.58లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 419 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

4. ఆడి ఇ-ట్రాన్ (Audi e-Tron)

భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లలో ఆడి ఇ-ట్రాన్ కూడా ఒకటి. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి విడుదల చేసిన ఈ కారును, భారతదేశంలో 27,100 సార్లు గూగుల్‌లో శోధించబడింది. ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు మూడు బాడీ స్టైల్స్‌లో విడుదల చేశారు. మార్కెట్లో ఈ కారు ధరలు కోటి రూపాయాల నుండి ప్రారంభం అవుతాయి. ఈ కార్లలో 95 కిలోవాట్ అవర్ లిథియం ఐయాన్‌ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఇవి పూర్తి చార్జ్ పై గరిష్టంగా 359-484 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తాయి.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

5. జాగ్వార్ ఐ-పేస్ (Jaguar i-Pace)

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో విడుదలచేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఐ-పేస్. ఈ కారును గూగుల్‌లో భారతీయులు 24,000 కంటే ఎక్కువ సార్లు శోధించారు. ఈ కారుకు వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది. ఈ ఎలక్ట్రిక్ కారులో 90 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది, దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 470 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

6. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ (Hyundai Kona EV)

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా దేశీయ విపణిలో ఓ ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. హ్యుందాయ్ కోన పేరుతో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు రూ. 23.79 లక్షల ప్రారంభ ధర నుండి విక్రయానికి అందుబాటులో ఉంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

ఈ ఎలక్ట్రిక్ కారును గూగుల్‌లో భారతీయులు 22,200 సార్లు సెర్చ్ చేశారు. ఇందులో 100 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 131 bhp పవర్ మరియు 395 Nm టార్క్ ను విడుదల చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జింగ్ పై 452 కి.మీల వరకు ప్రయాణించగలదు.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

7. మహీంద్రా ఇ-వెరిటో (Mahindra e-Verito)

భారతదేశంలో విక్రయానికి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా ఇ-వెరిటో కూడా ఒకటి. వాణిజ్య కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టారు.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉప్పటికీ, గూగుల్‌లో ఈ కారును 8,100 సార్లు సెర్చ్ చేశారు. భారత విపణిలో మహీంద్రా ఇ-వెరిటో ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 10.15 లక్షల నుండి అందుబాటులో ఉంటుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

8. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి (Mercedes-Benz EQC)

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో జర్మన్ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ప్రవేశపెట్టిన మోడల్ ఈక్యూసి. ఈ ఏడాది ఈ ఎలక్ట్రిక్ కారును గూగుల్ లో 5,400 సార్లు శోధించారు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఆల్ వీల్ డ్రైవ్ మరియు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారుతో సహా అనేక ఇతర విలాసవంతమైన ఫీచర్లతో లభిస్తుంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 80kW లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 450 కిమీ నుండి 471 కిమీ దూరం ప్రయాణించవ్చచు. భారత మార్కెట్లో ఈ కారు ధర కోటి రూపాయలకు పైగా ఉంది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

9. మహీంద్రా ఇ2ఓ ప్లస్ (Mahindra e2o Plus)

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, రేవా ఎలక్ట్రిక్ అనే సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రవేశపెట్టిన రెండవ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా ఈ2ఓ ప్లస్. ఈ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ లో 2,400 సార్లు శోధించారు.

దురదృష్టవశాత్తూ ఈ కారు ప్రస్తుతం భారత మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో లేదు. ఒకానొక సమయంలో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు దాని కాంపాక్ట్ పరిమాణం కారణంగా, భారతదేసంలో పట్టణ ప్రయాణాలకు అనువైన ఎలక్ట్రిక్ కారుగా ఉండేది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

10. మహీంద్రా రేవా (mahindra Reva)

మహీంద్రా రేవా జాయింట్ వెంచర్ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు మహీంద్రా రేవా. బహుశా భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కూడా ఇదేనేమో. ఇద్దరు ప్రయాణీకుల కోసం అర్బన్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఇది.

2021 సంవత్సరంలో Google లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్లు!

అయితే, ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో నిలిపివేయబడింది. మహీంద్రా ఈ కారు విక్రయాన్ని నిలిపివేసి చాలా నెలలు అయ్యింది. కానీ, భారతీయులు మాత్రం ఈ కారు కోసం గూగుల్ లో 90 సార్లు వెతికారు.

Most Read Articles

English summary
Top 10 most searched electric cars on google in india in 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X