Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

కొత్త సంవత్సరంలో టొయోటా (Toyota) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో 'టొయోటా హైలక్స్' (Toyota Hilux) పికప్ ట్రక్‌ కూడా ఒకటి. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కొత్త టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ వచ్చే ఫిబ్రవరి నాటికి మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. కంపెనీ ఈ పికప్ ట్రక్కును వాణిజ్య వినియోగం కోసం కాకుండా, ప్రీమియం లైఫ్ స్టైల్ విభాగంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఈ విభాగంలో ఇప్పటికే మరొక జపనీస్ కార్ కంపెనీ ఇసుజు మోటార్స్ 'డి-మ్యాక్స్' అనే లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కును అందిస్తోంది. టొయోటా హైలక్స్ ఈ సెగ్మెంట్‌లో రెండవ మోడల్ గా రానుంది. టొయోటా హైలక్స్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ దీని తయారీలో ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్లలో ఉపయోగించిన అనేక సాంకేతికతలను మరియు పరికరాలను అలానే కొనసాగించనుంది. ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించనున్నారు.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఈ ఫ్రేమ్ పై తయారు కానున్న టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ మోడల్ స్మార్ట్ క్యాబ్, సింగిల్ క్యాబ్ మరియు క్రూ క్యాబ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అయితే, భారతదేశంలో ప్రాక్టికల్ గా ఉండే క్రూ క్యాబ్ వెర్షన్ ను మాత్రమే కంపెనీ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఇసుజు డి-మ్యాక్స్ మాదిరిగానే, టొయోటా హైలక్స్ పికప్ కూడా దాదాపు 5.3 మీటర్ల పొడవును మరియు 3 మీటర్ల వీల్‌బేస్ ను కలిగి ఉంటుందని సమాచారం.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఈ పికప్ ట్రక్కు విషయంలో ఇటీవల విడుదలైన స్పై చిత్రాల ప్రకారం, టొయోటా హైలక్స్ పికప్ మజిక్యులర్ బాడీ లైన్స్ తో మంచి అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. షార్ప్ హెడ్‌ల్యాంప్‌లు, సన్నని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్, గుండ్రటి టెయిల్ లైట్లు, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ మరియు వీల్ ఆర్చెస్ చుట్టూ బ్లాక్ క్లాడింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

భారత మార్కెట్లో విడుదల కాబోయే టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు యొక్క సాంకేతిక వివరణలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, టొయోటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఫార్చ్యూనర్‌లో ఉపయోగిస్తున్న అదే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌నే కొత్త హైలక్స్ పికప్ ట్రక్కులో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని మరియు 500 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే, ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ గరిష్టంగా 420 ఎన్ఎమ్ టార్క్ ని మాత్రమే జనరేట్ చేస్తుంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఈ పవర్‌ఫుల్ ఫార్చ్యూనర్ ఇంజన్ హైలక్స్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ధరను తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులోని ఎంట్రీలెవల్ వేరియంట్లలో టొయోటా ఇన్నోవా క్రిస్టాలో ఉపయోగిస్తున్న 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. అలాగే, ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ 343 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఈ రెండు రకాల ఇంజన్లు కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా హిలక్స్ రియర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ తో స్టాండర్డ్‌గా లభ్యం కావచ్చని సమాచారం. అయితే, ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. ఈ లైఫ్ స్టైల్ పికప్ ట్రక్కులో కంపెనీ అనేక కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లను కూడా అందించనుంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

ఇందులో ఆఫర్ చేయబోయే ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అంటే ఇంటీరియర్‌లో ఇది ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి సమానమైన ఇంటీరియర్ సెటప్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా హైలక్స్ తయారీ ఖర్చులను తగ్గించడానికి ఇది స్థానికంగా తయారు చేయబడిన Innova మరియు Fortuner వాహనాల నుండి అనేక అంతర్గత భాగాలను కలిగి ఉంటుంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

మార్కెట్ అంచనా ప్రకారం, టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కు ధరలు రూ. 25 లక్షల నుండి రూ. 32 లక్షల మధ్యలో ఉంటాయని అంచనా. టొయోటా గత కొంత కాలంగా భారతదేశంలో ఎలాంటి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టలేదు. మారుతి సుజుకి సంస్థతో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా, కంపెనీ మారుతి నుండి కొనుగోలు చేసిన వాహనాలను రీబ్యాడ్జ్ చేసి భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇలా ఇప్పటికే, మారుతి బాలెనో ఆధారంగా రూపొందించిన గ్లాంజా మరియు మారుతి విటారా బ్రెజ్జా ఆధారంగా రీబ్యాడ్జ్ చేసిన అర్బన్ క్రూయిజర్ మోడళ్లను టొయోటా విక్రయిస్తోంది.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

అయితే, టొయోటా హైలక్స్ రాకతో కంపెనీ ఈ విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పికప్ ట్రక్కు కోసం ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో టొయోటా హైలక్స్ పికప్ ట్రక్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. భారత మార్కెట్లో పోటీ విషయానికి వస్తే, టొయోటై హైలక్స్ ఈ విభాగంలో ఇసుజు హై-ల్యాండర్ మరియు వి-క్రాస్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. మార్కెట్లో వీటి ధరలు రూ. 18.05 లక్షల నుండి రూ. 25.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Fortuner ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్‌నే Toyota Hilux పికప్ ట్రక్‌లో కూడా..

భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మహీంద్రా స్కార్పియో గెట్‌అవే మరియు టాటా జెనాన్ వంటి సరసమైన పికప్ ట్రక్కులకు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభించలేదనే చెప్పాలి. ప్రస్తుతం, వీటిని ప్రధానంగా వాణిజ్య వినియోగం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జపనీస్ బ్రాండ్ టొయోటా నుండి వస్తున్న హైలక్స్ పికప్ ట్రక్కును వినియోగదారులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Toyota hilux pickup truck to borrow 2 8 diesel engine from fortuner suv in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X