ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్, భారత మార్కెట్లో ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయం కారణంగా, వచ్చే నెల నుండి కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

అయితే, ఎంత మేర ధరలను పెంచనున్నారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే, మారుతి సుజుకి, నిస్సాన్, డాట్సన్, రెనో వంటి కంపెనీలు కూడా వచ్చే ఏప్రిల్ 2021 నెల నుండి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

టొయోటా ప్రస్తుతం దేశీయ విపణిలో గ్లాంజా హ్యాచ్‌బ్యాక్, యారిస్ సెడాన్, అర్బన్ క్రూయిజర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి, క్యామ్రీ ప్రీమియం సెడాన్ మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఏప్రిల్ 1, 2021వ తేదీన కంపెనీ ఈ అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది.

MOST READ:13,000 యూనిట్లు దాటిన హోండా సిబి350 అమ్మకాలు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను ధరల పెంపు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ధరల పెంపుకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియనున్నాయి.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

ఇక టొయోటా అర్బన్ క్రూయిజర్ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీలోని డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్‌లో సమస్య కారణంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గడచిన జూలై 28, 2020 నుండి ఫిబ్రవరి 11, 2021 మధ్య కాలంలో తయారైన మొత్తం 9,498 యూనిట్ల అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలలో ఈ సమస్యను గుర్తించి రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

అయితే, అర్బన్ క్రూయిజర్ రీకాల్ గురించి టొయోటా కిర్లోస్కర్ ఇంకా ఖచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. అయితే కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్ అసెంబ్లీతో ఈ సమస్య వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

ఈ కారణంగా సంబంధిత భాగాలను మార్చడానికి వాహనాలను రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ రీకాల్‌కు వర్తించే వాహనాలను కంపెనీ గుర్తించి, సదరు వాహన యజమానులను అధీకృత టొయోటా డీలర్లు సంప్రదించేలా చర్యలు తీసుకుంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

ఈ రీకాల్ కోసం తీసుకువచ్చే అన్ని ప్రభావిత టొయోటా అర్బన్ క్రూయిజర్ ఎస్‌యూవీలలో ఈ భాగాన్ని తనిఖీ చేసి, అవసరమైతే పూర్తి ఉచితంగా రీప్లేస్ చేస్తారు. సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టయోటా యొక్క మొదటి ఎస్‌యూవీ.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

టొయోటా అర్బన్ క్రూయిజర్‌ను మారుతి సుజుకి విక్రయిస్తున్న విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇందులో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ గ్రిల్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు ఇండికేటర్లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ మరియు స్ప్లిట్ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

మారుతి సుజుకి తయారు చేస్తున్న విటారా బ్రెజ్జాను టొయోటా తమకు అనుగుణంగా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో మార్పులు చేసి రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఈ అర్బన్ క్రూయిజర్‌ను విక్రయిస్తుంది. ఈ మోడల్ కాకతో టొయోటా బ్రాండ్ అమ్మకాలు స్వల్పంగా మెరుగుపడ్డాయి.

Most Read Articles

English summary
Toyota India To Increase Car Prices From April 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X