ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా, ఇప్పటికీ దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల కారణంగా దేశీయ వాహన తయారీదారులు తమ డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లు మరియు విడిభాగాల దుఖాణాలను పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, విడిభాగాల లభ్యత పెద్ద సమస్యగా మారింది.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

వాహన సర్వీస్ సమయంలో సరైన విడిభాగాలు దొరక్కపోవడంతో సర్వీసులో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడిభాగాలను పంపిణీ చేసేలా టొయోటా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ అధీకృత జెన్యూన్ స్పేర్ పార్ట్స్‌ను కస్టమర్ల ఇంటి వద్దకే చేర్చేలా డోర్ స్టెప్ డెలివరీ సేవలను ప్రారంభించింది.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

ఇకపై టొయోటా కిర్లోస్కర్ కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండే అసలైన విడి భాగాలను పొందవచ్చు. 'టయోటా పార్ట్స్ కనెక్ట్'లో భాగంగా, కంపెనీ ఇప్పుడు జెన్యూన్ విడిభాగాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు'డోర్ డెలివరీ' ఆప్షన్‌ను అందిస్తోంది.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

ఆసక్తిగల కస్టమర్లు టొయోటా కిర్లోస్కర్ డీలర్‌షిప్ నుండి అవసరమైన విడి భాగాలను పొందవచ్చు. వీటిలో కార్ కేర్ ఎసెన్షియల్స్, ఇంజన్ ఆయిల్, టైర్లు మరియు బ్యాటరీలతో సహా అనేక రకాల టొయోటా జెన్యూన్ ఉత్పత్తులను వినియోగదారులు డెలివరీ ద్వారా పొందవచ్చు.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

టొయోటా కిర్లోస్కర్ ప్రస్తుతం ఈ 'డోర్ డెలివరీ' ఆప్షన్‌ను ప్రస్తుతం దేశంలోని 12 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, 2021 చివరి నాటికి ఈ సేవలను దేశంలోని అన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ తెలిపింది.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

ఈ కొత్త చొరవపై టొయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ, "ఈ కొత్త చొరవను ప్రారంభించడంతో, సాధ్యమైనంత ఉత్తమమైన కస్టమర్ అనుభవాన్ని అందించే మా నిబద్ధతలో మరో ప్రధాన మైలురాయిని సాధించామ"ని అన్నారు.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

"కస్టమర్లు మరియు వాహనాల భద్రతలో నిజమైన భాగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి, కాబట్టి వినియోగదారుని స్నేహపూర్వక అనుభవం కోసం నిజమైన భాగాల ప్రాప్యత మరియు లభ్యతను మెరుగుపరచడం కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటామ"ని ఆయన అన్నారు.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవలే కర్ణాటకలోని తమ బిడాడి ప్లాంట్‌లో జూన్ 15 నుండి పాక్షికంగా ఉత్పత్తిని ప్రారంభించింది కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరించి కంపెనీ 50 శాతం మంది ఉద్యోగులతో తమ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

కరోనావైరస్ మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ నుండి తమ ఉద్యోగులను సురక్షితంగా ఉంచడానికి టొయోటా కిర్లోస్కర్ గత నెలలో తమ బిడాది ప్లాంట్‌లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ సమయంలో, టొయోటా ప్లాంట్‌లో వార్షిక నిర్వహణ పనులు జరిగాయి.

ఇంటి వద్దకే స్పేర్ పార్ట్స్; డోర్ స్టెప్ డెలివరీని ప్రారంభించిన టొయోటా!

టొయోటా ఇప్పుడు తమ ఉద్యోగుల కోసం టీకాలపై కూడా దృష్టి సారించింది. గత వారం నుండి, సంస్థ తన ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తోంది. టొయోటా డీలర్లు, సరఫరాదారులు మరియు సిబ్బందికి కూడా కరోనా టీకాలు వేయిస్తోంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors Starts Door Step Delivery Of Genuine Spare Parts, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X