కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

జర్మన్ కార్ బ్రాండ్ టొయోటా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త టొయోటా ఫార్చ్యూనర్ మరియు ఫార్చ్యూనర్ లెజెండర్ వేరియంట్లను కంపెనీ థాయ్‌లాండ్ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది. థాయ్ మార్కెట్లో ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ కొత్త యాక్ససరీ ప్యాకేజ్‌ను కూడా ప్రవేసపెట్టింది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

థాయ్ మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ కోసం కంపెనీ ‘ప్రైడ్ ప్యాకేజీ II' పేరుతో కొత్త లిమిటెడ్ ఎడిషన్ యాక్ససరీ ప్యాకేజీని అందిస్తోంది. అయితే, ఇది స్టాండర్డ్ ఎడిషన్ ఫార్చ్యూనర్‌కి మాత్రేమ అందుబాటులో ఉంటుంది, లెజెండర్ వేరియంట్‌కి ఈ ప్యాకేజ్ వర్తించదు.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

గత ఫిబ్రవరి 24, 2021వ తేదీ నుండి మార్చి 31, 2021వ తేదీల మధ్యలో కొత్త స్టాండర్డ్ వెర్షన్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లు మాత్రమే ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రైడ్ ప్యాకేజ్ II అందుబాటులో ఉంటుంది.

MOST READ:కొచ్చిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

ప్రైడ్ ప్యాకేజీ IIలో భాగంగా ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ల కోసం బ్లాక్-అవుట్ బాష్ ప్లేట్లు, ఫ్రంట్ గ్రిల్ కోసం బ్లాక్ సరౌండ్స్, సైడ్ మిర్రర్లపై బ్లాక్ క్యాప్స్, బ్లాక్ సైడ్ స్టెప్స్, బ్లాక్ రూఫ్ మరియు బోనెట్‌లో బ్లాక్ ‘ఫార్చ్యూనర్' బ్యాడ్జ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్యాకేజీ ధర 46,500 థాయ్ భాట్ (సుమారు 1.1 లక్షలు)గా ఉంది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

ప్రస్తుతానికి ఈ ప్రైడ్ ప్యాకేజ్ II థాయ్ మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది. భారత మార్కెట్లో ఈ ప్యాకేజ్ ఆఫర్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

MOST READ:అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

మనదేశంలో ఈ ఏడాది జనవరి ఆరంభంలో తమ సరికొత్త 2021 ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త ఫార్చ్యూనర్ మోడల్‌తో పాటుగా కంపెనీ ఇందులో లెజెండర్ అన్ పవర్‌ఫుల్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది. మార్కెట్లో వీటి ధరలు రూ.29.98 లక్షల నుంచి రూ.37.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ 4x4 మరియు 4x2 డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుండగా, లెజెండర్ వేరియంట్ మాత్రం కేవలం 4x2 ఆప్షన్‌తోనే లభిస్తోంది. ఇవి రెండూ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

కొత్త 2021 మోడల్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.8-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 204 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 166 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

ఫార్చ్యూనర్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అలాగే, డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ లేదు. డీజిల్‌లో టూ-వీల్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి, పెట్రోల్‌లో టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

ఇందులో ఎల్ఈడి డిఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో పాటుగా టొయోటా బ్రాండ్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన 8 ఇంచ్ టిఎఫ్‌టి మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే, 8-రకాలు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, 6 మరియు 11 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ బ్లాక్ అండ్ చమోయిస్ లెథర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ కోసం లిమిటెడ్ ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజ్!

అంతేకాకుండా, 7 ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ (4x4లో మాత్రమే), ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్, హై అండ్ లో రేంజ్ గేర్‌బాక్స్ (4x4లో మాత్రమే), క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Toyota Launches Limited Edition Styling Package For Fortuner SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X