Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
కేసీఆర్ సర్కార్‌కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు
- Sports
అక్కడ గెలిస్తేనే టీమిండియా అత్యుత్తమ జట్టు: మైకేల్ వాన్
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టి-సర్వ్, ఫిక్స్ మై కార్స్ వర్క్‌షాప్ ఓపెన్; డ్రైవ్‌స్పార్క్ రీడర్లకు స్పెషల్ డిస్కౌంట్స్!
జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ టొయోటా, భారత్‌లో తమ కొత్త మల్టీ-బ్రాండ్ సర్వీస్ సెంటర్ 'టి-సర్వ్'ను బెంగళూరు నగరంలో ప్రారంభించినట్లు ప్రకటించింది. బెంగుళూరులో ఇలాంటివి మొత్తం సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ నుండి ఫ్రాంచైజీని అందుకున్న ఐదు సర్వీస్ సెంటర్లలో ఒకటైన 'ఫిక్స్ మై కార్స్' సంస్థను మా డ్రైవ్‌స్పార్క్ బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా, తమ వ్యాపార విధానానికి సంబంధించిన అనేక విషయాలను కంపెనీ మాతో షేర్ చేసుకుంది. అంతేకాకుండా, డ్రైవ్‌స్పార్క్ రీడర్ల కోసం ప్రత్యేకమైన డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు ఫిక్స్ మై కార్స్ కంపెనీ సర్వీస్ సెంటర్ పేర్కొంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫిక్స్ మై కార్స్ సంస్థ టి-సర్వ్ మద్ధతుతో అన్ని రకాల ప్యాసింజర్ కార్లకు అవసరమైన సేవలను అందిస్తుంది. ఫిక్స్ మై కార్స్ వర్క్ షాప్‌ను బెంగుళూరులోని కళ్యాణ్ నగర్‌లో ఏర్పాటు చేశారు. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్ని ప్యాసింజర్ కార్లకు అవసరమైన మెకానికల్ మరియు బాడీ రిపేర్ సేవలను అందిస్తారు.

ఫిక్స్ మై కార్స్ అందిస్తున్న సేవల్లో జనరల్ సర్వీసింగ్, పీరియాడిక్ మెయింటినెన్స్, హీటర్ అండ్ ఏసి మెయింటినెన్స్, వెహికల్ డైనమిక్ చెక్ అండ్ ఎవల్యుయేషన్, ఇంటీరియర్ ట్రీట్మెంట్ మరియు బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ మొదలైన సేవలు ఉన్నాయి. ఈ వర్క్‌షాప్‌లో కార్ వాష్ సౌలభ్యం కూడా ఉంది.

ఈ వర్క్‌షాప్‌లో, పనిచేసే టెక్నీషియన్లు అన్ని రకాల ప్యాసింజర్ కార్లకు సర్వీసింగ్ మరియు ఇతర మరమ్మత్తుల నిర్వహించేందుకు కావల్సిన శిక్షణను టొయోటా ద్వారా పొంది ఉంటారు. అంతేకాకుండా, ఇక్కడ ప్రత్యేకించి టొయోటా కార్లలో ఉపయోగించే విడిభాగాలను కూడా టికెఎమ్ అధికారికంగా పంపిణీ చేస్తుంది. టి-సర్వ్ వర్క్ షాపులకి వచ్చే ఇతర కార్ల విడిభాగాల కోసం టొయోటా డెన్సో, ఐడిమిట్సు, బాష్ మరియు అడ్విక్స్ వంటి అనేక బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది.

ఫిక్స్ మై కార్స్ తమ వినియోగదారుల కోసం సర్వీస్ అపాయింట్‌మెంట్‍ను బుక్ చేసుకోవడానికి ఓ స్వంత వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో టొయోటా టి-సర్వ్ సహకారంతో వర్క్‌షాప్ అందించే వివిధ రకాల సేవలను లిస్ట్ చేయబడి ఉంటాయి.

ఈ వెబ్‌సైట్ ప్రమోషన్ ఆఫర్లను తెలియజేయటంతో పాటుగా ప్రతి సర్వీస్‌కు సుమారుగా అయ్యే ఖర్చును తెలియజేస్తుంది. దానికి అనుగుణంగా కస్టమర్లు తమ సర్వీస్‌ను ఎంచుకొని, వెబ్‌సైట్ ద్వారానే సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

దీనికి అదనంగా, టికెఎమ్ (టొయోటా కిర్లోస్కర్ మోటార్) ఈ ఫ్రాంచైజీలకు ఓ మొబైల్ అప్లికేషన్ రూపంలో కూడా డిజిటలైజ్డ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు పూర్తిగా కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని పొందుతూ, వాహన సర్వీస్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా కస్టమర్లు తమ సమీపంలో ఉన్న టి-సర్వ్ వర్క్‌షాప్‌లో సర్వీస్ రిక్వెస్ట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇలా అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసే సమయంలోనే కస్టమర్లు తమ వాహన సర్వీస్‌కు సంబంధించిన వివరాలను కూడా ఇందులో పేర్కొనవచ్చు. అంతేకాకుండా, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.

సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సమయంలో కస్టమర్లు పికప్ మరియు డ్రాప్ సేవలను కూడా ఎంచుకోవచ్చు. కారు టి-సర్వ్ సర్వీస్ సెంటర్‌కు చేరుకున్న తర్వాత, ప్రతి మరమ్మత్తు లేదా పార్ట్ రీప్లేస్‌మెంట్‌కి సంబంధించిన చిత్రాలను సర్వీస్ సెంటర్ ఈ మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసి, సదరు రిపేరుకు సంబంధించిన వివరాలను కూడా నమోదు చేస్తుంది.

ఇలా చేయటం వలన కస్టమర్లు తమ మొబైల్ ద్వారానే తమ వాహన సర్వీస్ స్థితిని మరియు వివరాలను తెలుసుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల డిజిటిల్ పేమెంట్స్ సాయంతో కస్టమర్లు చెల్లింపులు కూడా చేయవచ్చు. ఈ స్మార్ట్ యాప్ సాయంతో కస్టమర్లు ఇలా పూర్తిగా కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని పొందవచ్చు.
బెంగుళూరులో ఫిక్స్ మై కార్స్ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్స్:
Phone Numbers: 7090009537/7090009547
Address:#122/1, Chalkare Village, Kalyan Nagar Service Road, Bangalore-560043

గుర్తుంచుకోండి, బెంగుళూరులోని ఈ ఫిక్స్ మై కార్స్ వర్క్‌షాప్ డ్రైవ్‌స్పార్క్ రీడర్లకు ప్రత్యేకమైన డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా, ఈ సర్వీస్ సెంటర్‌ను సందర్శించినప్పుడు మీరు డ్రైవ్‌స్పార్క్ పాఠకులని, మా వెబ్‌సైట్‌లో ఫిక్స్ మై కార్స్ కథనాన్ని చదివామని చెప్పడమే. మరి ఆలస్యమెందుకు వెంటనే మీరు కారును ఈ సర్వీస్ సెంటర్‌కి తీసుకువెళ్లండి.