ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Triton (ట్రిటాన్) ఇటీవల హైదరాబాద్‌లో తన మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించడం ద్వారా భారతదేశంలో తన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ SUV భారతదేశంలో విడుదల కానున్న మొదటి Triton (ట్రిటాన్) కార్ అవుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

Triton (ట్రిటాన్) హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది చంకీ ఫ్రంట్ లుక్ మరియు పెద్ద గ్రిల్ పొందుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,690 మిమీ, 2,057 మిమీ ఎత్తు మరియు 1,880 మిమీ వెడల్పు కలిగి ఉంది. అంతే కాకుండా ఈ SUV 3,302 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ఈ కొత్త ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు ఉంటాయి. ఈ SUV లో ఎనిమిది మంది పెద్దలు చాలా అనుకూలంగా కూర్చోవచ్చు. ఈ SUV భారతీయ మార్కెట్లో అత్యంత అధునాతన మోడల్ కానుంది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 5,663 లీటర్ల (200 క్యూబిక్ అడుగులు) లగేజీ స్థలం ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఏడు టన్నుల బరువును మోయగలదు.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అధిక పనితీరును కలిగి ఉంది. ఈ SUV హైపర్ ఛార్జింగ్ ఆప్షన్‌తో 200 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుంది. ఈ హైపర్ ఛార్జర్‌ని ఉపయోగించి హెచ్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెండు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని ట్రిటాన్ తెలిపింది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 1,200 కిమీ ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త అధునాతన SUV ప్రపంచంలోనే పొడవైన ఎలక్ట్రిక్ వాహనాలలో ఒకటి. ఇది వాహనవినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ట్రిటాన్ ఈవి వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు B. పటేల్ మాట్లాడుతూ, ట్రిటాన్ EV కి భారతదేశం చాలా ముఖ్యమైన మార్కెట్ అవుతుంది. కావున కంపెనీ తెలంగాణ జహీరాబాద్‌లోని దాని తయారీ కర్మాగారంలో పూర్తి మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనంగా ఆవిష్కరించబడుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

అమెరికా వంటి అగ్ర రాజ్యం తరువాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రిటాన్ ఇవి తయారీ కర్మాగారం అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమ మరియు వాణిజ్య ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, తెలంగాణ రాజధానిలో మొట్టమొదటి ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా ఈవి పరిశ్రమలో భారతదేశపు విజయగాథలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఆయన అన్నారు. జయేశ్ రంజన్ కూడా ట్రిటాన్ EV బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పౌర మరియు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు మరియు ఐటి మరియు వాణిజ్య మంత్రి కెటి రామారావుతో మాట్లాడుతూ, ట్రిటాన్ EV నైపుణ్యం మరియు EV మార్కెట్ దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రిటాన్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లోని హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మెటాలిక్ బ్లూ కలర్ లో ఉండటం మీరు చూడవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

ట్రిటాన్ EV తయారీ కర్మాగారం జహీరాబాద్ ప్రాంతంలో ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వచ్చే ఐదేళ్లలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించబడుతుందని కంపెనీ తెలిపింది. రాబోయే కొన్ని నెలల్లో కంపెనీ దీనికోసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియా నుంచి ఇప్పటికే 2.4 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆర్డర్లు వచ్చాయని ట్రిటాన్ తెలిపింది.

ఒక్క ఛార్జ్‌తో 1,200 కిమీ పరిధి అందించే Triton కార్: త్వరలో వచ్చేస్తుందోచ్

భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ వంటి అనేక ఇతర దేశపు మార్కెట్లకు కంపెనీ ఈ ఆధునిక లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయనుంది. ఇందుకోసం తెలంగాణ కర్మాగారం ఉపయొగ్గుపడుతుంది. కావున ట్రిటాన్ కంపెనీ దేశీయ మార్కెట్లో త్వరలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతుంది.

Most Read Articles

English summary
Triton showcases h electric suv which travels upto 1200 kms on single charge details
Story first published: Thursday, October 14, 2021, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X