ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, గతేడాది మార్చ్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ప్రీమియం ఎస్‌యూవీని కంపెనీ తిరిగి ఇక్కడి మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

భారతదేశంలో ప్రారంభించటానికి ముందే కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఫేస్‌లిఫ్టెడ్ యొక్క టీజర్ ఇమేజ్‌ని కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఫోక్స్‌వ్యాగన్ త్వరలోనే ఈ కారును భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ అప్‌డేటెడ్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ 5-సీటర్ టిగువాన్ ఆధారంగా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

కొత్త 21021 ఫేస్‌లిఫ్టెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్‌లో కొన్ని కీలకమైన డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త షార్ప్ హెడ్‌ల్యాంప్స్, గుండ్రటి లోగోతో విభజించబడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

కొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ హెడ్ లైట్ల కోసం ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఐక్యూ లైటింగ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ఎదురుగా వస్తున్న వాహనాలపై ఎక్కువ కాంతి ప్రభావాన్ని చూపకుండా ఉండేలా, హైబీమ్ లైట్లను ఉపయోగించేందుకు సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

అప్‌డేటెడ్ టిగువాన్ ఆల్‌స్పేస్ సైడ్ ప్రొఫైల్, ఇదివరకటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొత్తగా 17ఇంచ్ నుండి 20-ఇంచ్ వరకూ వివిధ రకాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ వెనుక డిజైన్‌లో కూడా కొత్త బంపర్ మరియు కొత్త టెయిల్ లాంప్స్‌ను గమనించవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, పాత మోడల్‌కి ఈ కొత్త మోడల్‌కి మధ్య సూక్ష్మమైన మార్పులు ఉన్నాయి. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎమ్ఐబి3 మల్టీమీడియా సిస్టమ్, పెద్ద పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు టెంపరేచర్స్‌ని కంట్రోల్ చేయటానికి టచ్ సెన్సిటివ్ స్క్రోల్ ప్యాడ్ మొదలైనవి ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

అప్‌డేటెడ్ ఫీచర్లలో భాగంగా, కొత్త 2021 టిగువాన్ ఆల్‌స్పేస్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పవర్డ్ డ్రైవర్ సీట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్ గేట్ మరియు స్లైడింగ్ సెకండ్-రో సీట్స్ వంటి మరిన్ని అదనపు ఫీచర్లను కూడా ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

అలాగే, ఈ కారులో ఆఫర్ చేయబోయే కొన్ని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ ఎస్‌యూవీలో, ఇదివరకటి మోడల్‌లో ఉపయోగించిన 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ స్థానంలో మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. కాబట్టి, ఈ మోడల్‌లో అతిపెద్ద మార్పు ఇంజన్ రూపంలో ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

ఈ కారులోని కొత్త 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 190 హెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఇంజన్ నుండి వెలువడిన శక్తి మొత్తం ఫోక్స్‌వ్యాగన్ 4 మోషన్ టెక్ సాయంతో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపబడుతుంది. అంటే ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

గతంలో ఫోక్స్‌వ్యాగన్ విక్రయించిన టిగువాన్ ఆల్‌స్పేస్‌ను కంపెనీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించేది. ఫలితంగా దాని ధర కూడా అధికంగా ఉండేది.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ తిరిగి మార్కెట్లోకి వస్తోంది!

అయితే, కొత్తగా రానున్న అప్‌డేటెడ్ 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 5-సీటర్ మోడల్‌ను కంపెనీ స్థానికంగా భారతదేశంలో అసెంబుల్ చేయనున్న నేపథ్యంలో, ఇది మంచి పోటీ ధరతో మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇది ఈ విభాగంలో జీప్ కంపాస్, సిట్రోయెన్ యొక్క సి5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
New 2021 Volkswagen Tiguan Allspace India Launch Confirmed, Teaser Out. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X