విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ ఏడాది కొన్ని సరికొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ 2021లో భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

కంపెనీ ఈ మోడల్‌ను ఇప్పుడు భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. భారత మార్కెట్ కోసం ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కొడా కంపెనీలు సంయుక్తంగా చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక కార్లను ఇరు కంపెనీలు ప్రవేశపెట్టనున్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కూడా రానుంది. ఈ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీని కూడా ఎమ్‌క్యూబి ఏ0 ఐఎన్ ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మించనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై స్కొడా కుషాక్ అనే ఎస్‌యూవీని కూడా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

ఈ నేపథ్యంలో, స్కొడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు మోడళ్లలో అనేక పోలికలు ఉండొచ్చని అంచనా. అంతేకాకుండా, ఈ రెండు మోడళ్లలో ఉపయోగించే విడిభాగాలు మరియు పరికరాలు కూడా ఒకేలా ఉండే అవకాశం ఉంది. టైగన్ ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ మోడల్‌ను ఎక్కువ భాగం స్థానికంగానే తయారు చేయనుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్‍‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, క్రోమ్‌తో ఫినిష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, 17ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ లైట్స్, రూఫ్ స్టాప్ ల్యాంప్, సిల్వర్-ఫినిష్డ్ రూఫ్ రైల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బంపర్‌లపై సిల్వర్ ఎలిమెంట్స్ మరియు ముందు, వెనుక రెండు వైపులా ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

అలాగే, ఇందులోని ఇంటీరియర్స్‌ను గమనిస్తే, బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటుగా అనేక ఇతర ఫీచర్లు మరియు పరికరాలు ఇందులో లభిస్తాయి. ఈ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్పోర్టీ ఆల్-బ్లాక్ క్యాబిన్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ మొదలైన ఫీచర్లు ఉండన్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క టిఎస్ఐ శ్రేణి పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్లను ఇతర మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. టైగన్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నట్లు సమాచారం. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఫోక్స్‌వ్యాగన్ టైగన్; లేటెస్ట్ స్పై చిత్రాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో ఇప్పటికే పాపులర్ అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోడల్‌ని ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశారు. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, January 29, 2021, 13:04 [IST]
English summary
Volkswagen Taigun Spied Testing, New Details Revealed. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+