టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

జర్మన్ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారతీయ మార్కెట్లో తన టైగన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త ఎస్‌యూవీ చూడగానే 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎస్‌యూవీని గుర్తుకు తెస్తుంది. ఈ కొత్త టైగన్ ఎస్‌యూవీ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫారమ్‌ పై నిర్మించబడింది.

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

టైగన్ ఎస్‌యూవీ యొక్క డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో క్లీన్ లైన్స్, రెండు క్రోమ్ బార్‌లతో నడుస్తున్న సొగసైన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ డీఆర్‌ఎల్‌లతో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ముందు బంపర్ ఇరువైపులా ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. బంపర్ లో ఎయిర్ డ్యామ్ మరియు ఫ్రంట్ స్కఫ్ ప్లేట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్ ప్రొఫైల్‌ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇది ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ 19 ఇంచెస్ చక్రాలను కలిగి ఉంది. వెనుక భాగంలో, టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా నడిచే పెద్ద లైట్ బార్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ టైల్యాంప్‌లు లైట్ బార్‌లో విలీనం చేయబడ్డాయి. లైట్‌బార్ మధ్యలో వోక్స్వ్యాగన్ బ్యాడ్జ్ ఉంది.

MOST READ:ఏప్రిల్ నెలలో కొత్త కార్ల జాతర; సి5 ఎయిర్‌క్రాస్, సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, ఆక్టేవియా

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

వెనుక బంపర్‌లలో క్రోమ్ యాక్సెంట్స్, స్కఫ్ ప్లేట్ మరియు రిఫ్లెక్టర్లు ఉన్నాయి, ఇవి ఎస్‌యూవీ యొక్క స్పోర్టి మరియు ప్రీమియం స్వభావాన్ని మరింత పెంచుతాయి. టైగన్ ఎస్‌యూవీలో బ్లాక్ రూప్, సిల్వర్ ఫినిషింగ్ రూప్ రైల్స్ మరియు రూప్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ టాప్-స్పెక్ జిటి లైన్‌తో సహా పలు ట్రిమ్‌లలో అందించనుంది. దీని స్టాండర్డ్ వేయియంట్ కంటే టాప్-స్పెక్ వేరియంట్‌లో కొన్ని అప్డేటెడ్ కాస్మెటిక్ మార్పుల ఉన్నాయి. ఇందులో రెడ్ బ్రేక్ కాలిపర్స్, రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్, జిటి బ్యాడ్జింగ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి.

MOST READ:ఒకేరోజు 10 సఫారీ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన టాటా మోటార్స్; వివరాలు

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ క్యాబిన్ ఇప్పుడు డాష్ బోర్డు మధ్యలో ముదురు బూడిద రంగు ప్యానెల్ కలిగి ఉంది. ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో జత చేయబడి, ఎస్‌యూవీ యొక్క స్పోర్ట్‌నెస్‌ను పెంచుతుంది.

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

టైగన్‌లోని మరిన్ని ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇది 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫులీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ, రియర్ ఎసి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి కలిగి ఉంది.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6-ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.

టైగన్ లోని1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, ఇందులో ఉన్న మరో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి, మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టైగన్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్; వివరాలు

వోక్స్వ్యాగన్ టైగన్ బ్రాండ్ యొక్క సరికొత్త ఎస్‌యూవీ ఆఫర్, ఇది దేశీయ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఉంచబడుతుంది. వోక్స్వ్యాగన్ టైగన్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. వోక్స్వ్యాగన్ టైగన్ స్థానికంగా ఉత్పత్తిచేసే అవకాశాలు ఉన్నాయి.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

Most Read Articles

English summary
Volkswagen Taigun Production Version Officially Unveiled. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X