ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని చూశారా? చాలా విచిత్రంగా కనిపిస్తోంది. దీని పేరు K5 (కె5), చైనాకి చెందిన electricKar (ఎలక్ట్రిక్ కార్) అనే సంస్థ దీనిని తయారు చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ప్రపంచంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. దీని ధర కేవలం 2100 అమెరికన్ డాలర్లు మాత్రమే.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

అంటే, మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం సుమారు రూ. 1.54 లక్షలు. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అలీబాబా (alibaba.com) లో ఈ ఎలక్ట్రిక్ కారును విక్రయానికి ఉంచారు. క్వాడ్రిసైకిల్ (నాలుగు చక్రాల వాహనం) రూపంలో ఉండే ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

దీని ధరకు తగినట్లుగానే, ఈ కారులో ఆఫర్ చేసే ఫీచర్లు కూడా చాలా కనీసంగా ఉంటాయి. సింపుల్ డిజైన్, తక్కువ రేంజ్ మరియు తక్కువ స్పీడ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. electricKar K5 గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించదు. అంతేకాదు, పూర్తి ఛార్జ్‌పై దీని రేంజ్ సుమారు 52 కిమీ నుండి 66 కిమీ వరకు ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

కాబట్టి, ఇది హైవే ప్రయాణాలకు అనువుగా ఉండదు, చిన్నపాటి సిటీ ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మరొక షాకింగ్ విషయం ఏంటంటే, ఇందులో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ లేదు. దీని బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి కనీసం 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం ఇది చైనా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

K5 ఎలక్ట్రిక్ కారులో అందరినీ ఆకర్షించే విషయం ఏంటంటే, దాని సరసమైన ధర. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. ఇది రెండు వైపులా డోర్లను కలిగి ఉండి, పూర్తిగా కవర్ చేయబడి ఉన్న నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది సాంప్రదాయ టూవీలర్‌కి ప్రత్యామ్నాయంగా మరియు అన్ని వాతావరణాల్లో ప్రయాణీకులకు రక్షణ కల్పించేలా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

కారు లోపల స్టీరింగ్ సాధారణ టూవీలర్ హ్యాండిల్ బార్ మాదిరిగా ఉంటుంది. కంట్రోల్ అన్నీ కూడా ఈ హ్యాండిల్ బార్ పైనే అమర్చబడి ఉంటాయి. డ్యాష్‌బోర్డులో బ్యాటరీ స్థితి, స్పీడ్ వంటి అంశాలను తెలిపేందుకు ఎల్‌సిడి డిస్‌ప్లే యూనిట్ కూడా ఉంటుంది. ఇందులో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

ఈ కారును రీగల్ రాప్టర్ మోటార్స్ ద్వారా electricKar సంస్థ తయారు చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్ల ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగిన సంస్థ. దీని ద్వారా, ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేసి చైనాలో అమ్మకానికి తీసుకువచ్చింది. మరి భారత్‌లో అందుబాటులోకి వస్తుందో లేదో చూడాలి.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

ఇక మనదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ జాబితాలో Tata Nexon EV (టాటా నెక్సాన్ ఈవీ) ఉంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, కంపెనీ రేపు (ఆగస్ట్ 30, 2021వ తేదీన) తమ కొత్త Tata Tigor EV (టాటా టిగోర్ ఈవీ) ని ప్రవేశపెట్టనుంది. Tigor EV మార్కెట్లోకి వచ్చిన తర్వాత, సుమారు రూ. 11 లక్షల ప్రైస్ రేంజ్ లో ఇదే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అయ్యే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

అమెరికా మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి నిస్సాన్ లీఫ్ (Nissan Leaf), అక్కడి మార్కెట్లో దీని ధర 27,400 అమెరికన్ డాలర్లు. మనదేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా ఎలక్ట్రిక్ కార్లపై పన్నుల రాయితీ ఉంటుంది, ఈ రాయితీల తర్వాత దీని ధర సుమారు 20,000 అమెరికన్ డాలర్లకు దిగొచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, ఫ్రాన్స్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు Citroen AMI, అక్కడి మార్కెట్లో దీని ధర 6090 యూరోల నుండి ప్రారంభం అవుతుంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది..

ఇదిలా ఉంటే, మనదేశంలో Tata Motors విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు Nexon EV లో కంపెనీ మరింత శక్తివంతమైన వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల లీకైన సమాచారం ప్రకారం, కొత్త అప్‌గ్రేడెడ్ నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Nexon EV (129 బిహెచ్‌పి శక్తిని) కన్నా అదనంగా 7 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు, ధర కేవలం రూ.1.54 లక్షలు మాత్రమే!

ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ 30.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది. పూర్తి చార్జ్ పై ఇది గరిష్టంగా 312 కిలో మీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జర్ తో కేవలం 60 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Worlds most affordable electric quadricycle k5 goes sale in china details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X