టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్లో తమ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ "అర్బన్ క్రూయిజర్ హైరైడర్" (Toyota Urban Cruiser Hyryder) ఇటీవలే విడుదల చేసింది. టొయోటా-మారుతి సహకారంతో 'D22' అనే కోడ్‌నేమ్‌తో తయారైన ఈ కొత్త టొయోటా ఎస్‌యూవీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పాపులర్ మోడళ్లయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, టాటా హారియర్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో నేరుగా పోటీపడుతుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

ప్రస్తుతం, భారత ఎస్‌యూవీ మార్కెట్లో ఐదు సీట్ల మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందింది మరియు అత్యంత పోటీతో కూడుకున్నది. టొయోటా ఈ గుంపు నుండి తమ ఎస్‌యూవీని వేరుగా ఉంచేందుకు మరియు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకునేందుకు ఈ వాహనంలో ప్రత్యేకంగా ఏదైనా అందించాలి. కాబట్టి, టొయోటా తమ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను మరియు ఇతర పరికరాలను అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఈ కథనంలో చూద్దాం రండి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

డిజైన్

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దాని ప్రత్యేకమైన డిజైన్‌తో మొదటి చూపులోనే కార్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో బానెట్ కి దిగువన మరియు ఫ్రంట్ బంపర్‌కి పైన అమర్చిన సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ డిజైన్, ఫ్రంట్ బంపర్‌లో అమర్చబడిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, బంపర్ పైభాగంలో కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తో కూడిన మరొక ప్యానెల్ మరియు దానిపై ఇరువైపులా క్రోమ్ గార్నిష్, మధ్యలో టొయోటా లోగోతో ఇది ముందు వైపు నుండి పొడవాటి వైఖరి కలిగిన ఎస్‌యూవీ చాలా స్టైలిష్ గా ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

సైడ్ డిజైన్ ను గమనిస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్‌తో కూడిన బ్లాక్-అవుట్ అవుట్ రియర్ వ్యూ మిర్రర్‌లు, పెద్ద 17 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌లు మరియు ఈ ఎస్‌యూవీకి రగ్గడ్ లుక్ ఇవ్వడానికి కారు చుట్టూ బ్లాక్ క్లాడింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. సైడ్స్ లో ఏ, బి, సి పిల్లర్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉండి, బ్లాక్-అవుట్ రూఫ్ తో చాలా స్పోర్టీగా మరియు కాంటెంపరరీగా కనిపిస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

ఇక ఈ ఎస్‌యూవీ వెనుక వైపు నుండి చాలా అందగా కనిపిస్తుంది. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెనుక భాగంలో షార్ప్ విండ్‌స్క్రీన్‌ ఉంటుంది మరియు టెయిల్‌గేట్‌పై C-ఆకారపు మూలకాలతో చాలా విభిన్నంగా కనిపించే స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇవి రెండూ ఒకదానికొకటి మందపాటి క్రోమ్ స్లాట్ ద్వారా కనెక్ట్ చేయబడినట్లుగా ఉంటాయి. రూఫ్ ని అంటిపెట్టుకుని ఉండే స్పోర్టీ స్పాియలర్, వెడల్పాటి ఓపెనింగ్ కలిగిన టెయిల్ గేట్, పెద్ద రియర్ బంపర్ మరియు దాని క్రింది సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్‌తో ఇది వెనుక వెనుక వైపు నుండి చాలా పెద్దగా ఎస్‌యూవీగా తెలుస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో ప్రధానంగా వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

సేఫ్టీ

సేఫ్టీ పరంగా చూస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెండ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లు

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొత్తం 4 ట్రిమ్‌లలో లభిస్తుంది. వీటిలో E, S, G మరియు V అనే వేరియంట్లు ఉన్నాయి. ఈ 4 వేరియంట్‌లు నియోడ్రైవ్ సెటప్ (మైల్డ్-హైబ్రిడ్) లో అందుబాటులో ఉండగా, హైబ్రిడ్ వేరియంట్ టాప్ 3 వేరియంట్‌లను మాత్రమే పొందుతుంది. దానికి అదనంగా, టాప్-ఎండ్ నియోడ్రైవ్ వేరియంట్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన AWD (ఆల్-వీల్ డ్రైవ్) లేఅవుట్‌తో లభిస్తుంది. ఇది 7 సింగిల్-టోన్ మరియు 4 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

వారంటీ

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. అవసరమైతే దీన్ని 5 సంవత్సరాలు లేదా 2.2 లక్షల కిమీ వరకు పొడిగించుకోవచ్చు. దీనికి అదనంగా, ఇందులోని బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీని అందిస్తోంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

పవర్‌ట్రైన్ (ఇంజన్)

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి రెండూ కూడా వద్ద 1.5-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. అయితే, వీటి హైబ్రిడ్ యూనిట్ సెటప్ లో మాత్రం మార్పులు ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో ఉపయోగించిన మైల్డ్ హైబ్రిడ్ యూనిట్ మారుతి సుజుకి నుండి తీసుకోబడింది. ఈ పవర్‌ట్రెయిన్ 100.5bhp పవర్ మరియు 135Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ సెటప్‌తో AWD లేఅవుట్ కూడా అందించబడుతుంది. అయితే, ఇది కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

ఇకపోతే, రెండవది స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌, ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడిన మరింత సమర్థవంతమైన అట్కిన్సన్ సైకిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగించారు. ఈ ఇంజన్ 87bhp పవర్ మరియు 122Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 79bhp పవర్ మరియు 141Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా, ఈ పవర్‌ట్రెయిన్ యొక్క కంబైన్డ్ అవుట్‌పుట్ 114bhp గా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ - డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజన్, వేరియంట్లు, వారంటీ, ధర

బుకింగ్‌లు మరియు ధర

ఆసక్తిగల కస్టమర్లు టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ఆన్‌లైన్‌లో కానీ లేదా టొయోటా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్ అడ్వాన్స్ రూ. 25,000గా నిర్ణయించబడింది. టొయోటా ఇంకా ఈ ఎస్‌యూవీ యొక్క అధికారిక ధరను వెల్లడి చేయనప్పటికీ, దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 10 లక్షల ప్రారంభం కావచ్చని అంచనా.

Most Read Articles

English summary
All you need to know about toyota urban cruiser hyryder suv
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X