బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

ఇటీవల భారతదేశంలోకి ప్రవేశించిన చైనీస్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో' (BYD Auto), తాజాగా భారత మార్కెట్లో తమ రెండవ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. దేశీయ విపణిలో ఇప్పటికే బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని విక్రయిస్తున్న కంపెనీ, ఇప్పుడు బివైడి అట్టో3 (BYD Atto3) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

Mini Cooper SE Electric Launched In India | Price Rs 47.20 Lakh |270KM Range, DC Fast Charging &More

బివైడి ఇండియా తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BYD Atto3 కి సంబంధించిన లేటెస్ట్ టీజర్‌ను కూడా వెల్లడి చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఇది భారతదేశంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ టీజర్ ను గమనిస్తే, కంపెనీ ఇందులో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ఫ్రంట్‌ ప్రొఫైల్‌ను వెల్లడి చేసింది. ఇందులో ఎస్‌యూవీ యొక్క ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు అస్పష్టంగా ఉన్న ఫ్రంట్ ప్రొఫైల్ తప్ప ఇతర వివరాలేమీ కనిపించడం లేదు.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

నివేదికల ప్రకారం, బివైడి అట్టో3 ధర రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

ప్రస్తుతం, బివైడి ఇండియా తమ ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని పూర్తిగా విదేశాలలో తయారు చేసి, భారతదేశానికి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) రూట్‌లో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే అట్టో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఇదే విధంగా ఇంపోర్టెడ్ మోడల్‌గా విక్రయించబడే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఇది ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా, కియా ఈవీ6 మరియు త్వరలో రాబోయే హ్యుందాయ్ ఐయానిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

కొన్ని నివేదికల ప్రకారం, బివైడి అట్టో3 పర్మినెంట్ సింక్రోనస్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 204 బిహెచ్‌పి శక్తిని మరియు 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బరువు 1680-1750 కిలోల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే, బివైడి అట్టో3 ఈ విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

మీ సమాచారం కోసం, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 176 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 136 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బివైడి ఆటో తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో మొదటిది 49.92 kWh బ్యాటరీ ప్యాక్ మరియు ఇది పూర్తి చార్జ్ పై 320 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఇకపోతే, రెండవది 60.48 kWh బ్యాటరీ ప్యాక్, ఇది పూర్తి చార్జ్ పై 420 కిమీ రేంజ్ ను అందిస్తుంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

బివైడి ఆటో తమ ఎలక్ట్రిక్ బ్లేడ్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీలను ఉపయోగిస్తుంది. ఇవి సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కన్నా ఎక్కువ రేంజ్ మరియు మెరుగైన రక్షణను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. సమాచారం ప్రకారం, బివైడి ఇండియా తమ కొత్త అట్టో3 (Atto3) ఎస్‌యూవీని ప్రస్తుత పండుగ సీజన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. బివైడి ఇండియా తమ వాహనాలను అసెంబుల్ చేయడానికి చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో ఓ అసెంబుల్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

బివైడి ఇండియా రానున్న రెండేళ్లలో భారతదేశంలో దాదాపు 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది. ఈ కంపెనీ ఇటీవలే భారతదేశంలో తమ రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో బివైడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ డీలర్‌షిప్ ను ప్రారంభించింది. భారత మార్కెట్లో భవిష్యత్తులో మరింత అగ్రెసివ్‌ గా వ్యాపారం చేసేందుకు, దేశంలోనే స్థానిక తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని అన్వేషించడానికి కూడా బివైడి ఇండియా సిద్ధంగా ఉంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

బివైడి ఇండియా గతేడాది నవంబర్ నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం 'బివైడి ఇ6' (BYD e6) ని విడుదల చేసింది. ఇది చూడటానికి దాదాపు టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ఫ్యూచరిస్టిక్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, బివైడి ఇ6 కేవలం 5-సీటర్ వెర్షన్ గా మాత్రమే అందుబాటులో ఉంటుంది. బివైడి ఇ6 భారతదేశంలో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని స్వీకరించిన మొదటి ప్రీమియం ఎమ్‌పివి. దేశీయ మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ధర రూ. 29.15 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

బివైడి అట్టో3 (BYD Atto3) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ వెల్లడి.. పండుగ సీజన్‌లో విడుదల!

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారులో పెద్ద 71.7 కిలోవాట్అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఇందులోని 70 కిలోవాట్అవర్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫ్రంట్ యాక్సిల్ లో అమర్చబడి ఉంటుంది. ఈ పవర్‌ట్రైన్ సాయంతో బివైడి ఇ6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

Most Read Articles

English summary
Byd plans to launch its second electric car in india byd atto3 teaser out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X