అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

ఖరీదైన కార్లను మరియు బైకులను కొనుగోలు చేసే జాబితాలో సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రెటీలే ఎక్కువగా ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. గతంలో మనం చాలా మంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన కొత్త ఖరీదైన కార్లను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు దీపికా పదుకొనే & రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన కొత్త కారుని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది.

దీపికా పదుకొనే & రణవీర్ సింగ్ కోన్ కారు ఏది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన సెలబ్రెటీ జంటల్లో 'దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్' జంట ఒకటి. వీరు ఇటీవల ఒక ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు బెంజ్ కంపెనీ యొక్క 'మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 4మాటిక్' అని తెలిసింది. ఈ లగ్జరీ SUV ధర రూ. 2.8 కోట్లు (ఎక్స్-షోరూమ్).

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

ఈ కొత్త లగ్జరీ కారు దీపికా ప్రకాశ్ పదుకొనే పేరుతో 2022 సెప్టెంబర్ 2 న ముంబై ఆర్టీఓలో రిజిస్టర్ చేయబడినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఇప్పటికే 2021 జూన్ నెలలో రణ్వీర్ సింగ్ తన 36 వ పుట్టినరోజు సందర్భంగా కూడా 'మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600' కొనుగోలు చేశారు. అయితే ఈ లగ్జరీ కారు వేరే పేరు మీద రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఈ రెండు లగ్జరీ కార్లు ఒకే కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

ఇటీవల దీపికా పదుకొనే తన 'మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 4మాటిక్' కారులో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దీపికా పదుకొనే 'జిఎల్ఎస్ 600' కారు నుంచి కిందికి దిగటం చూడవచ్చు. అంతే కాకుండా లోపలి వెళ్లే ముందు అభిమానులతో ఫోటోలు కూడా దిగటం ఇక్కడ చూడవచ్చు. ఆ తరువాత ఆమె లోపలి వెళ్ళిపోతుంది.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

మెర్సిడెస్ మేబాచ్ GLS600 లగ్జరీ కారు విషయానికి వస్తే, ఇది 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌ పొందుతుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ పొందుతుంది. వీటిలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు. అంతే కాకుండా డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, 'మేబాచ్' బ్రాండ్ లోగో వంటివి కూడా ఈ లగ్జరీ SUV లో చూడవచ్చు.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్, డాష్‌బోర్డ్‌లో నాప్ప లెదర్ వంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇందులో లేటెస్ట్ మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటుంది.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

నిజానికి ఇది 4 మరియు 5 సీట్ల ఎంపికలలో తీసుకురాబడింది. 4 సీట్ల వెర్షన్ షాంపేన్‌ను నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్‌ను కలిగి ఉన్న స్థిర సెంటర్ కన్సోల్‌తో వస్తుంది. వెనుక భాగంలో 4 సీటర్లు మరియు 5 సీట్ల వెర్షన్లలో రిక్లైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ మరియు ప్రీ-సేఫ్ సిస్టమ్ ఇవ్వబడ్డాయి. వీటితో పాటు పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్ మరియు మసాజ్ సీట్ వంటివి ఉన్నాయి.

అత్యంత ఖరీదైన 'దీపికా పదుకొనే' కొత్త లగ్జరీ కారు - ధర ఎంతంటే?

దీపికా పదుకొనే మరియు రణ్ వీర్ సింగ్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 కారుతో పాటు లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, ఆడి క్యూ5 మరియు జాగ్వార్ XJ L వంటి వాటిని కూడా కలిగి ఉన్నారు.

Most Read Articles

English summary
Deepika padukone new mercedes maybach gls600 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X