ప్రపంచ కుబేరుడు కారు కొంటే, ఇలాగే ఉంటది.. గౌతమ్ అదానీ కొత్త కారు: ధర & వివరాలు

ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న 'గౌతమ్ అదానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరిన భారతీయుడు. గౌతమ్ ఆదానీ అంటే చాలామందికి ఆదానీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అని మాత్రమే తెలుసు, అయితే ఈయన ఎలాంటి కార్లనుఉపయోగిస్తారు అనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంత మందికి తెలుసుకోవాలనే ఉత్సాహమూ ఉండవచ్చు.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

గౌతమ్ అదానీ కార్లను గురించి గతంలో కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం.. అయితే ఇటీవల ఈయన మరో కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

నివేదికల ప్రకారం, గౌతమ్ అదానీ కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కారు 'రేంజ్ రోవర్' అని తెలుస్తోంది. దీని ధర అక్షరాలా రూ. 4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫోటోలను అదానీ hottestcarsin.india అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయబడ్డాయి. ఇందులో వైట్ కలర్ రేంజ్ రోవర్ కారుని చూడవచ్చు.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

గౌతమ్ అదానీ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ యొక్క వేరియంట్ భారతదేశంలో అందుబాటులో ఉన్న రేంజ్ రోవర్ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్లలో ఒకటైన ఆటోబయోగ్రఫీ 3.0 డీజిల్ యొక్క లాంగ్-వీల్ బేస్. అంతే కాకుండా ఇది 7 సీటర్ వెర్షన్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ పొందుతుంది.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

గౌతమ్ అదానీ యొక్క రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 3.0 లీటర్ ఇన్లైన్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 346 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులోని కొత్త గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్ వంటివి చూడచక్కగా ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ లో 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌, రోటర్ ప్రొఫైల్ లో బ్లాక్-అవుట్ టెయిల్‌లైట్‌ వంటివి ఉన్నాయి.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇప్పటికే చెప్పుకున్న విధంగా ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ కలర్ లో ఉంటుంది. అదే సమయంలో ఇందులో 13.7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటివి ఉన్నాయి. వెనుక ఉన్న ప్రయాణికుల కోసం 11.4 ఇంచెస్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఇవి ప్రయాణంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగపడతాయి.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

ఇదిలా ఉండగా, గౌతమ్ అదానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఫెరారీ కాలిఫోర్నియా, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ మరియు ఆడి క్యూ7 వంటివి ఉన్నాయి. వీటితో పాటు అదానీ 'ఎంబ్రేయర్ లెగసీ 650, బొంబార్డియర్ ఛాలెంజర్ 605 మరియు బీచ్‌క్రాఫ్ట్ 850ఎక్స్‌పి' వంటి హెలీకాఫ్టర్లను కూడా కలిగి ఉన్నాడు.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

అదానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ 6.6-లీటర్, ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 562 బిహెచ్‌పి పవర్ మరియు 780 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

ఇక ఫెరారీ కాలిఫోర్నియా విషయానికి వస్తే, ఇది 4.3 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 453 బిహెచ్‌పి పవర్‌ మరియు 485 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

ప్రపంచ కుబేరుడు 'గౌతమ్ అదానీ' కొత్త కారు: వివరాలు

ప్రపంచంలో రెండవ సంపన్నుడైన గౌతమ్ అదానీ ఆస్తి విషయానికి వస్తే, ఇతని ఆస్తి విలువ ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 154.7 బిలియన్ డాలర్లు. ఇదివరకు రెండవ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనకకు నెట్టి ఆ స్థానంలో గౌతమ్ అదానీ చేరిపోయాడు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచ కుబేరుడైన గౌతమ్ అదానీ గ్యారేజిలోకి ఇప్పుడు మరో ఖరీదైన కారు చేరింది. ఇది మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఒకటి కావడం విశేషం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Gautam adani land rover range rover lwb suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X